అమలాపాల్ రోజులు లెక్కపెట్టుకుంటోంది
చారడేసి కళ్ల అమలాపాల్ రోజులు లెక్కపెట్టుకుంటోంది. ఆమెకిప్పుడు క్షణాలు యుగాలుగా ఉన్నాయి. 'ఇంకా ఎనిమిది రోజులు' అంటూ ఆమె మురిపెంగా ట్వీట్ చేసింది.
ఇంతకీ ఎందుకింత సందడి? అమలాపాల్ పెళ్లి కూతురవుతోంది. డైరెక్టర్ విజయ్ తో జీవితాన్ని పంచుకునేందుకు ఆమె వివాహబంధంలోకి ఎంటరవుతోంది. 'ఒకరితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించేసుకున్న తరువాత అది ఎంత తొందరగా జరిగితే అంత బాగుటుంది. ఇంకా ఎనిమిది రోజులే' అంటూ ఆమె ట్విటర్లో రాసింది. విజయ్ తో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను కూడా ఆమె తన ఫేస్ బుక్ లో పెట్టింది.
అమలాపాల్ కి ఇక ఇంటి పేరు మారడమే తరువాయి. జూన్ 7 న ఎంగేజ్ మెంట్, 12 న పెళ్లికి ఇక అంతా రెడీ. ఎంగేజ్ మెంట్ కి వైట్ గౌన్, పెళ్లికి ఫెళఫెళలాడే కాంజీవరం సిల్కు చీర సిద్ధంగా ఉన్నాయి. ఇక రీల్ లైఫ్ లేదు. అంతా రియల్ లైఫే అంటోంది అమలమ్మ.
సినిమాలో ఎన్ని తాళిబొట్లు కట్టించుకున్నా అసలు అసలే. నకిలీ నకిలీయే. ఒరిజినల్ పెళ్లి కాబట్టే అమల అంత అందంగా, తృప్తిగా నవ్వుతోంది మరి.