ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో ప్రధాన రసాయన పదార్థం? | Plaster of Paris, the main chemical substance? | Sakshi
Sakshi News home page

ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో ప్రధాన రసాయన పదార్థం?

Published Thu, Sep 25 2014 2:56 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో ప్రధాన రసాయన పదార్థం? - Sakshi

ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో ప్రధాన రసాయన పదార్థం?

 కెమిస్ట్రీ
 
 1.    సిమెంటు తయారీకి కావాల్సిన ప్రధాన ముడి పదార్థం?
     1) ఇసుక        2) సున్నపురాయి
     3) సోడాయాష్    4) ఏదీకాదు
 
 2.    సిమెంట్‌ను 1824లో ఒక తాపీమేస్త్రీ కనుగొన్నాడు. అతని పేరు?
     1) జె. ఎడిసన్    2) జె. ఏస్పిడిన్
     3) జె. థామ్సన్    4) జె. పోర్‌‌టలాండ్
 
 3.    కింది వాటిలో సిమెంటు పరిశ్రమకు అవసరమైంది?
     1) సున్నపురాయి    2) బంకమన్ను
     3) బొగ్గు        4) అన్నీ
 
 4.    సరైన వాక్యాలను గుర్తించండి?
     1)    సిమెంట్ పరిశ్రమలో చివరికి ఏర్పడే కాల్షియం సిలికేట్, అల్యూమినియం సిలికేట్‌ల గట్టి ముద్దలను క్లింకర్‌లు అంటారు.
     2)    క్లింకర్‌లను చూర్ణం చేసి 2-3 శాతం జిప్సంను కలిపితే వచ్చేది సిమెంట్.
     3)    జిప్సం వల్ల సిమెంట్‌కు గట్టిపడే గుణం వస్తుంది.
     4)    అన్నీ సరైనవే.
 
 5.    సిమెంట్ తయారీలో చిట్ట చివర కలిపే పదార్థం?
     1) బంకమన్ను
     2) సిలికా
     3) సున్నపురాయి
     4) జిప్సం
 
 
6.    జిప్సంను 1200ఇ-1300ఇకు వేడిచేస్తే ఒకటిన్నర అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు?
     1) ప్లాస్టర్ ఆఫ్ పారిస్    2) సిమెంట్
     3) గాజు        4) పోర్సెలిన్
 
 8.    భారాత్మకంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో సగభాగం నీటితో కలిపితే ముద్దగా మారి కొంత కాలం తర్వాత గట్టి పదార్థంగా మారుతుంది. దీన్నే ‘సెట్టింగ్’ అని అంటారు. ఈ ప్రక్రియలో ఘనపరిమాణం పెరగడంతోపాటు?
     1) కార్బొనేషన్ జరుగుతుంది.
     2) నిర్జలీకరణం (డీహైడ్రేషన్) చోటు చేసుకుంటుంది.
     3) హైడ్రేషన్ జరుగుతుంది.
     4) హైడ్రోజనీకరణం సంభవిస్తుంది.
 
 9.    ఒక భాగం తడి సున్నం, మూడు భాగాల ఇసుక, నీరు బాగా కలిసి ఉన్న మిశ్రమాన్ని ఏమంటారు?
     1) లైమ్ మోర్టార్    2) లైమ్ సిమెంట్
     3) రేయిన్‌ఫోర్‌‌సడ్ కాంక్రీట్
     4) ఏదీకాదు
 
 10.    విరిగిన ఎముకలు సరైన స్థానాల్లో సెట్ చేయడానికి సిమెంట్ పట్టిగా దేన్ని ఉపయోగిస్తారు?
     1) జిప్సం        2) సున్నం
     3) సిమెంట్        4)ప్లాస్టర్ ఆఫ్ పారిస్
 
 11.    గాజు అనేది?
     1) నిజమైన ఘన పదార్థం
     2) స్ఫటిక పదార్థం
     3) అతిశీతలీకరణం చెందిన ద్రవం
     4) వాయు పదార్థం
 
 12.    గాజు అనేది కింది వాటి మిశ్రమం?
     ఎ) సోడియం సిలికేట్
     బి) కాల్షియం సిలికేట్
     సి) సిలికా    
     1) ఎ, బి మాత్రమే    2) బి, సి మాత్రమే
     3) ఎ, బి, సి        4) ఎ, సి మాత్రమే
 
 13.    గాజు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు?
     1) సోడాయాష్    2) సున్నపురాయి
     3) ఇసుక        4) అన్నీ
 14.    గాజును నెమ్మదిగా చల్లార్చడాన్ని మందశీతలీకరణం అంటారు. దీని వల్ల గాజుకు?
     1) పెలుసుదనం వస్తుంది
     2) అధిక బలం లభిస్తుంది
     3) మందం ఎక్కువ అవుతుంది    4) ఏదీకాదు
 
 15.    గాజును వేడిచేసి, మెత్తగా మార్చి దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతిగల గాజు వస్తువులను తయారు చేసే సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు?
     1) గ్లాస్ మేకింగ్    2) గ్లాస్ బ్రేకింగ్
     3) గ్లాస్ బ్లోయింగ్    4) గ్లాస్ ఫ్లోయింగ్
 
 16.    కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీలో ఉపయోగించే గాజు రకం?
     1) సోడాగాజు    2) క్వార్‌‌ట్జ గాజు
     3) పెరైక్స్ గాజు    4) గట్టి గాజు
 
 17.    గాజు మంచి?
     1) విద్యుత్ వాహకం
     2) అర్థ వాహకం (సెమీకండక్టర్)
     3) ఉష్ణబంధకం (ఇన్సులేటర్)
     4) ఉష్ణవాహకం
 
 18.    విద్యుత్ బల్బులు, దృశా పరికరాల తయారీకి ఉపయోగించే గాజు?
     1) పెరైక్స్ గాజు    2) క్వార్‌‌ట్జ గాజు
     3) సోడాగాజు    4)పెరైక్స్‌గాజు
 
 19.    జపతపర్చండి?
     గాజుకు కలిపే పదార్థం    గాజుకు వచ్చే రంగు
     1. మాంగనీస్ డై ఆక్సైడ్    ఎ. ఊదా
     2. కాపర్ సల్ఫైడ్    బి. నీలం
     3. క్రోమియం ఆక్సైడ్    సి. ఆకుపచ్చ
     4. క్యూప్రస్ ఆక్సైడ్    డి. ఎరుపు
 
         ఎ    బి    సి    డి
     1)    1    2    3    4
     2)    4    3    4    1
     3)    3    1    2    4
     4)    2    3    4    1
 
 20.    గాజుకు ముఖ్యమైన ముడి పదార్థం అయిన ఇసుక రసాయన నామం?
     1) సిలికాన్        2) సిలికా
     3) అల్యూమినా    4) మార్బుల్
 
 21.    సిలికా రసాయన ఫార్మూలా?
     1) సిలికాన్ డై ఆక్సైడ్ (జీౌ2)
     2) సిలికాన్ (జీ)    3) సిలికాన్ కార్బైడ్ (జీఛి)
     4) ఏదీకాదు
 
 22.    ఇసుకకు స్ఫటిక రూపాంతరం?
     1) రూబీ        2) క్వార్‌‌ట్జ
     3) కోక్        4) సాండ్ స్టోన్
 
 23.    రసాయనికంగా క్వార్‌‌ట్జ అనేది వీటిలో ఏదీ?
     (ౌ్కజీఛ్ఛి ఇౌట్ట్చఛ్ఛ 2012)
     1) కాల్షియం సిలికేట్    2) సిలికాన్ ఆక్సైడ్    
     3) సోడియం సల్ఫేట్    4) కాల్షియం సల్ఫేట్
 
 24.    కుండలు, మట్టి సామాగ్రి, పింగాణీ (పోర్సిలిన్) మొదలైన వస్తువులను ఏమంటారు?
     1) మృర్మొయ పాత్రలు (సిరామిక్స్)
     2) కాస్మొటిక్స్
     3) గాజు        4) లేపనాలు
 
 25.    సిరామిక్స్ పరిశ్రమకు ప్రధాన ముడి ఖనిజం?
     1) బంకమన్ను    2) సున్నపురాయి
     3) బాక్సైట్        4) బోరాక్స్
 
 26.    సిరామిక్స్ పరిశ్రమలో కింది వాటిలో ఏది అవసరం లేదు?
     1) బంకమన్ను
     2) ఫెల్‌స్ఫార్ ఖనిజం
     3) ఇసుక    4) సోడాయాష్
 
 27.    సిలికాన్ దేనిలో ఉంది?
     1) బొగ్గు        2) ఇసుక
     3) చలువరాయి    4) ఉప్పు
 
 28.    {పయోగశాలలో అతి నీలలోహిత కిరణాలను (్ఖగ) పంపించడానికి ఉపయోగించే గాజు?
     1) సోడా గాజు    2) పెరైక్స్ గాజు
     3) క్వార్‌‌ట్జ గాజు    4) మెత్తటి గాజు
 
 29.    జతపర్చండి? (ఐ 2012)

     ముడిపదార్థం    ఉత్పాదితం
     1. లైమ్‌స్టోన్        ఎ. పోర్సిలీన్
     2. జిప్సం        బి. గ్లాస్
 
     3. సిలికా ఇసుక     సి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్
     4. మట్టి        డి. సిమెంట్
         1    2    3    4
     1)    1    2    3    4
     2)    4    3    2    1
     3)    1    3    4    2
     4)    4    1    3    2
 
 30.    పాలరాయి/సున్నపురాయి రసాయన నామం?
     ఐ (2011)
     1) ఇ్చఇౌ3        2) CaSo4
     3) ఇ్చఏఇౌ3    4) కజఇౌ3
 
 31.     గాజు వస్తువుల బ్లోయింగ్‌కు ఉపయోగించే మంట?
     1) ఆక్సీజన్ - ఎసిటలీన్ టార్చి
     2) హైడ్రోజన్ టార్చి
     3) కోక్ మంట    4) కట్టెల మంట
 
 32.    ఫేస్ పౌడర్‌కు అవసరం లేని గుణం?
     1) అపారదర్శకత    2) జారుడు గుణం
     3) శోషణం        4) గరుకుదనం
 
 33.    టాల్క్‌లో ఉండే రసాయనం?
     1) మెగ్నీషియం ఆక్సైడ్
     2) మెగ్నీషియం సిలికేట్
     3) మెగ్నీషియం డై ఆక్సైడ్
     4) కాల్షియం కార్బొనేట్
 
 34.    పౌడర్‌లో అపార దర్శకత (కప్పి ఉండే సామర్థ్యం) కోసం దేన్ని ఉపయోగిస్తారు?
     1) టైటానియం డై ఆక్సైడ్
     2) సిలికాన్ డై ఆక్సైడ్
     3) బంకమన్ను    4) సుద్ద
 
 35.    జతపర్చండి.
     1. సున్నపురాయి    ఎ. ఇై2
     2. పొడి సున్నం    బి. ఇ్చఇై3
     3. తడిసున్నం (సున్నపుతేట)    సి. ఇౌ్చ
     4. కార్బన్ డై ఆక్సైడ్    డి. ఇ్చ(ైఏ)2
         ఎ    బి    సి    డి
     1)    1    2    3    4
     2)    2    3    4    1
     3)    3    2    1    4
     4)    4    1    3    2
 
 36.    మనం తినే పాన్‌ను చేసేటప్పుడు తమలపాకుపై రాసే సున్నపు తేట రసాయన నామం?
     1) కాల్షియం కార్బొనేట్    2) కాల్షియం హైడ్రాక్సైడ్
     3) కాల్షియం ఆక్సైడ్     4) కాల్షియం సల్ఫేట్
 
 37.    ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో ప్రధాన రసాయన పదార్థం?
     1) కాల్షియం కార్బొనేట్    2) కాల్షియం సల్ఫేట్
     3) కాల్షియం ఫాస్ఫేట్    4) కాల్షియం కార్బైడ్
 
 38.    ఎముకల్లో ఉండే ప్రధాన కాల్షియం పదార్థం?
     1) కాల్షియం సల్ఫేట్    2) కాల్షియం ఫాస్ఫేట్
     3) కాల్షియం కార్బైడ్    4) కాల్షియం కార్బొనేట్
 
 39.    ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైనవి?
     1) కాల్షియం        2) ఫ్లోరైడ్
     3) రెండూ        4) ఏదీకాదు
 
 40.    సున్నపుతేటను పాలవలె మార్చే వాయువు?
     1) బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్)
     2) కార్బన్ మోనాక్సైడ్
     3) నైట్రోజన్     4) సల్ఫర్ డై ఆక్సైడ్
 
 41.    సున్నపు తేటను గోడలకు వెల్ల వేసినప్పుడు అది గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని తెల్లగా మారుతుంది. ఇందులో చివరగా ఏర్పడే పదార్థం?
     1) కాల్షియం కార్బొనేట్    2) కాల్షియం సల్ఫేట్
     3) కాల్షియం కార్బైడ్     4) కాల్షియం ఫాస్ఫేట్
 
 42.    విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) రసాయన ఫార్మూలా?
     1) ఇ్చఇ2         2) ఇ్చైఇ2
     3) ఇ్చఇౌ3        4) ఇ్చఇౌ3
 
 43.    బ్లీచింగ్ పౌడర్‌ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?
     1) క్లోరిన్        2) ఆక్సిజన్
     3) ఫ్లోరిన్        4) అయొడీన్
 
 44.    మున్సిపల్ వాటర్‌ను శుద్ధి చేసే ప్రక్రియ?
     1) ఆక్సీజినేషన్    2) క్లోరినేషన్
     3) అయొడినేషన్    4) హైడ్రేషన్
 
 45.    మామిడి కాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బైడ్ ముద్దలను ఉపయోగిస్తారు. తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది?
     1) ఇథిలీన్        2) ఎసిటలీన్
     3) క్లోరోఫాం     4) హైడ్రోజన్
 
 46.    బేకింగ్ సోడా రసాయన నామం?
     1) కాల్షియం కార్బొనేట్    2) కాల్షియం బైకార్బొనేట్    3) సోడియం కార్బొనేట్    4) సోడియం బైకార్బొనేట్
 47.    చాకలి సోడా రసాయన నామం?
     1) సోడియం కార్బొనేట్
     2) సోడియం బై కార్బొనేట్
     3) సోడియం క్లోరైడ్    4) సుక్రోజ్
 
 48.     జతపర్చండి?
     1. సోడియం కార్బొనేట్   
     2. సోడియం బై కార్బొనేట్   
     3. సోడియం క్లోరైడ్   
     4. సోడియం హైడ్రాక్సైడ్   
         1    2    3    4
     1)    1    2    3    4
     2)    2    3    1    4
     3)    2    3    4    1
     4)    3    1    2    4
 
 49.    సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్) రసాయన నామం?
     1) సోడియం సల్ఫేట్
     2) సోడియం క్లోరైడ్
     3) సోడియం హైడ్రాక్సైడ్
     4) సోడియం ఫాస్ఫేట్
 
 50.    సాధారణంగా స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశించే ముందు కాళ్లు కడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారు? అందులో కలిపే క్రిమి సంహార ధర్మం కలిగిన పదార్థం?
     1) పొటాషియం పర్మాంగనేట్
     2) పొటాషియం క్లోరేట్
     3) పొటాషియం సల్ఫేట్    4) హైడ్రోజన్ పెరాక్సైడ్
 
 51.    రాళ్లలో, ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో ఉండే మూలకం?
     1) సిలికాన్        2) కార్బన్
     3) ఐరన్        4) అల్యూమినియం
 
 సమాధానాలు:
     1) 2;    2) 2;    3) 4;    4) 4;    5) 4;
     6) 1;    7) 1;    8) 3;    9) 1;    10) 4;
     11) 3;    12) 3;    13) 4;    14) 2;    15) 3;
     16) 1;    17) 3;    18) 2;    19) 1;    20) 2;
     21) 1;    22) 2;    23) 2;    24) 1;    25) 1;
     26) 4;    27) 2;    28) 3;    29) 2;    30) 1;
     31) 1;    32) 4;    33) 2;    34) 1;    35) 2;
     36) 2    37) 2;    38) 2;    38) 3;    40) 1;
     41) 1; 42) 2;    43) 1;    44) 2;    45) 2;
     46) 4; 47) 1;    48) 3;    49) 2;    50) 1;
     51) 1.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement