భవిష్యత్‌ రసాయన శాస్త్రానిదే | chemistry bright feature | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ రసాయన శాస్త్రానిదే

Published Tue, Jan 24 2017 9:43 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

chemistry bright feature

భానుగుడి (కాకినాడ) :
భవిష్యత్‌ అంతా రసాయన శాస్రా్తనిదేనని, ఔషధాల వినియోగం దగ్గర్నుంచి, పర్యావరణ విజ్ఞానం వరకూ అన్నీ ఈ శాస్త్రంతో ముడిపడి ఉందని పలువురు రసాయన శాస్త్రవేత్తలు అన్నారు. పీఆర్‌జీ డిగ్రీ కళాశాలలో మంగళవారం రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. తొలిరోజు ‘రసాయన, ఔషధ, పర్యావరణ విజ్ఞాన శాస్రా్తల సాంకేతిక అంశాల్లోని పరిశోధనలు’ అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ చప్పిడి కృష్ణ సదస్సుకు అధ్య క్షత వహించారు. భట్నాగర్‌ అవార్డు గ్రహీత, హైదరాబాద్‌ వర్సిటీ మాజీ వీసీ, కర్బన రసాయన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.పెరియస్వామి మాట్లాడుతూ కర్బన లోహ సమ్మేళన, సంశ్లేషణ అనువర్తనాలను విశ్లేషించారు. తీరంలో  ఔషధాల వెలికితీత, నీటి నుంచి ఫ్లోరి¯ŒS తొలగింపు అంశాలపై చేసిన పరిశోధనలను ఏయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వైఎల్‌ఎ¯ŒS మూర్తి సమర్పించారు. హోప్‌ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ సిలాజ్‌ చార్లెస్, ప్రొఫెసర్‌ మాచిరాజు, వెంకీ ఫార్మా డైరెక్టర్‌ శివరామ కృష్ణ, ఉస్మానియా ప్రొఫెసర్‌ శారద, సల్గ పరి«శోధన అధిపతి డాక్టర్‌ ఎస్‌ఎ సల్గా, కళాశాల యూజీసీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ హరిరామ్‌ప్రసాద్, సుబ్రహ్మణ్యం, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వైడీ రామారావు, వరప్రసాద్, మల్లికార్జున శర్మ, రామమూర్తి, ఈరంకి శర్మ పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement