'మా అమ్మాయి పెళ్లి ఇంకా కాలేదు'
తన కూతురు అమలాపాల్, తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ అలువా సమీపంలోని ఓ చర్చిలో కేవలం ప్రార్థనలు చేసేందుకు వెళ్లారే తప్ప ఇంకా వాళ్లకు పెళ్లి కాలేదని అమలాపాల్ తండ్రి పాల్ వర్గీస్ స్పష్టం చేశారు. వరపుజ ఆర్చిడయాసిస్కు ఈ మేరకు ఆయన ఓ లేఖ కూడా రాశారు. చర్చిలో వాళ్లు కేవలం ప్రార్థనలు చేశారే తప్ప పెళ్లికి సంబంధించిన తంతు ఏమీ జరగలేదన్నారు.
అయితే, మీడియాలోని ఓ వర్గంలో మాత్రం వాళ్లిద్దరికీ పెళ్లి అయిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చిందని పాల్ వర్గీస్ తెలిపారు. క్రిస్టియన్ కాని వ్యక్తితో అమలాపాల్ పెళ్లిని చర్చిలోపల ఎలా అనుమతిస్తారంటూ భక్తులలో ఒక వర్గం తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేయడంతో ఆయనీ స్పష్టత ఇచ్చారు. కేవలం ఆమె హీరోయిన్ కావడం వల్లే ఇంత గొడవ జరిగిందని చెప్పారు. అమల, విజయ్ ఇద్దరికీ చెన్నైలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కానుంది.