
తమిళ సినిమా: టాప్ హీరోయిన్ల గురించి ఏదో ఒక సంచల వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. నటి నయనతార, దర్శకుడు విగ్నేశ్ శివన్ల ప్రేమ, సహజీవనం గురించి మొదట్లో ఇలాంటి వార్తలే గుప్పుమన్నాయి. మొదట్లో వాటిని ఈ జంట పెద్దగా ధ్రువీకరించకపోయినా ఆ తర్వాత అదే నిజమైంది. చాలామంది హీరోయిన్లు మొదట్లో అలాంటి వార్తలను కొట్టిపారేసినా ఆ తర్వాత అవును మేము ప్రేమించుకుంటున్నాం అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తుండడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా క్రేజీ నటి కీర్తి సురేష్ గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ బ్యూటీ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు, ఆమె తల్లిదండ్రులు వరుడిని కూడా చూసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా పెళ్లికి అంగీకరించినట్లు, దీంతో నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. వివాహానంతరం కీర్తీ సురేష్ నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది.
ఆ మధ్య పెళ్లికి ముందు నయనతార గురించి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే నయనతార మాత్రం పెళ్లయిన తర్వాత కూడా కొత్త చిత్రాలను ఒప్పుకుంటూ బిజీగా ఉంది. మరి నటి కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమవుతుందన్న వార్తల్లో నిజమెంత అన్నది కాలమే తేలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment