Virataparvam Release Date Has Been Fixed- Sakshi
Sakshi News home page

‘విరాటపర్వం’ విడుదల తేదీ ఖరారు

Published Thu, Jan 28 2021 6:17 PM | Last Updated on Thu, Jan 28 2021 8:46 PM

Rana Virataparvam Release Date Announced - Sakshi

రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. 1990లలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో డా. రవి శంకర్‌ అలియాస్‌ న‌క్స‌లైట్ నాయ‌కుడు కామ్రేడ్‌ రవన్నగా రానా  తన విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నారు. చదవండి: కామ్రేడ్‌ రవన్న వస్తున్నాడు..

‘రివల్యూషన్‌ ఈజ్‌ యాన్‌ యాక్ట్‌ అఫ్‌ లవ్‌ అనే క్యాప్షన్‌ ‘విరాటపర్వం’ సినిమా థీమ్‌ను తెలియజేస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుపుకోంటుంది. ఇటీవల ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నట్టు కొత్త పోస్టర్‌ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రానా అభిమానులకు చిత్ర యూనిట్‌ శుభవార్తను అందించింది. ఏప్రిల్‌ 30 న విరాటపర్వం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement