విద్య, ఉద్యోగ సమాచారం | Education And Jobs Recruitments Details Here | Sakshi
Sakshi News home page

విద్య, ఉద్యోగ సమాచారం

Published Mon, Mar 15 2021 9:00 AM | Last Updated on Mon, Mar 15 2021 9:05 AM

Education And Jobs Recruitments Details Here - Sakshi

టీఎస్‌ ఈసెట్‌–2021 ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీఎస్‌సీహెచ్‌ఈ).. టీఎస్‌ ఈసెట్‌–2021 నోలిఫికేషన్‌ విడుదలచేసింది. దీనిద్వారా డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2021–22 విద్యాసంవత్సారానికి బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశం కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ(జేఎన్‌టీయూ) నిర్వహిస్తోంది.
► తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఈసెట్‌) 2021.
► ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్ట్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.800 చెల్లించాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 22.03.2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021
► టీఎస్‌ ఈసెట్‌ పరీక్ష తేది: 01.07.2021
► వెబ్‌సైట్‌: https://ecet.tsche.ac.in

ఎన్‌ఐఈఎస్‌బీయూడీలో వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ స్కిల్‌ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్మాల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌(ఎన్‌ఐఈఎస్‌బీయూడీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
►  మొత్తం పోస్టుల సంఖ్య: 07
► పోస్టుల వివరాలు: అడ్వైజర్‌–01, సీనియర్‌ కన్సల్టెంట్‌–01, కన్సల్టెంట్‌–02, రీసెర్చ్‌ అసోసియేట్‌–02, కోఆర్డినేటర్‌–01.
► అడ్వైజర్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
► సీనియర్‌ కన్సల్టెంట్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
► కన్సల్టెంట్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఫిల్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో ఆరేళ్ల అనుభవం ఉండాలి.
► రీసెర్చ్‌ అసోసియేట్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
► కోఆర్డినేటర్‌: అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఈమెయిల్‌: application.niesbud@gmail.com
► దరఖాస్తులకు చివరి తేది: 29.03.2021
► వెబ్‌సైట్‌: www.niesbud.nic.in

టీజీసెట్‌–2021- ఐదో తరగతిలో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల, విద్యాశాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.
►అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
►ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
►దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.04.2021
► ప్రవేశ పరీక్ష తేది: 30.05.2021
► వెబ్‌సైట్‌: http://tgcet.cgg.gov.in

నిక్‌మార్, పుణెలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐసీఎంఏఆర్‌).. 2021 విద్యా సంవత్సరానికి సంబం«ధించి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
► ప్రవేశాలు కల్పించనున్న ప్రాంగణాలు: పుణె, హైదరాబాద్, గోవా, ఢిల్లీ.
► పీజీ కోర్సు వివరాలు:
► కాలవ్యవధి: రేండేళ్లు/ఏడాది.
►  విభాగాలు:
► అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ–ఏసీఎం).
► ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ–పీఈఎం).
► రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ–ఆర్‌యూఐఎం).
► ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్, డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ–ఐఎఫ్‌డీఎం).
► మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఓన్డ్‌  కన్‌స్ట్రక్షన్‌  బిజినెస్‌(పీజీపీ–ఎంఎఫ్‌ఓసీబీ).
► క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ–క్యూఎస్‌సీఎం).
► హెల్త్, సేఫ్టీ అండ్‌ ఇన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ–హెచ్‌ఎస్‌ఈఎం).
► అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
► ఎంపిక విధానం: నిక్‌మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఎన్‌సీఏటీ), పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎన్‌సీఏటీ, పర్సనల్‌ ఇంటర్వ్యూ రెండింటికి విద్యార్థులు తమ ఇంటి నుంచి హాజరుకావచ్చు.
► పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నిక్‌మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఎన్‌సీఏటీ) 180 మార్కులకు ఉంటుంది. ఇందులో  క్వాంటిటేటివ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ 72 మార్కులకు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 36 మార్కులకు, వెర్బల్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ 72 మార్కులకు ఉంటుంది. పర్సనల్‌ ఇంటర్వ్యూ 50 మార్కులకు, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌కు 70 మార్కులకు  ఉంటుంది.
► పరీక్ష తేది: 2021 ఏప్రిల్‌ 29, 30
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్‌–అడ్మిషన్స్, ఎన్‌ఐసీఎంఏఆర్, 25/1, బాలేవడి, ఎన్‌.ఐ.ఎ.పోస్ట్‌ ఆఫీస్, పూణె –411045 చిరునామాకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 14.04.2021
► వెబ్‌సైట్‌: https://www.nicmar.ac.in

తెలంగాణ పీజీఈసెట్‌–2021
తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(టీఎస్‌సీహెచ్‌ఈ).. ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే పీజీఈసెట్‌–2021కు దరఖాస్తులు కోరుతోంది.
►  పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పీజీఈసెట్‌)–2021
► కోర్సులు: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తదితరాలు, 
► అర్హత: బీఈ/బీటెక్‌/బీఫార్మసీ/బీఆర్క్‌ ఉత్తీర్ణత ఉండాలి. 
► ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది.
► పరీక్ష సమయం: రెండు గంటల్లో 120 ప్రశ్నలకు  సమాధానం రాయాల్సి ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021
► ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021
► వెబ్‌సైట్‌: http://www.tsche.ac.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement