Actress Anjali Interesting Comments On Love And Marriage - Sakshi
Sakshi News home page

Actress Anjali: అంజలి పెళ్లి చేసుకుందా?! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

Published Mon, Dec 12 2022 9:13 AM | Last Updated on Mon, Dec 12 2022 11:00 AM

Actress Anjali Interesting Comments On Love And Marriage - Sakshi

తమిళసినిమా: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అయితే నటి అంజలి విషయంలో ఇది తారుమారైంది. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఈ బ్యూటీ. మొదట్లో తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. కట్రదు తమిళ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలికి ఆ తర్వాత అంగాడి తెరు, ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 చదవండి: అనుపమ పరమేశ్వరన్‌పై నిర్మాత అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దీంతో ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత తెలుగులోనూ మంచి అవకాశాలు వరించాయి. దీంతో గుర్తింపు పొందిన అంజలి కొన్ని వివాదాస్పద సంఘటనల్లో  చిక్కుకుని హైదరాబాద్‌కు మకాం మార్చారు. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ మధ్యలో ఐటెం సాంగ్స్‌లోనూ మెరుస్తూ బిజీగానే ఉన్నారు. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలోనూ వార్తల్లో నిలిచిన అంజలిని నటుడు జయ్‌తో కలుపుతూ ప్రచారం జరిగింది. కాగా ఇటీవల అంజలి నటించిన వెబ్‌ సిరీస్‌ ఫాల్‌ ఓటీటీలో విడుదలైంది.

చదవండి: ‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

దీని ప్రమోషన్‌లో భాగంగా చెన్నైకి వచ్చిన అంజలి మీడియాతో ముచ్చటించారు. ప్రేమ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఈ బ్యూటీ బదిలిస్తూ తనకు ఇదివరకే పెళ్లి జరిగిపోయిందని, అమెరికాలో నివాసం ఉంటున్నట్టు ఇప్పటికే రకరకాల ప్రచారం జరిగిందన్నారు. నిజానికి అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని, ఆ టైం వచ్చినప్పుడు అందరికీ చెబుతానని అంజలి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement