
గన్నవరంరూరల్: మండలంలోని సూరంపల్లి గ్రామంలో ఓ యువకుడిని శనివారం అర్ధరాత్రి గ్రామస్తులు బంధించిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన ఆ యువకుడు తల్లి లేని ఓ బాలికను ప్రేమ పేరిట వలలో వేసుకుని, రాత్రి వేళ ఇంటికి రాగా, బాలిక బంధువుల యువకుడిని నిలదీసి తాళ్లతో కట్టివేశారు. ఈ విషయం తెలిసి ఆ యువకుడి బంధువులు ఆ ప్రదేశానికి చేరుకోవటంతో అర్ధరాత్రి కలకలం రేగింది.
వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావటంతో మరింత చర్చకు దారి తీసింది. అనంతరం గ్రామస్తులు ఆ జంటకు పెళ్లి చేశారు. గన్నవరం పోలీసులకు తెలియడంతో ఆదివారం వారిని స్టేషన్‌కు రప్పించారు. ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. బాలిక మైనర్ కావటంతో ప్రజ్వల హోమ్‌కు పంపినట్లు చెప్పారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట బాలిక, యువకుడిని హాజరుపరుస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment