అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక ఆర్ట్స్ కళాశాల రసాయనశాస్త్ర విభా గం ఆధ్వర్యంలో జనవరి 30, 31 తేదీల్లో ’మానవ ఆరోగ్యం, వాతావరణ పరిరక్షణలో రసాయనశాస్త్రం పాత్ర’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు సోమవారం విడుదల చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి, రసాయనశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ డీఎఎస్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ వి.సలీంబాషా, తదితరులు పాల్గొన్నారు. పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధనాపత్రాలు సమర్పించి సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.