వరుడు శివానంద, వధువు నాగప్పకు పెళ్లి వేడుక
కర్ణాటక: ఈ ఏడాదిలో వానలు లేకపోవడంతో గ్రామస్తులు వినూత్నంగా ఇద్దరు మగపిల్లలకు పెళ్లిచేసి వరుణ దేవుడు కరుణించాలని పూజలు చేశారు. ఈ విచిత్ర సంఘటన చింతామణి తాలూకాలోని హిరేకట్టిగానహళ్లి గ్రామంలో జరిగింది. ఈ మాదిరిగా పెళ్లిళ్లు చేస్తే వర్షాలు పడతాయని నమ్మకం. దీంతో ఆ గ్రామానికి చెందిన శివానందకు వరుడు, నాగప్ప అనే బాలునికి వధువు తరహాలో సింగారించి మూడుముళ్ల వేడుక జరిపించారు.
కాగా, వరుణుడు కొండెక్కడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేసిన పంటలు ఎండిపోయాయి, చెరువులు, వాగుల్లో నీరు కరువై పశుగ్రాసం, పశువులకు నీళ్లు కరువయ్యాయి. ప్రజలకు మంచినీటికి కూడా కొరత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment