![Nomination Process For 4 Assam Lok Sabha Seats In Third Phase Begins - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/04/12/Assam.jpg.webp?itok=68wDyjqu)
డిస్పూర్ : ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మూడో విడతలో పోలింగ్ జరగనున్న గౌహతితో సహా నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు నామినేషన్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.దేశవ్యాప్తంగా మూడో దశకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రక్రియ ప్రారంభమైందని ఈసీ వెల్లడించింది. మూడో దశలో మే 7న గౌహతి, బార్‌పేట, ధుబ్రి, కోక్రాఝర్ (ఎస్టీ) నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 19,అదే సమయంలో దాని పరిశీలన మరుసటి రోజు జరుగుతుంది. ఏప్రిల్ 22న నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజుగా నిర్ణయించారు ఎన్నికల అధికారులు.
కాగా, రాష్ట్రంలోని ప్రస్తుత లోక్‌సభలో బీజేపీ తొమ్మిది మంది ఎంపీలు ఉండగా, దాని మిత్రపక్షాలైన ఏజీపీ, యూపీపీఎల్‌లకు సభ్యులే లేరు. కాంగ్రెస్‌కు మూడు సీట్లు, ఏఐయూడీఎఫ్‌కు ఒకటి, మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment