
దగ్గుబాటి వారసుడు రానా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. ‘నీది నాదీ ఒకే కథ’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకుడు. 1990ల నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానాతో పాటు సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా శనివారం రానా పుట్టినరోజు సందర్భంగా... విరాటపర్వం ఫస్ట్‌గ్లింప్స్ విడుదలైంది. ముఖానికి ఎర్రటి వస్త్రం కట్టుకుని తీక్షణంగా చూస్తున్న రానా లుక్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో రానా పోలీసు అధికారిగా కనిపిస్తుండగా... గాయకురాలిగా ఉండి, అనూహ్య పరిణామాల మధ్య నక్సల్ ఉద్యమంలో చేరే ఓ యువతి పాత్రను సాయి పల్లవి పోషిస్తున్నారు. వీరితో పాటు నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక రానా పుట్టినరోజు సందర్భంగా అతడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘నువ్వు చేసే ప్రతీ పనిలో విజయవంతం కావాలి. హ్యాపీ బర్త్‌డే రానా’ అని ప్రిన్స్ మహేష్‌బాబు ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందనగా.. మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో అతడి పాత్రను ఉటంకిస్తూ.. ‘థ్యాంక్యూ చీఫ్’ అంటూ రానా బదులిచ్చాడు. మహేష్‌తో పాటు హీరో రామ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సహా ఇతర సెలబ్రిటీలు రానాకు విషెస్ చెప్పారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ సైతం రానాకు శుభాకాంక్షలతో పాటుగా.. ఫస్ట్‌లుక్ సూపర్‌గా ఉందంటూ అభినందనలు తెలిపాడు.
And here is the first glimpse of my next #Virataparvam !! #RevolutionisanactofLove with @SLVCinemasOffl @SureshProdns @venuudugulafilm @Sai_Pallavi92 pic.twitter.com/3huc3xeRs4
— Rana Daggubati (@RanaDaggubati) December 13, 2019
Happy birthday, @RanaDaggubati! Wishing you success in everything you do. Have an incredible year ahead 🤗🤗 pic.twitter.com/lS7Mi1LZDC
— Mahesh Babu (@urstrulyMahesh) December 14, 2019
Congratulations Rana!!! @RanaDaggubati ! This looks super exciting 👍👍👍👍👍👍👍 https://t.co/hxEYLWrlCB
— Karan Johar (@karanjohar) December 14, 2019
Comments
Please login to add a commentAdd a comment