Rana Daggubati Shares Virataparvam Movie Women's Day Special Video - Sakshi
Sakshi News home page

Virata Parvam: రానా స్పెషల్‌ వీడియో

Published Mon, Mar 8 2021 12:11 PM | Last Updated on Mon, Mar 8 2021 6:42 PM

Virata Parvam: Rana Daggubati Womens Day wishes Posts a Video - Sakshi

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక చిత్రం విరాటపర్వం. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేణు ఊడుగు డైరెక్ట్‌ చేస్తున్నారు. 'రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్' అనేది ట్యాగ్‌లైన్‌. ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను రానా, సాయిపల్లవి చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తాజాగా మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నివాళి అర్పిస్తూ చిత్ర బృందం ‘విరాట పర్వం’ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

‘విరాట పర్వం’లోని కీలక పాత్ర‌ల్లో న‌టించిన‌ ప్రముఖ మహిళల వ్యక్తిత్వాలను వివరిస్తూ హీరో రానా వాయిస్‌తో ఓ వీడియోని విడుద‌ల చేశారు. ‘చ‌రిత్ర‌లో దాగిన క‌థ‌ల‌కు తెర‌లేపిన ప్రేమ త‌న‌ది. ప్రేమ కూడా మాన‌వ స్వేచ్ఛ‌లో భాగమేనని న‌మ్మిన వ్య‌క్త‌త్వం త‌న‌ది. మ‌హా సంక్ష‌భ‌మే ఒక గొప్ప శాంతికి దారి తీస్తుంద‌ని న‌మ్మిన విప్ల‌వం త‌న‌ది. అడ‌వి బాట‌ప‌ట్టిన అనేక‌మంది వీరుల త‌ల్లుల‌కు వీళ్లు ప్ర‌తిరూపాలు. వీళ్ల మార్గం అన‌న్యం.. అసామాన్యం.. రెడ్ సెల్యూట్ టు ఆల్‌ గ్లోరియ‌స్ ఉమెన్స్‌` అంటూ రానా మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళా లోకానికి త‌న రెడ్ సెల్యూట్‌ని ప్ర‌క‌టించారు.

చదవండి: వైరలవుతున్న సమంత డ్యాన్స్‌ వీడియో

ఈ వీడియోలో సాయి పల్లవి, ప్రియమణి, ఈశ్వరి రావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ కనిపిస్తున్నారు. డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్‌  చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారతక్క అనే నక్సల్‌ పాత్రలో ప్రియమణి కనిపించనున్నారు.

చదవండి : ‘విరాటపర్వం’ విడుదల తేదీ ఖరారు

రానాతో సాయిపల్లవి కోలు.. కోలు...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement