Bhavitha Special
-
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
-
యూజీసీ జాబ్ పోర్టల్ ప్రయోజనాల గురించి తెలుసుకోండి
యూజీసీ నెట్, నెట్–జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యారా.. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్లో అర్హత సాధించారా.. ఏదైనా సబ్జెక్టులో పీహెచ్డీ పూర్తి చేశారా.. అయినా ఇప్పటికీ నిరుద్యోగిగానే ఉన్నారా?! అయితే వెంటనే యూజీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన జాబ్ పోర్టల్‌లో పేరు నమోదుచేసుకోండి!! మీ ప్రొఫైల్ నేరుగా రిక్రూటర్లు, విశ్వవిద్యాలయాల దృష్టికి వెళ్తుంది. దాంతో చదువుకు తగ్గ ఉద్యోగం దక్కే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. యూజీసీ జాబ్ పోర్టల్ ప్రత్యేకతలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. సాధారణంగా నెట్, సెట్లో అర్హత పొందిన వారిని, పీహెచ్డీ ఉత్తీర్ణులను ఉన్నత విద్యావంతులుగా, ప్రతిభావంతులుగా పరిగణిస్తాం. ఇలాంటి వారెందరో చదువుకు తగ్గ కొలువు దొరక్క నిరాశ చెందుతుంటారు. వాస్తవానికి అవకాశాలు ఉన్నా.. సరైన జాబ్ సెర్చింగ్ వేదికలు లేకపోవడంతో చాలామంది తమ ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో యూజీసీ కొత్తగా తెచ్చిన జాబ్ పోర్టల్ ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న వారికి ఎంతగానో లాభిస్తుందని చెప్పొచ్చు. పోర్టల్ స్వరూపం యూజీసీ అందుబాటులోకి తెచ్చిన జాబ్‌పోర్టల్.. నెట్, నెట్–జేఆర్ఎఫ్, పీహెచ్డీ ఉత్తీర్ణులు, రిక్రూటర్లను ఒకే ఆన్లైన్ వేదికపైకి తెస్తుంది. తద్వారా అటు రిక్రూటర్లు, ఇటు ఉద్యోగార్థులకు ఏకకాలంలో ప్రయోజనం చేకూర్చనుంది. పోర్టల్‌లో క్యాండిడేట్, ఎంప్లాయర్, సెర్చ్ అండ్ బ్రౌజ్ విభాగాలను పేర్కొన్నారు. అభ్యర్థుల విభాగం ఇందులో రిజిస్టర్, లాగిన్, క్రియేట్/అప్డేట్ ప్రొఫైల్, సెర్చ్ జాబ్స్.. ఉప విభాగాలుగా ఉం టాయి. అభ్యర్థులు ముందుగా పేరు, మెయిల్ ఐడీలను నమోదు చేసి.. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే భవిష్యత్ లాగిన్ ఐడీ సమస్యల దృష్ట్యా సెక్యూరిటీ క్వశ్చన్‌ను ఎంచుకొని.. సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా పోర్టల్‌లో ప్రవేశించి.. తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా అప్డేషన్ చేసుకోవచ్చు. అనంతరం జాబ్‌సెర్చ్ ద్వారా సరితూగే కొలువును ఎంచుకోవచ్చు. రిక్రూటర్లకు అభ్యర్థుల విభాగం తరహాలోనే విశ్వవిద్యాలయాలు, కాలేజీలు సైతం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సదరు రిక్రూటర్లు పోర్టల్‌లో జాబ్ పోస్టింగ్స్‌తో క్యాండిడేట్ సెర్చ్ సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే సెర్చ్ అండ్ బ్రౌజ్ విభాగంలో.. నెట్, సెట్, పీహెచ్డీ ఉత్తీర్ణుల వివరాలను పొందవచ్చు. ఉపయోగాలు జాబ్ పోర్టల్ ద్వారా అభ్యర్థులు, రిక్రూటర్లు ఒకే వేదికపైకి వస్తారు. తద్వారా ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, విశ్వవిద్యాలయాలు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. నెట్, సెట్, పీహెచ్డీ అభ్యర్థులకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కాని ఆయా ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు అందరికీ చేరకపోవడంతో ప్రతిభ ఉన్నా.. చాలా మంది ఆయా అవకాశాలను దక్కించుకోలేకపోతున్నారు. తాజాగా యూజీసీ జాబ్ పోర్టల్ అందుబాటులోకి రావడంతో.. అభ్యర్థులంతా దేశవ్యాప్తంగా ఆయా కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఉద్యోగ నియామక ప్రకటనల గురించి ఒకే వేదిక ద్వారా తెలుసుకోవచ్చు. ఈ జాబ్ పోర్టల్ ద్వారా ఉద్యోగార్థులతోపాటు కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సైతం ప్రయోజనం కలగనుంది. ప్రతిభావంతుల సమాచారం అందుబాటులోకి రావడంతో సరైన అభ్యర్థిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించేందుకు అవకాశం ఉంటుంది. నెట్, సెట్, పీహెచ్డీ క్వాలిఫయర్ల వివరాలు పోర్టల్‌లో అందుబాటులో ఉండటంతో ప్రయివేట్ రిక్రూటర్స్ ఈ వివరాల ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది. విశేష స్పందన పోర్టల్‌ను ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నెట్ఉత్తీర్ణులు– 60,958 మంది, నెట్–జేఆర్ఎఫ్–15,659 మంది, సెట్–18,519 మంది, పీహెచ్డీ ఉత్తీర్ణులు 30,417 మంది ఇప్పటికే యూజీసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరెంత మంది ఇప్పటి వరకు యూజీసీ జాబ్ పోర్టల్‌లో మొత్తం 60,958 మంది నెట్ క్వాలిఫయర్లు నమోదు చేసుకోగా... వీరిలో మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి 6,570 మంది, కామర్స్ 6,622, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ 3,720 ఎడ్యుకేషన్ 3,479, లైఫ్ సైన్సెస్ 2,502 మంది ముందు వరుసలో ఉన్నారు. నెట్–జేఆర్ఎఫ్కు సంబంధించి ఇప్పటి వరకు 15,659 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో కామర్స్ నుంచి 1302 మంది, మేనేజ్మెంట్ నుంచి 1085 మంది, ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్ నుంచి 853 మంది, జాగ్రఫీ నుంచి 710 మంది, హిందీ నుంచి 676 మంది, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ నుంచి 648 మంది ఉన్నారు. ప్రస్తుతానికి 18,519 మంది సెట్ క్వాలిఫయర్లు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. వీరిలో కామర్స్ 1993, బయాలజీ 1487, ఇంగ్లిష్ 1369, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్1100, మేనేజ్మెంట్ 883, ఎకనామిక్స్ 820, ఎడ్యుకేషన్ 800, కెమిస్ట్రీ 809 విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు. మొత్తం 30,417 మంది పీహె చ్‌డీ హోల్డర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బయాలజీ 4893, కెమిస్ట్రీ 2968, ఫిజిక్స్ 2018 , కామర్స్1417, మేనేజ్మెంట్ 1360, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్1242 అభ్యర్థులు ముందున్నారు. వెబ్సైట్: www.ugc.ac.in/jobportal -
టీచర్ కొలువుకు సిద్ధమా.. ఇదిగో ప్రణాళిక!
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రంగం సిద్ధమవుతోందా..? 16,000కుపైగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుందా...?! ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులు ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా డీఎస్సీకి అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్... తొలుత టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. 2018లో టెట్ రెండుసార్లు నిర్వహించిన తర్వాత మళ్లీ ఆ పరీక్షలు జరగలేదు. ఉపాధ్యాయ కోర్సులు పూర్తి చేసిన కొత్త బ్యాచ్‌ల అభ్యర్థులు టెట్ కోసం నిరీక్షిస్తున్నారు. వీరంతా డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే.. టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. దీంతో తొలుత టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈసారి టెట్ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. చివరిసారి నిర్వహించిన టెట్‌కు 3,97,957 మంది దరఖాస్తు చేయగా.. 3,70,576 మంది హాజరయ్యారు. ఈసారి ఈ సంఖ్య 5 లక్షలకు మించే అవకాశం ఉంది. ఇంగ్లిష్ నైపుణ్యాలకు పరీక్ష టెట్, డీఎస్సీ సిలబస్‌లో ఈసారి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లిష్ మీడియం నేపథ్యంలో.. ఆంగ్లంలో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించేలా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి టెట్‌లో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీకి ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) సిలబస్ రూపొందిస్తోంది. పాఠ్యపుస్తకాల్లోని అంశాలను కూడా గత ఏడాది మార్పు చేసినందున డీఎస్సీ సిలబస్‌లోనూ మార్పులు జరిగే ఆస్కారముంది. టెట్ కమ్ టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మ్యూజిక్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్, ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) నిర్వహిస్తారు. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టుల భర్తీకి టెట్ కమ్ టీఆర్టీ ఉంటుంది. చదవండి: (మ్యాథ్స్, ఫిజిక్స్ లేకున్నా.. ఇంజనీరింగ్) మ్యాథ్స్, ఫిజిక్స్ లేకున్నా.. ఇంజనీరింగ్ విద్యార్హతలు ► ఎస్జీటీ: ఇంటర్మీడియెట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) /డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) (లేదా) కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉండాలి. ►స్కూల్ అసిస్టెంట్: ఆయా సబ్జెక్టులతో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు బీఈడీ/తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి. ఎస్ఏ–లాంగ్వేజెస్, ఎల్పీ, పీఈటీ, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఇతర పోస్టులకు ఆయా పోస్టులను బట్టి అకడమిక్, టీచింగ్ ఎడ్యుకేషన్, అనుభవం ఉండాలి. ►వయసు: 18–44 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ►గమనిక: సిలబస్, పరీక్షా విధానాలు, అర్హతలు, వయసుకు సంబంధించిన సమాచారం గత నోటిఫికేషన్స్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. మార్కుల వెయిటేజీ ►స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, టీజీటీ: మొత్తం 100 మార్కులు(టీఆర్టీ–80 మార్కులు; ఏపీ టెట్–20 మార్కులు). ►స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: మొత్తం 100 మార్కులు(టీఆర్టీ–50 మార్కులు, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్–30 మార్కులు, ఏపీ టెట్–20 మార్కులు). ►మ్యూజిక్ టీచర్: మొత్తం 100 మార్కులు(టీఆర్టీ–70 మార్కులు, స్కిల్ టెస్ట్–30 మార్కులు). ► ప్రిన్సిపల్,పీజీటీ,క్రాఫ్ట్; ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్: మొత్తం 100 మార్కులు(టీఆర్టీ). ►ఎస్జీటీ: మొత్తం 100 మార్కులు (టెట్ కమ్ టీఆర్టీ). స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ తదితర) (టీఆర్టీ) సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు 1. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 10 2. విద్యా దృక్పథాలు 10 5 3. విద్యా మనోవిజ్ఞానశాస్త్ర తరగతి గది అన్వయం 10 5 4. సంబంధిత సబ్జెక్టు కంటెంట్ 80 40 మెథడాలజీ 40 20 మొత్తం 160 80 ► పరీక్షకు రెండున్నర గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ప్రిపరేషన్–గైడెన్స్ ఎస్జీటీ జీకే, కరెంట్ అఫైర్స్ ఎస్జీటీ అభ్యర్థులు తొలుత సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత సబ్జెక్టుల వారీ ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకొని, అధ్యయనం చేయాలి. స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక పేర్లు, నదీతీర నగరాలు, దేశాలు–రాజధానులు, ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, శాస్త్రసాంకేతిక అంశాలు తదితరాలపై దృష్టిసారించాలి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన కరెంట్ అఫైర్స్‌ను చదవాలి. ప్రిపరేషన్‌కు వార్తా పత్రికలను ఉపయోగించుకోవాలి. కొవిడ్–19 వివరాలు, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిల్లో దాని ప్రభావం గురించి తెలుసుకోవాలి. విద్యా దృక్పథాలు దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు–హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం(ఎన్సీఎఫ్–2005); విద్యాహక్కు చట్టం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యమిచ్చారు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి. విద్యా మనోవిజ్ఞానశాస్త్రం ► శిశు వికాసం అభివృద్ధి, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అంశాలు చాలా ముఖ్యమైనవి. శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన –స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టిసారించాలి. ► ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా, సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టుసాధించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచు కోవచ్చు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి. కంటెంట్ ► తెలుగు (ఆప్షనల్), ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్స్టడీస్ సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు–కావ్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు తదితరాలతో పాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితరాలపై పట్టు సాధించాలి. ► గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్రం తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మ్యాథ్స్‌లో పూర్తిస్థాయి మార్కుల సాధనకు వీలవుతుంది. ► సైన్స్‌లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు–క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టిసారించాలి. ► ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టు సాధించాలి. అదే విధంగా మన పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాలపై దృష్టిసారించాలి. ► సోషల్‌స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ–బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం–సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ.. అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టుసాధించొచ్చు. మెథడాలజీ ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధనా లక్ష్యాలు, బోధనా ప్రణాళిక, బోధ నోపకరణాలు, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. సొంత నోట్స్ రాసుకుంటే.. పరీక్ష సమయంలో మంచి ఫలితం ఉంటుంది. డీఎడ్ పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ ► స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు.. ఆయా సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి. మ్యాథమె టిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై దృష్టిసారించాలి. ► బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం–ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ► సోషల్‌స్టడీస్‌లో భారత స్వాతంత్య్రోద్యమం, ప్రపంచ యుద్ధాలు–అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితరాలను చదవాలి. మెథడాలజీ ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోప కరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బీఈడీ స్థాయి పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. గత డీఎస్సీలో గణితంలో బోధనా పద్ధతులు; సోషల్‌స్టడీస్‌లో బోధనోపకరణాలకు అధిక ప్రాధాన్యం లభించింది. కాని బయాలజీలో మాత్రం అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు వచ్చాయి. మాక్‌టెస్ట్‌లు కంటెంట్‌కు సంబంధించి తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే ఇతర మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. మెథడాలజీలో బోధనా లక్ష్యాలు –స్పష్టీకరణలు; బోధనా పద్ధతులపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. మ్యాథమె టిక్స్‌కు సంబంధించి ప్రాక్టీస్ ముఖ్యం. మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకునేందుకు వీలుంటుంది. ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. కాబట్టి పాఠశాల విద్యాశాఖ, శిక్షణ సంస్థలు అందించే ‘ఆన్లైన్ మాక్‌టెస్ట్‌లు’ రాయడం లాభిస్తుంది. -
విద్య, ఉద్యోగ సమాచారం
టీఎస్ ఈసెట్–2021 ప్రవేశాలు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీఎస్సీహెచ్ఈ).. టీఎస్ ఈసెట్–2021 నోలిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2021–22 విద్యాసంవత్సారానికి బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశం కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ(జేఎన్టీయూ) నిర్వహిస్తోంది. ► తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఈసెట్) 2021. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ట్ ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.800 చెల్లించాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 22.03.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021 ► టీఎస్ ఈసెట్ పరీక్ష తేది: 01.07.2021 ► వెబ్సైట్: https://ecet.tsche.ac.in ఎన్ఐఈఎస్బీయూడీలో వివిధ ఖాళీలు భారత ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్(ఎన్ఐఈఎస్బీయూడీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: అడ్వైజర్–01, సీనియర్ కన్సల్టెంట్–01, కన్సల్టెంట్–02, రీసెర్చ్ అసోసియేట్–02, కోఆర్డినేటర్–01. ► అడ్వైజర్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. ► సీనియర్ కన్సల్టెంట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. ► కన్సల్టెంట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఫిల్/పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ నెట్/గేట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో ఆరేళ్ల అనుభవం ఉండాలి. ► రీసెర్చ్ అసోసియేట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ నెట్/గేట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. ► కోఆర్డినేటర్: అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: application.niesbud@gmail.com ► దరఖాస్తులకు చివరి తేది: 29.03.2021 ► వెబ్సైట్: www.niesbud.nic.in టీజీసెట్–2021- ఐదో తరగతిలో ప్రవేశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల, విద్యాశాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ►అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ►ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.04.2021 ► ప్రవేశ పరీక్ష తేది: 30.05.2021 ► వెబ్సైట్: http://tgcet.cgg.gov.in నిక్మార్, పుణెలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (ఎన్‌ఐసీఎంఏఆర్).. 2021 విద్యా సంవత్సరానికి సంబం«ధించి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ► ప్రవేశాలు కల్పించనున్న ప్రాంగణాలు: పుణె, హైదరాబాద్, గోవా, ఢిల్లీ. ► పీజీ కోర్సు వివరాలు: ► కాలవ్యవధి: రేండేళ్లు/ఏడాది. ► విభాగాలు: ► అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్(పీజీపీ–ఏసీఎం). ► ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్(పీజీపీ–పీఈఎం). ► రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్(పీజీపీ–ఆర్యూఐఎం). ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్(పీజీపీ–ఐఎఫ్డీఎం). ► మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ కన్స్ట్రక్షన్ బిజినెస్(పీజీపీ–ఎంఎఫ్ఓసీబీ). ► క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్(పీజీపీ–క్యూఎస్సీఎం). ► హెల్త్, సేఫ్టీ అండ్ ఇన్విరాన్మెంట్ మేనేజ్మెంట్(పీజీపీ–హెచ్ఎస్ఈఎం). ► అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ► ఎంపిక విధానం: నిక్మార్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఎన్‌సీఏటీ), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎన్‌సీఏటీ, పర్సనల్ ఇంటర్వ్యూ రెండింటికి విద్యార్థులు తమ ఇంటి నుంచి హాజరుకావచ్చు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నిక్మార్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఎన్‌సీఏటీ) 180 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ 72 మార్కులకు, డేటా ఇంటర్‌ప్రిటేషన్ 36 మార్కులకు, వెర్బల్ అండ్ జనరల్ ఎబిలిటీ 72 మార్కులకు ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్కులకు, రేటింగ్ ఆఫ్ అప్లికేషన్‌కు 70 మార్కులకు ఉంటుంది. ► పరీక్ష తేది: 2021 ఏప్రిల్ 29, 30 ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్–అడ్మిషన్స్, ఎన్‌ఐసీఎంఏఆర్, 25/1, బాలేవడి, ఎన్.ఐ.ఎ.పోస్ట్ ఆఫీస్, పూణె –411045 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 14.04.2021 ► వెబ్సైట్: https://www.nicmar.ac.in తెలంగాణ పీజీఈసెట్–2021 తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్సీహెచ్ఈ).. ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే పీజీఈసెట్–2021కు దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈసెట్)–2021 ► కోర్సులు: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితరాలు, ► అర్హత: బీఈ/బీటెక్/బీఫార్మసీ/బీఆర్క్ ఉత్తీర్ణత ఉండాలి. ► ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ► పరీక్ష సమయం: రెండు గంటల్లో 120 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021 ► ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021 ► వెబ్సైట్: http://www.tsche.ac.in -
స్టడీ అబ్రాడ్.. స్కాలర్షిప్స్
విదేశీ విద్యకు ఆసరాగా స్కాలర్షిప్లు నేరుగా విదేశీ యూనివర్సిటీలు/ ఇన్స్టిట్యూట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అకడమిక్ ప్రతిభతోపాటు టోఫెల్/ జీఆర్ఈ/జీమ్యాట్‌లో స్కోర్ తప్పనిసరి విదేశీ విద్య అనగానే భారీ ఫీజులు, తడిసిమోపుడయ్యే ఖర్చులే గుర్తుకొ స్తాయి. అందుకే విదేశీ యూనివర్సిటీల్లో చదువుకోవాలని ఉన్నా..చాలామంది ముందడుగేయ లేరు. ఇప్పుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం ఆయా దేశాల్లో పలు స్కాలర్షిప్స్ అందుబాటులోకి వచ్చాయి. అకడమిక్ రికార్డ్, నిర్ణీత టెస్ట్ స్కోర్లలో ప్రతిభతోపాటు విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు చేసుకుంటే చాలు.. స్కాలర్షిప్ అందుకునేందుకు వకాశాలు ఎన్నో! తద్వారా ఫీజుల ఆందోళనకు ఫుల్స్టాప్ పెట్టి... విదేశీ విద్య స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చు!! ఫాల్ సెమిస్టర్ ప్రవేశ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ విద్య ఔత్సాహికులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ల వివరాలు.. ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ముందంజలో నిలుస్తున్న దేశం ఆస్ట్రేలియా. అందుకోసం ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థులకు పలు స్కాలర్షిప్స్ అందిస్తోంది. ఆస్ట్రేలియా అవార్డ్స్ స్కాలర్షిప్స్: ఆస్ట్రేలియన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో వీటి ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్థాయిలో పూర్తిస్థాయి ప్రవేశం పొందిన వారికి వీటిని అందజేస్తారు. ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు, రీసెర్చ్ కోసం అవసరమయ్యే అకడమిక్ వ్యయాలకు సరిపడే మొత్తానికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఎండీవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్: ఈ ప్రోగ్రామ్ పరిధిలో కూడా పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఏడాదికి 2,01,00 ఆస్ట్రేలియన్ డాలర్లు మంజూరు చేస్తారు. పీజీ అభ్యర్థులకు రెండేళ్లు, పీహెచ్డీ అభ్యర్థులకు మూడున్నరేళ్ల వరకు గడువు ఉంటుంది. ఎండీవర్ ఆస్ట్రేలియా చెంగ్ కాంగ్ రీసెర్చ్ ఫెలోషిప్: నాలుగు నుంచి ఆర్నెల్ల వ్యవధిలో రీసెర్చ్ చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం. ఎంపికైన అభ్యర్థులకు 23,500 ఆస్ట్రేలియా డాలర్లు లభిస్తాయి. ఎండీవర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అవార్డ్స్: ఆస్ట్రేలియా ప్రభుత్వ పరిధిలోని కళాశాలల్లో, యూనివర్సిటీలలో డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, అసోసియేట్ డిగ్రీ ప్రవేశం పొందిన అభ్యర్థులకు వీటిని అందజేస్తారు. గరిష్టంగా 1,19,500 ఆస్ట్రేలియన్ డాలర్లు మంజూరు చేస్తారు. వివరాలకు వెబ్సైట్: https://india.highcommission.gov.au/ndli/study8.html ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్కాలర్షిప్స్: పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులకు ఉద్దేశించిన స్కాలర్షిప్ పథకమిది. ఏటా 300 మంది విదేశీ విద్యార్థులను ఆయా ప్రామాణికాల (రీసెర్చ్ టాపిక్, అకడమిక్ రికార్డ్ తదితర) ఆధారంగా ఎంపిక చేస్తారు. వివరాలకు వెబ్సైట్:https://www.studyinaustralia.gov.au/ జర్మనీ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, రీసెర్చ్‌కు పేరున్న దేశం జర్మనీ. ఇక్కడి యూనివర్సిటీలు∙ఉన్నతవిద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు పలు స్కాలర్షిప్స్ అందిస్తున్నాయి. DDA స్కాలర్షిప్ జర్మనీలో ఉన్నత విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు అత్యున్నత స్కాలర్షిప్ సదుపాయం కల్పించే పథకం.. డాడ్ స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ మేరకు విద్యార్థులకు రీసెర్చ్, ట్యూషన్ ఫీజు, ట్రావెల్ గ్రాంట్స్ లభిస్తాయి. దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ స్కాలర్షిప్ పరిధిలో ఉంటాయి. వివరాలకు వెబ్సైట్: https:www.daad.in/en కోఫి అన్నన్ ఎంబీఏ స్కాలర్షిప్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్: జర్మనీలోని యూరోపియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించేందుకు అందుబాటులోకి తెచ్చిన పథకం ఇది. కనీసం ఏడాది వ్యవధి కలిగిన మేనేజ్మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశించే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఈఎస్ఎంటీ విభాగంలో 25 వేల యూరోలు, ఎంఐఎం విభాగంలో 43,500 యూరోల స్కాలర్షిప్ లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్: www.esmt.org సింగపూర్ సింగపూర్‌లో ఉన్నతవిద్య పట్ల ఇటీవల కాలం లో భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. 3 ప్రభుత్వ యూనివర్సిటీలు, పలు ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు కలిగిన సింగపూర్... అంతర్జాతీయ విద్యార్థులకు పలు స్కాలర్షిప్ సదుపాయాలు కల్పిస్తోంది. ఎస్ఐఏ యూత్ స్కాలర్షిప్ సింగపూర్ ప్రభుత్వ విద్యాశాఖ అందిస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఇది. సింగపూర్‌లోని గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థులకు దీన్ని అందిస్తారు. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ఏటా 2,400 సింగపూర్ డాలర్లతోపాటు, ఉచిత హాస్టల్ సదుపాయం లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్: www.moe.gov.sg/home నాన్యాంగ్ స్కాలర్షిప్ సింగపూర్ ప్రభుత్వ యూనివర్సిటీ.. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ అందిస్తున్న మెరిట్ ఆధారిత స్కాలర్షిప్ ఇది. ఉత్తమ అకడమిక్ ట్రాక్ రికార్డు కలిగి.. ఈ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, బుక్స్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఉచిత వసతి లభిస్తాయి. వివరాలకు వెబ్సైట్: admissions.ntu.edu.sg సింగపూర్ మిలీనియం స్కాలర్షిప్స్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రీ–డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఔత్సాహికులకు అందిస్తున్న స్కాలర్షిప్స్ ఇవి. ఎంఎస్సీ విద్యార్థులకు నెలకు 2000 సింగపూర్ డాలర్లు; పీహెచ్డీ విద్యార్థులకు 3 వేల సింగపూర్ డాలర్లు, పోస్ట్ డాక్టోరల్ అభ్యర్థులకు అయిదు వేల సింగపూర్ డాలర్లు లభిస్తాయి. వివరాలకు వెబ్సైట్: www.singaporemillenniumfoundation.com.sg సింగపూర్ ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ అవార్డ్: సింగపూర్‌లోని ప్రముఖ యూనివర్సిటీలు సంయుక్తంగా రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. దీని పరిధిలో ఆయా యూనివర్సిటీల్లో సైన్స్, ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీలో ప్రవేశం ఖరారు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నాలుగేళ్లపాటు ఏటా 24 వేల సింగపూర్ డాలర్లు అందిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.a-star. edu.sg/singa-award ఎన్‌యూఎస్ ఎంబీఏ ఫెలోషిప్ సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన వారికి సదరు యూనివర్సిటీ అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకం ఎన్‌యూఎస్ ఎంబీఏ ఫెలోషిప్. ఎంబీఏలో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ల ఆధారంగా కనిష్టంగా ఎనిమిది వేలు, గరిష్టంగా 58 వేల సింగపూర్ డాలర్లను అలవెన్స్‌గా చెల్లిస్తారు. వివరాలకు వెబ్సైట్: mba.nus.edu./en/fees-finances/scholarships యునైటెడ్ కింగ్డమ్ (యూకే) భారతీయ విద్యార్థులకు అమెరికా తర్వాతి గమ్యం యూకే. కారణం.. పేరున్న యూనివర్సిటీలు, నాణ్యమైన బోధన. ఫీజులు, ఇతర వ్యయం అధికంగా ఉండే యూకేలో ఉన్నతవిద్యకు పలు స్కాలర్షిప్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గ్రేట్ బ్రిటన్ స్కాలర్షిప్స్ యూకేలో విదేశీ విద్యార్థులకు లభిస్తున్న ప్రధా నమైన స్కాలర్‌షిప్స్‌గా గ్రేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్‌ను పేర్కొనొచ్చు. బ్రిటిష్ కౌన్సిల్ ఏటా అందించే స్కాలర్షిప్స్ ఇవి. మన దేశ విద్యార్థులకు ఈ ఏడాది 67 మందికి ఇవ్వనున్నారు. యూనివర్సిటీ బట్టి స్కాలర్షిప్ మొత్తం నిర్ణయమవుతుంది. పీజీ కోర్సు లకు అయిదు వేల నుంచి ఏడు వేల పౌండ్ల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్: www.britishcouncil.in చార్లెస్ వాలెస్ ఇండియా ట్రస్ట్ స్కాలర్షిప్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ తదితర కోర్సుల విద్యార్థులకు వీటిని అందిస్తారు. కనిష్టంగా మూడు వేల పౌండ్ల నుంచి గరిష్టంగా ఏడు వేల పౌండ్లు లభిస్తాయి. ఆర్ట్స్, హెరిటేజ్, కల్చర్ స్టడీస్ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. వివరాలకు వెబ్సైట్: www.britishcouncil.in ఛెవెనింగ్ స్కాలర్షిప్స్ యూకే ప్రభుత్వం నేరుగా అందించే గ్లోబల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్.. ఛెవెనింగ్ స్కాలర్షిప్స్. పీజీ స్థాయిలో అన్ని కోర్సుల విద్యార్థులూ ఈ స్కాల ర్షిప్నకు అర్హులే. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మొత్తం మినహాయింపుగా లభిస్తుంది. ఎంపిక ప్రక్రి యలో భాగంగా విద్యార్థులు యూకే యూనివర్సిటీ నుంచి పొందిన అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ ఆధా రంగా చెవెనింగ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది. ఎంపిక విధానంలో అభ్యర్థుల అకడమిక్ ట్రాక్ రికార్డ్‌తోపాటు ఆన్లైన్ అసెస్మెం ట్స్ సైతం నిర్వహించి తుది జాబితా విడుదల చేస్తారు. ప్రస్తుతం 2018–19 సంవత్సరానికి సంబం ధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వివరాలకు వెబ్సైట్: www.chevening.org కామన్వెల్త్ షేర్డ్ స్కాలర్షిప్స్ యూకే ప్రభుత్వం డీఎఫ్ఐడీ (డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డవలప్మెంట్) సహకారంతో కామన్వెల్త్ స్కాలర్షిప్ కమిషన్, యూకే యూని వర్సిటీల ద్వారా కామన్వెల్త్ సభ్య దేశాల్లోని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్షిప్స్.. కామన్వెల్త్ షేర్డ్ స్కాలర్ షిప్స్. ఏటా ఆయా దేశాలకు చెందిన 800 మందికి వీటిని అందిస్తారు. పీజీ స్థాయిలో అన్ని కోర్సుల విద్యార్థులు అర్హులు. ఎంపికైతే ట్యూషన్ ఫీజు మిన హాయింపుగా లభిస్తుంది. ఠ వివరాలకు వెబ్సైట్: http://cscuk.dfid.gov.uk ఫెలిక్స్ స్కాలర్షిప్ యూకేలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్స్.. ఫెలిక్స్ స్కాలర్షిప్స్. వీటికి ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్: www.felixscholarship.org ఐఈఎల్టీఎస్ అవార్డ్స్ యూకేలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి అవస రమైన ఐఈఎల్టీఎస్ టెస్ట్‌లో మంచి ప్రతిభ చూపిన వారికి బ్రిటిష్ కౌన్సిల్ అందిస్తున్న స్కాలర్ షిప్.. ఐఈఎల్టీఎస్ అవార్డ్స్. ఐఈఎల్‌టీఎస్‌తో స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు కోసం రూ. మూడు లక్షలు అందజేస్తారు. వివరాలకు వెబ్సైట్: www.britishcouncil.org గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్షిప్స్ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అందిస్తు న్న స్కాలర్షిప్స్.. గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్షిప్స్. ఇవి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారికే లభిస్తాయి. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు, నివాస ఖర్చులు, డిపెండెంట్స్ అలవెన్స్‌లు పొందొచ్చు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.gatescambridge.org హార్న్‌బై ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యూకేలో దాదాపు అయిదు దశాబ్దాలుగా విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కల్పిస్తున్న సంస్థ ఎ.ఎస్.హార్న్‌బై ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ప్రధానంగా యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో పీజీ డిగ్రీ కోర్సులు చదివే వారికే అందిస్తారు. అంతేకాకుండా సదరు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయానికే స్వదేశంలో ఇంగ్లిష్ బోధనలో అనుభవం పొంది ఉండాలి. వివరాలకు వెబ్సైట్: www.hornby-trust.org.uk అమెరికా విదేశీ విద్య అంటే మన విద్యార్థులకు ఠక్కున గుర్తొచ్చే దేశం అమెరికా. ఈ దేశంలో ఇటీవల కాలంలో నిబంధనలు కఠినంగా మారాయి. భారతీయ విద్యా ర్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కొన్ని ప్రోత్సాహ కాలు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు.. ఫుల్బ్రైట్–నెహ్రూ ఫెలోషిప్స్ అమెరికాలోని యూనివర్సిటీల్లో ఆర్ట్స్, కల్చర్, మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పబ్లిక్ అడ్మి నిస్ట్రేషన్ తదితర విభాగాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి అందుబాటులో ఉన్న పథకం.. ఫుల్ బ్రైట్ నెహ్రూ మాస్టర్స్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చు లకు సరిపడే మొత్తాన్ని అందిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.usief.org.in హ్యూబర్ట్ హంప్రే ఫెలోషిప్ ప్రోగ్రామ్ అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ప్రోత్సాహకం... హ్యూబర్ట్ హంప్రే ఫెలోషిప్ ప్రోగ్రామ్. కనీసం ఐదేళ్ల ప్రొఫెషనల్ అనుభవంతో అమెరికాలోని యూని వర్సిటీల్లో అడుగుపెట్టినవారు ఈ ఫెలోషిప్‌నకు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ముఖ్యంగా సస్టెయిన బుల్ డెవలప్మెంట్, డెమొక్రటిక్ ఇన్స్టిట్యూషన్ బిల్డిం గ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకునే వారికి పది నెలల పాటు ఫెలోషిప్ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులకు సరిపడే మొత్తం లభిస్తుంది. వివరాలకు వెబ్సైట్: www.humphreyfellowship.org ఆగాఖాన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అమెరికాలోని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయే ట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు అందు బాటులో ఉన్న మరో స్కాలర్షిప్ ప్రోగ్రామ్.. ఆగాఖా న్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. దీనికి ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మొత్తంలో 50 శాతాన్ని ఉచితంగా, మరో 50 శాతాన్ని రుణం రూపంలో అందిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.akdn.org ఏఏసీఈ స్కాలర్షిప్స్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ ఎడ్యుకేషన్ (ఏఏసీఈ) స్కాలర్‌షిప్స్‌కు అగ్రికల్చర్, కెమికల్, సివిల్, ఇండస్ట్రియల్, ఆర్కిటెక్చరల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, మెకానికల్, మైనింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఫాల్ సెమిస్టర్ సెషన్లో ఎంఎస్‌లో చేరిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి ఏటా రెండు వేల డాలర్ల నుంచి ఎనిమిది వేల డాలర్ల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఇది అభ్యర్థుల ప్రతిభ, ఎంపిక చేసుకున్న బ్రాంచ్ ఆధారంగా ఉంటుంది. వివరాలకు వెబ్సైట్: www.aace.org మరికొన్ని స్కాలర్షిప్స్ ఆసియన్ ఉమెన్ ఇన్ బిజినెస్ స్కాలర్షిప్ ఫండ్. కార్నెల్ యూనివర్సిటీ టాటా స్కాలర్షిప్ ఫుల్బ్రైట్ నెహ్రూ రీసెర్చ్ ఫెలోషిప్ ఎస్ఎన్ బోస్ స్కాలర్స్ స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ స్టాన్‌ఫర్డ్ రిలయన్స్ ధీరూభాయి ఫెలోషిప్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ వీటితోపాటు మిట్, స్టాన్‌ఫర్డ్, ప్రిన్స్టన్, కార్నిగి మెలాన్, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ వంటి దాదాపు అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు స్కాలర్షిప్స్/ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. విద్యార్థులు ఎప్పటికప్పుడు సదరు యూనివర్సిటీల వెబ్సైట్లను వీక్షించడం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. కెనడా అమెరికా సరిహద్దు దేశం కెనడాలోని యూనివర్సిటీలు నాణ్యమైన విద్య అందిం చడంలో ముందుంటున్నాయి. దాంతో అంతర్జాతీయంగా వివిధ దేశాలతోపాటు మన దేశ విద్యార్థులు కూడా ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు. బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ హెల్త్ సైన్స్, నేచురల్ సైన్సెస్, ఇంజనీ రింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో రీసెర్చ్ ఔత్సాహికులకు బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీ యంగా అన్ని దేశాలకు సంబంధించి ఏటా 70 మందికి వీటిని అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 70 వేల డాలర్లు చొప్పున రెండేళ్లపాటు ఈ స్కాలర్షిప్ లభిస్తుంది. వెబ్సైట్: www.banting.fellowships-bourses.gc.ca ట్రుడే సాలర్షిప్స్ ది ట్రుడే ఫౌండేషన్ నిర్వహిస్తున్న పథకమిది. దీన్ని కూడా డాక్టోరల్ (రీసెర్చ్) విద్యార్థులకే అందిస్తారు. సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో పీహెచ్డీ చేయాలనుకున్న వారికి ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి ఏటా 60 వేల డాలర్ల స్కాలర్íషిప్‌తో పాటు 20 వేల డాలర్ల ట్రావెలింగ్ అలవెన్స్ అందుతుంది. వివరాలకు వెబ్సైట్: www.trudeaufoundation.ca వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ కెనడియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, నేచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకం.. వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్. కెనడాలోని యూనివర్సిటీల్లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా 50 వేల డాలర్లు చొప్పున మూడేళ్లపాటు ఈ స్కాలర్షిప్ అందిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.vanier.gc.ca మరికొన్ని స్కాలర్షిప్స్: కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్– మాస్టర్స్ ప్రోగ్రామ్స్, ఐడీఆర్సీ రీసెర్చ్ అవార్డ్స్; ఎన్ఎస్ ఈఆర్సీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్; అన్నేవల్లె ఎకలాజికల్ ఫండ్. జపాన్ రీసెర్చ్ కార్యకలాపాల పరంగా ముం దంజలో నిలుస్తున్న జపాన్.. భారతీయ విద్యార్థులకు ప్రత్యేకంగా పలు స్కాలర్ షిప్స్ అందిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పోస్ట్ డాక్టోరల్ వరకు వీటిని అందుకునే వీలుంది. జపనీస్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ రీసెర్చ్ స్టూడెంట్ జపాన్ సంబంధిత హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఐటీ, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ సహా 17 విభాగాల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశంపొందిన వారికి ఈ స్కాలర్షిప్ సదుపాయం లభిస్తుంది. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ఏటా 1,43,000 జపాన్ యెన్లు స్టైపెండ్‌గా అందుతుంది. దీంతోపాటు ట్యూషన్ ఫీజు నుంచి మినహా యింపు ఉంటుంది. వివరాలకు వెబ్సైట్: www.in.emb-japan.go.jp అండర్గ్రాడ్యుయేట్ స్టడీస్ సోషల్æ సైన్సెస్, నేచురల్ సైన్స్, ఇంజ నీరింగ్, మెడిసిన్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కో ర్సుల్లో ప్రవేశం పొందిన వారికి లభించే స్కాలర్షిప్స్ ఇవి. అయిదేళ్లపాటు ఏడాదికి 1,17,000 యన్లు స్కాలర్షిప్ లభిస్తుంది. యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ పీజీ కోర్సుల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం ఇది. పబ్లిక్ అడ్మినిస్ట్రే షన్, లోకల్ గవర్నెన్స్, లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో జపాన్ యూని వర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకోవాలి. ఎంపికైన వారికి ఏడాది వ్యవధిలో నెలకు 2,42,000 జపాన్ యెన్ల రూపంలో స్కాలర్షిప్ ఇస్తారు. ఏషియన్ డవలప్మెంట్ బ్యాంక్ – జపాన్ స్కాలర్షిప్ జపాన్‌లోని యూనివర్సిటీల్లో ఎకనామిక్స్, మేనేజ్మెంట్, సైన్స్, టెక్నాలజీ తదితర కోర్సుల్లో పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సభ్యదేశాల విద్యార్థులకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకం ఏడీబీ–జపాన్ స్కాలర్షిప్స్. ఏటా 150 మందికి ఏడీబీ బ్యాంక్ ఈ స్కాలర్షిప్ను అందిస్తుంది. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు, నివాస వ్య యం, ఇతర అకడమిక్ సంబంధిత వ్యయాలకు సరిపడే మొత్తాన్ని చెల్లిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.adb.org ఎంపిక విధానం స్కాలర్షిప్ కోరుకునే విద్యార్థులు ఆయా యూనివర్సిటీలు లేదా సంస్థలకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అప్పటికే తాము ఆయా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందినట్లు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా దరఖాస్తులను వడపోస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందించి.. వారికి స్కాలర్షిప్/ఫెలోషిప్‌లు ఖరారు చేస్తారు. అర్హతలు అకడమిక్‌గా పదో తరగతి నుంచి 60 శాతానికి మించిన మార్కులతో ఉత్తీర్ణత. టోఫెల్/ఐఈఎల్టీఎస్ టెస్ట్ స్కోర్స్. జీఆర్ఈ/జీమ్యాట్ టెస్ట్ స్కోర్స్. లెటర్స్ ఆఫ్ రికమండేషన్. -
మనిషి మనుగడకు ప్రాథమిక హక్కులు!
అనాదిగా పౌరుడికి, రాజ్యానికి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. వీరి మధ్య సామరస్యం సాధించేందుకు కృషి జరుగుతూనే ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యక్తిగత స్వేచ్ఛ ఎంత అవసరమో, రాజ్య సమగ్రత కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించేందుకు ఉపయోగపడే సాధనాలు ప్రాథమిక హక్కులు. సామాజిక ఆమోదం పొంది, సమాజంలో చట్టబద్ధత కలిగిన వ్యక్తులందరూ అనుభవించే సదుపాయాలను హక్కులుగా చెప్పొచ్చు. ఇవి మనిషి మనుగడకు ఎంతో అవసరం. అందుకే వీటిని ప్రాథమిక హక్కులుగా పిలుస్తున్నారు. దాదాపు ఆధునిక రాజ్యాంగాలన్నీ వీటిని ప్రస్తావించాయి. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రమే హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చలేదు. అంతమాత్రాన ఆయా దేశాల్లో ప్రజలు హక్కులు అనుభవించటం లేదని కాదు.. సంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు, న్యాయస్థానాల తీర్పులు అక్కడి ప్రజలను పరిరక్షిస్తున్నాయి. అమెరికా, ఐరిష్ రాజ్యాంగాలు స్ఫూర్తిగా మన రాజ్యాంగ కర్తలు అమెరికా, ఐరిష్ రాజ్యాంగాల్లో పొందుపర్చిన హక్కులను ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రస్తావించారు. ఫ్రెంచ్ విప్లవకాలంలో చేసిన మానవహక్కుల ప్రకటన, ఐక్యరాజ్యసమితి ఆమోదించిన మానవ హక్కుల చార్టర్.. రాజ్యాంగ కర్తలను ప్రభావితం చేశాయి. రాజ్య నిరపేక్షాధికారం నుంచి వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తూ, సమాజంలోని వివిధ వర్గాలు సగటు పౌరుడి స్వేచ్ఛను హరించకుండా నిరోధించే చట్టబద్ధ హామీలు (అవసరమై నప్పుడు) న్యాయస్థానాలు జారీచేసే రిట్ల ద్వారా అమలవుతాయి. రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పొందుపర్చిన ఆదేశ సూత్రాలు కూడా హక్కులే. అయితే ప్రాథమిక హక్కులు వ్యక్తి శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తే, ఆదేశ సూత్రాలు సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేస్తాయి. ఆదేశ సూత్రాలను ఐరిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగంలోని 12 నుంచి 35 ప్రకరణలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. 12వ ప్రకరణ ప్రకారం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు వినియోగించే అధికారాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదు. 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను తొలగించటం, పరిమితం చేసే చట్టాలను పార్లమెంటు చేయకూడదు. కానీ, 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 368వ ప్రకరణ కింద తనకు సంక్రమించిన అధికారం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, తొలగించవచ్చు. ఈ అధికారాన్ని 13(4) రాజ్యాంగ ప్రకరణ పార్లమెంటుకు కట్టబెట్టింది. ప్రాథమిక హక్కులు – రకాలు రాజ్యాంగంలో ఏడు రకాల ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978).. ఆస్తి హక్కు (31వ ప్రకరణ)ను ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది. దానికి చట్టబద్ధ, రాజ్యాంగ హక్కు హోదాను (300ఎ ప్రకరణ) కల్పించింది. ప్రస్తుతం ఆరు రకాల ప్రాథమిక హక్కులు అమల్లో ఉన్నాయి. అవి.. సమానత్వ హక్కు (14–18 ప్రకరణ వరకు): దీని ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే. లింగ, కుల, మత, ప్రాంత, పుట్టుక ప్రాతిపదికన వివక్షత నిషేధం. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అంటరానితనం పాటించడం నేరం. బిరుదులు పొందడం నిషిద్ధం. స్వాతంత్య్ర హక్కు (19–22 ప్రకరణలు): పౌరులకు వాక్, భావ ప్రకటనా స్వాతంత్య్రం; సంఘాలుగా ఏర్పడేందుకు; శాంతియుతంగా సమావేశం కావడానికి; భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించడానికి; ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి; ఏ వృత్తినైనా స్వీకరించడానికి, వ్యాపారం చేసుకోవడానికి స్వాతంత్య్రం ఉంది. నేరస్థాపన విషయంలో రక్షణ, విద్యాహక్కు, ప్రాణ హక్కు, వ్యక్తిగత స్వాతంత్య్ర రక్షణ. కొన్ని సందర్భాల్లో నిర్బంధం నుంచి రక్షణ. దోపిడీlనిరోధన హక్కు (23–24 ప్రకరణలు): మానవుల క్రయవిక్రయాలు, బలవంతపు చాకిరీ నిషేధం; ఫ్యాక్టరీలు లాంటి వాటిలో పిల్లలతో పని చేయించడం నిషేధం. మత స్వాతంత్య్రం హక్కు (25–28 ప్రకరణలు): అంతరాత్మానుసారం వ్యవహరించడానికి స్వాతంత్య్రం; స్వేచ్ఛగా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు; మత వ్యవహారాలను నిర్వహించడానికి స్వాతంత్య్రం ఉంది. అయితే మతం పేరిట పన్నులు చెల్లించాలని కోరడం; విద్యాసంస్థల్లో (అల్పసంఖ్యాక వర్గాలు నిర్వహించే) మత బోధన జరిగేటప్పుడు వాటికి హాజరుకావాలని నిర్దేశించడం నిషేధం. సాంస్కృతిక విద్యా విషయాల హక్కు (29–30 ప్రకరణలు): అల్పసంఖ్యాక వర్గాలకు తమ భాషను, లిపిని సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంది. ఈ సంస్థలకు విద్యాసంస్థల స్థాపన, నిర్వహణ హక్కు ఉంది. రాజ్యాంగ పరిరక్షణ హక్కు (32వ ప్రకరణ): పైన ప్రస్తావించిన 5 రకాల హక్కులకు భంగం కలిగినప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంట్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ రిట్ల జారీ ద్వారా వాటి అమలును నిర్దేశిస్తాయి. సుప్రీంకోర్టు 32వ ప్రకరణ కింద.. హైకోర్టులు 226వ ప్రకరణ కింద రిట్లను జారీచేస్తాయి. రాజ్యాంగ పరిరక్షణ హక్కును డా. బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగానికి ‘ఆత్మ, గుండె’గా అభివర్ణించారు. ఈ హక్కులు నిరపేక్షం కాదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వీటికి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు. 352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు 19వ ప్రకరణలో ఉన్న ఆరు ప్రాథమిక స్వాతంత్య్రాలను తాత్కాలికంగా రద్దు చేయొచ్చు. అలాగే 20, 21 రాజ్యాంగ ప్రకరణల్లో ప్రస్తావించిన హక్కులు మినహా మిగిలిన వాటి అమలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కును రాష్ట్రపతి ఉత్తర్వు మేరకు నిలిపేయొచ్చు. సాధారణ పరిస్థితుల్లో కూడా బలహీన వర్గాల ప్రయోజనాలను ఉద్దేశించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు. బలహీన వర్గాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ఈ కోవకే చెందుతాయి. 14, 20, 21, 23, 25, 27, 28 రాజ్యాంగ ప్రకరణల కింద సక్రమించే హక్కులు భారతదేశంలో నివసించే వారందరికీ (విదేశీయులతో సహా) లభిస్తాయి. కానీ, 15, 16, 19, 21ఎ, 30 రాజ్యాంగ ప్రకరణల కింద లభించే హక్కులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఆదేశ సూత్రాలు 36 నుంచి 51 వ రాజ్యాంగ ప్రకరణ వరకు పొందుపర్చిన ఆదేశాలను ప్రభుత్వం తన విధాన రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలి. వీటి అమలు కోసం న్యాయస్థానాలు రిట్లను జారీచేసే అవకాశం లేదు. అయితే సామాజిక ప్రయోజనాల దృష్ట్యా సందర్భానికి తగిన ఉత్తర్వులను న్యాయస్థానాలు జారీ చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ఆదేశ సూత్రాలను విస్మరించలేదు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయంలో ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలకు మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఆదేశ సూత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. గత 60 ఏళ్లలో ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు, సాధారణ చట్టాల ద్వారా ఆదేశ సూత్రాల అమలుకు చొరవ తీసుకుంది. ఆదేశ సూత్రాలకు ఆటంకమన్న కారణంతో ఆస్తి హక్కు లాంటి ప్రాథమిక హక్కును తొలుత సవరించి, ఆ తర్వాత తొలగించారు. ఆదేశ సూత్రాలు కొన్ని సామ్యవాద స్వభావాన్ని, మరికొన్ని గాంధీజీ ఆశయాలను ప్రతిబింబిస్తే.. మరికొన్ని ఉదారవాద స్వభావాన్ని కలిగి ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం, సంపద కేంద్రీకృతం కాకుండా నిరోధించడం, తద్వారా పంపిణీ; ప్రజలకు జీవనోపాధి కల్పించడం; కార్మికులు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి కృషి చేయడం లాంటివి సామ్యవాద స్వభావం ఉన్నవి. పంచాయతీరాజ్ వ్యవస్థల ఏర్పాటు; షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమం; కుటీర పరిశ్రమల ప్రోత్సాహం; గోవధ నిషేధం; మద్యపాన నిషేధం లాంటివి గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి. ఉమ్మడి పౌరశిక్ష స్మృతి అమలు; శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయ నిర్వహణ; పౌష్టికాహారం అందించడం; అంతర్జా తీయ శాంతికి కృషి చేయడం; కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడం వంటివి ఉదారవాద స్వభావం కలిగి ఉన్నాయి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉచిత న్యాయసహాయం కల్పించడం; కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం; పర్యావరణ, వన్య జీవుల, అడవుల సంరక్షణ; పిల్లల ప్రగతికి తగిన అవకాశాలు కల్పించడం అనే అంశాలు చేర్చారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాల విషయంలో అసమానతలు తగ్గించడం అనే అంశాన్ని రాజ్యాంగంలో పొందుపర్చారు. ఆదేశ సూత్రాల అమలు.. ప్రభుత్వ చొరవ ఆదేశ సూత్రాల అమలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చొరవలో కొన్ని ముఖ్యమైనవి... భూసంస్కరణల అమలు ద్వారా సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా నిరోధించడం. పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ పరమైన హోదా కల్పించడంతో గాంధీజీ ఆశయాలు నేరవేర్చినట్లయింది. కుటీర పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి సమాజ వికాస అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దీనికి మంచి ఉదాహరణ. ఆదేశ సూత్రాల అమలుకు తీసుకున్న కొన్ని చర్యలు చట్టపరమైన వివాదాలకు దారితీశాయి. ప్రధానంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయనే కారణంతో న్యాయస్థానంలో ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేశారు. దీనికి గోలక్‌నాథ్ కేసు (1967), కేశవానంద భారతి కేసు (1973), మినర్వామిల్స్ కేసు (1980) ఉదాహరణలు. 25, 42 రాజ్యాంగ సవరణ చట్టాలు ఆదేశ సూత్రాల పరిధిని విస్తృతం చేస్తూ ప్రాథమిక హక్కుల పరిధిని పరిమితం చేశాయి. 25వ రాజ్యాంగ సవరణ చట్టం 39(బీ, సీ) ప్రకరణల్లో ప్రస్తావించిన ఆదేశ సూత్రాలకు 14, 19 ప్రకరణల్లో పొందుపర్చిన ప్రాథమిక హక్కుల కంటే అధిక ప్రాధాన్యం కల్పించింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఆదేశ సూత్రాల ఆధిక్యతను మరింత విస్తరిస్తూ ఆదేశ సూత్రాల అమలుకు చేసిన ఏ చట్టాలకైనా 14, 19 ప్రకరణల కంటే ఆధిక్యతను కల్పించింది. అయితే సుప్రీంకోర్టు ఈ సవరణను మినర్వామిల్స్ (1980) కేసులో కొట్టేసింది. ఈ తీర్పు ప్రకారం 39 బీ, సీ ప్రకరణల్లో పేర్కొన్న ఆదేశ సూత్రాల అమలుకు చేసిన చట్టాలు మాత్రమే 14, 19 ప్రకరణల కంటే ఆధిక్యతను కలిగి ఉంటాయి. మిగిలిన విషయాల్లో ప్రాథమిక హక్కులదే పైచేయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. డా‘‘ బి.జె.బి. కృపాదానం సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్ -
ప్రపంచంలో తొలిసారి కనుగొన్న వ్యాక్సిన్?
1. మైక్రోబయాలజీ (సూక్ష్మజీవ శాస్త్రం) అంటే? కంటికి కనిపించని సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, వైరస్, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. 2. మైక్రోబయాలజీ పితామహుడు ఎవరు? లూయీ పాశ్చర్ 3. లూయీ పాశ్చర్ ఆవిష్కరణలు ఏవి? పాశ్చరైజేషన్ విధానాన్ని కనుగొన్నాడు. వ్యాధులు, సూక్ష్మజీవ జనితాలు (జెర్మ థియరీ ఆఫ్ డిసీజ్) సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. (జెర్మ థియరీని రాబర్ట కోచ్ ప్రయోగపూర్వకంగా నిరూపించాడు) రేబిస్ వ్యాక్సిన్‌ను (కుక్క కాటుకు) కనుగొన్నాడు. ఆంథ్రాక్స్, కలరా వ్యాధులకు వ్యాక్సిన్‌ను కనుగొన్నాడు. 4. పాశ్చరైజేషన్ అంటే? సేకరించిన పాలను 70నిఇ వరకు వేడిచేసి, 1530 సెకన్ల పాటు ఉంచి, వెంటనే చల్లార్చి (10నిఇ) ప్యాకెట్లలో నిల్వచేసే పద్ధతిని పాశ్చరైజేషన్ అంటారు. 5. సూక్ష్మజీవ శాస్త్ర ప్రాముఖ్యత ఏమిటి? చనిపోయిన మొక్కలు, జంతువుల దేహాలను సూక్ష్మజీవులు కుళ్లింపజేసి, పోషక పదార్థాలను ఏర్పరచి నేలను సారవంతం చేస్తాయి. ఆ పోషక పదార్థాలను మొక్కలు వినియోగించుకుంటాయి. ఆక్సిజన్, కార్బన్, నత్రజని, సల్ఫర్ వంటి మూలకాలు పునఃచక్రీయం చెందడంలో సూక్ష్మజీవులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సూక్ష్మజీవులు మొక్కల్లో, మానవుల్లో అనేక వ్యాధులను కలగజేస్తాయి. మరోవైపు సూక్ష్మజీవ నాశక ఔషధాలు (యాంటీబయాటిక్స్), టీకా (వ్యాక్సిన్)ల ఉత్పత్తిలోనూ తోడ్పడుతున్నాయి. 6. ఎక్సో మైక్రోబయాలజీ (వ్యోమ సూక్ష్మ జీవశాస్త్రం) అంటే? ఇటీవల కాలంలో సూక్ష్మజీవులను ఉపయోగించి రోదసీలో జీవాన్వేషణ జరుపుతున్నారు. దీన్నే వ్యోమ సూక్ష్మజీవ శాస్త్రం అంటారు. 7. సూక్ష్మజీవ నాశిని పెన్సిలిన్‌ను ఆవిష్కరిం చినవారు ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (బ్రిటన్) పెన్సీలియం నోటెటమ్ అనే శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ అనే సూక్ష్మజీవ నాశక ఔషధాన్ని 1929లో కనుగొన్నాడు. 1945లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హోవర్డ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బోరిస్ చైన్ (పెన్సిలిన్ ఔషధ గుణాన్ని వివరించారు)లు సంయుక్తంగా నోబెల్ బహుమతి పొందారు. 8. యాంటీబయాటిక్స్ (సూక్ష్మజీవ నాశకాలు) అంటే ఏమిటి? రోగకారక సూక్ష్మజీవులను (బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు) నిర్మూలించే మందులను యాంటీబయాటిక్స్ అంటారు. 9. మొట్టమొదటి యాంటీబయాటిక్ పేరు? పెన్సిలిన్. దీన్ని వండర్ డ్రగ్, సర్వరోగ నివారిణి అని కూడా అంటారు. 10. యాంటీబయాటిక్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 11. ఆరియో మైసిన్ సృష్టికర్త ఎవరు? డా.ఎల్లాప్రగడ సుబ్బారావు (పశ్చిమ గోదావరి జిల్లా) ఆరియోమైసిన్ను టెట్రాసైక్లిన్ అని కూడా పిలుస్తారు. టైఫాయిడ్, ప్లేగు, క్షయ వంటి అనేక బ్యాక్టీరియా వ్యాధులను టెట్రాసైక్లిన్ నయం చేస్తుంది. యల్లాప్రగడను విజర్డ ఆఫ్ వండర్ డ్రగ్స అని పిలుస్తారు. 12. టీకాలు (వ్యాక్సిన్లు) అంటే ఏమిటి? చంపివేసిన (లేదా) బలహీనపర్చిన సూక్ష్మజీవులుగల మందులనే టీకాలు/వ్యాక్సిన్లు అంటారు. చంపివేసిన (లేదా) నిర్వీర్యం చేసిన సూక్ష్మజీవులను శరీరంలోకి ప్రవేశపెట్టిన ప్పుడు శరీరం ప్రతిరక్షకాలను తయారుచేసి, నిల్వ ఉంచుకొని రక్షణ కల్పిస్తుంది. 13. {పపంచంలో తొలిసారి కనుగొన్న వ్యాక్సిన్? స్మాల్‌పాక్స్ (మశూచి వ్యాధికి- 1796) ఎడ్వర్డ జెన్నర్ దీన్ని కనుగొన్నాడు. ఇతణ్ని వ్యాక్సిన్ పితామహుడు, అసంక్రామ్యతా (ఇమ్యూనిటీ) పితామహుడు అని పిలుస్తారు. 14. వ్యాక్సినేషన్ అంటే ఏమిటి? చంపిన (లేదా) బలహీనపర్చిన వ్యాధి కారక సూక్ష్మజీవులను మానవ శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. 15. వ్యాక్సిన్ పదానికి మూలం? వ్యాక్సిన్ పదం ‘వాకా’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. వాకా అంటే ఆవు అని అర్థం. 16. పోలియో (శిశు పక్షవాతం) వ్యాధికి అందుబాటులో ఉన్న టీకాలు? పోలియో టీకా: జోనాస్సాక్ (1952) పోలియో చుక్కల మందు (ైట్చ ౌ్కజీౌ గ్చఛిఛిజ్ఛీ ై్కగ) అల్బర్ట సాబిన్ (1957) 17. {పపంచ వ్యాప్తంగా నిర్మూలించిన వైరస్ కారక వ్యాధి? మశూచి (స్మాల్‌పాక్స్) గతంలో అడిగిన ప్రశ్నలు 1. పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్నది ఎవరు? 1) బాంటింగ్ 2) కేథరిన్ ఫ్రాంక్ 3) జోనాస్ సాక్ 4) ఫ్లెమింగ్ 2. సూక్ష్మజీవ నాశిని పెన్సిలిన్‌ను కింది వాటిలో దేన్నుంచి ఉత్పత్తి చేస్తారు? 1) బ్యాక్టీరియా 2) ఫంగస్/బూజు 3) వైరస్ 4) శైవలం 3. {పపంచంలో మొదటి యాంటీబయాటిక్? 1) స్ట్రెప్టోమైసిన్ 2) క్రోసిన్ 3) పెన్సిలిన్ 4) క్వినైన్ 4. భారతదేశంలో తొలిసారిగా, జన్యుపరంగా తయారు చేసిన వ్యాక్సిన్? 1) ఆ.ఇ.ఎ 2) ై.్క.గ 3) ఏ.ఆ.గ 4) ఊ.క.ఈ 5. ఇమ్యునైజేషన్ ప్రక్రియలో సజీవ (లేదా) నిర్జీవ సూక్ష్మజీవులను ఉపయోగించి వ్యాధులు రాకుండా నివారించే పద్ధతులను ఏమంటారు? 1) యాంటీటాక్సిన్ 2) వ్యాక్సిన్ 3) టాక్సాయిడ్ 4) ఎనీమియా 6. శాస్త్రీయ పద్ధతిలో పాలల్లోని సూక్ష్మజీవులను నశింపజేసే పద్ధతి? 1) స్టెరిలైజేషన్ 2) పాశ్చరైజేషన్ 3) కిణ్వనం 4) ప్యూరిఫికేషన్ సమాధానాలు 1) 3; 2) 2; 3) 3; 4) 3; 5) 2; 6) 2. డా॥డి. సమ్మయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుజూరాబాద్