
రానా
పోలీసాఫీసర్‌గా ప్రత్యేక శిక్షణ తీసుకోబోతున్నారు రానా. ‘విరాటపర్వం’ సినిమా కోసమే ఈ ట్రైనింగ్. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందుతోంది. 1980 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ మూవీలో రానా పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. పోలీసాఫీసర్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే బాగుంటుందనే విషయం మీద ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్ దగ్గర రానా స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నారు. పోలీస్ లుక్ కరెక్ట్‌గా రావడం కోసం స్పెషల్ డైట్ ప్లాన్‌ను కూడా ఫాలో అవుతున్నారట రానా. అలాగే ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారు సాయి పల్లవి. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ కొత్త ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఇటీవల వికారాబాద్ ఫారెస్ట్‌లో జరిగిన షూటింగ్‌లో రానాతో పాటు కీలక తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.