వేలూరు: తమిళనాడు అబ్బాయి.. దక్షిణ కొరియా అమ్మాయి.. వివాహం బుధవారం వాణియంబాడిలో ఘనంగా జరిగింది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని వెల్లకుట్ట గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ కొయంబత్తూరులో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివి ఉద్యోగం కోసం దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడ డాక్టరేట్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం కొరియాలోని ఓ ప్రైవేటు కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
దక్షణ కొరియాలో బూసాన్ ప్రావిన్స్‌కు చెందిన సెంగ్వాన్‌మున్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబ సభ్యులు భారతీయ సంప్రదాయం పద్ధతిలో వివాహం చేసుకోవా లని నిర్ణయించడంతో దక్షిణ కొరియాకు చెందిన సెంగ్వాన్‌మున్ కుటుంబ సభ్యులు గత వారం భారతదేశానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం వానియంబాడిలోని ప్రైవేటు కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ప్రవీణ్ కుమార్, సెంగ్వాన్‌మున్‌ల వివాహం వైభవంగా జరిగింది.
చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, స్టైలిష్ లుక్ అదిరిందయ్యా!
Comments
Please login to add a commentAdd a comment