సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇండియాస్ టేకేడ్ : చిప్స్ ఫర్ విక్షిత్ భారత్’లో భాగంగా దాదాపు రూ.1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.
‘సెమీ కండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధితో భారత్‌ను గ్లోబల్హబ్‌గా నిలబెట్టడం, దేశ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ భారీ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు.
రెండు గుజరాత్, ఒకటి అస్సాంలో
ప్రధాని శంకుస్థాపన చేయనున్న సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌లు గుజరాత్‌లోని ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (డీఎస్‌ఐఆర్)లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సౌకర్యం, గుజరాత్‌లోని సనంద్‌లో అవుట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ ,టెస్ట్ ఏర్పాటు చేయనుంది. అస్సాంలోని మోరిగావ్‌లో అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ యూనిట్‌లను నెలకొల్పనుంది.
India is set to become a prominent semiconductor manufacturing hub. The three facilities will drive economic growth and foster innovation.https://t.co/4c9zV3G9HL
— Narendra Modi (@narendramodi) March 13, 2024
100 ఎకరాల విస్తీర్ణంలో
కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రం, అహ‍్మదాబాద్ జిల్లా ధొలేరా ప్రాంతంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంల స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌గా తీర్చిదిద్దేలా నడుంభింగింది. ఈ 100 ఎకరాల్లో ఆయా సంస్థ సెమీ కండర్టర్ యూనిట్‌లను ఏర్పాటు చేయొచ్చు. తద్వారా యువతకు విస్త్రృత ఉపాధి అవకాశాలు, ఎకనమిక్ గ్రోత్ సాధించొచ్చుని కేంద్రం భావిస్తోంది.
రూ91వేల కోట్లతో టాటా
ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతంలో దేశంలోనే తొలి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్) సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఈపీఎల్) సిద్ధమైంది. రూ.91వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.ఈ సౌకర్యాలు సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. భారత్ సైతం సెమీ కండర్టర్ విభాగంలో రాణించడమే కాదు..వేలాది మందికి ఉపాధిని కల్పిస్తాయి.ఎలక్ట్రానిక్స్, టెలికాం మొదలైన సంబంధిత రంగాలలో ఉపాధి కలగనుంది.
Comments
Please login to add a commentAdd a comment