మహానటి చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న హిరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత ఆ స్థాయి కథా పాత్రలో నటించలేదనే చెప్పాలి. కమర్షియల్‌గా కొన్ని చిత్రాలు ఉన్నా, ఇటీవల అవి కూడా లేకుండాపోయాయి. ఈ చిన్నది కథానాయకిగా పరిచయమై దశాబ్దం అవుతోంది. చిన్నతనంలో బాలనటిగా కొన్ని చిత్రాలు చేసినా, 2013లో కథానాయకిగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లోనూ అవకాశాలు రావడంతో స్టార్‌గా ఎదిగింది. ఆ మధ్య బాలీవుడ్‌లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇలాంటి సమయంలో కీర్తి సురేష్ తన స్కూల్ మేట్‌ను 13 ఏళ్లుగా ప్రేమిస్తోందని, అతను కేరళలో రిసార్ట్ ఓనర్ అని, వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపినట్లు, దీంతో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు కొద్దికాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీనిపై కీర్తి సురేష్ స్పందింంది. తన ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తనకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పింది. అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది.
కాగా ప్రస్తుతం ఈమె తెలుగులో నానికి జంటగా నటించిన దసరా చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదేవిధంగా చిరంజీవికి చెల్లెలిగా బోళాశంకర్ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించిన మామన్నన్ చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటోంది. మరోవైపు జయం రవి సరసన సైరన్ చిత్రంతో పాటు రివాల్వర్ రిటా వంటి చిత్రాల్లో బిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment