ప్రపంచంలో తొలిసారి కనుగొన్న వ్యాక్సిన్?
1. మైక్రోబయాలజీ (సూక్ష్మజీవ శాస్త్రం) అంటే?
కంటికి కనిపించని సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, వైరస్, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
2. మైక్రోబయాలజీ పితామహుడు ఎవరు?
లూయీ పాశ్చర్
3. లూయీ పాశ్చర్ ఆవిష్కరణలు ఏవి?
పాశ్చరైజేషన్ విధానాన్ని కనుగొన్నాడు.
వ్యాధులు, సూక్ష్మజీవ జనితాలు (జెర్‌మ థియరీ ఆఫ్ డిసీజ్) సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. (జెర్‌మ థియరీని రాబర్‌ట కోచ్ ప్రయోగపూర్వకంగా నిరూపించాడు)
రేబిస్ వ్యాక్సిన్‌ను (కుక్క కాటుకు) కనుగొన్నాడు.
ఆంథ్రాక్స్, కలరా వ్యాధులకు వ్యాక్సిన్‌ను కనుగొన్నాడు.
4. పాశ్చరైజేషన్ అంటే?
సేకరించిన పాలను 70నిఇ వరకు వేడిచేసి, 1530 సెకన్ల పాటు ఉంచి, వెంటనే చల్లార్చి (10నిఇ) ప్యాకెట్లలో నిల్వచేసే పద్ధతిని పాశ్చరైజేషన్ అంటారు.
5. సూక్ష్మజీవ శాస్త్ర ప్రాముఖ్యత ఏమిటి?
చనిపోయిన మొక్కలు, జంతువుల దేహాలను సూక్ష్మజీవులు కుళ్లింపజేసి, పోషక పదార్థాలను ఏర్పరచి నేలను సారవంతం చేస్తాయి. ఆ పోషక పదార్థాలను మొక్కలు వినియోగించుకుంటాయి.
ఆక్సిజన్, కార్బన్, నత్రజని, సల్ఫర్ వంటి మూలకాలు పునఃచక్రీయం చెందడంలో సూక్ష్మజీవులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
సూక్ష్మజీవులు మొక్కల్లో, మానవుల్లో అనేక వ్యాధులను కలగజేస్తాయి. మరోవైపు సూక్ష్మజీవ నాశక ఔషధాలు (యాంటీబయాటిక్స్), టీకా (వ్యాక్సిన్)ల ఉత్పత్తిలోనూ తోడ్పడుతున్నాయి.
6. ఎక్సో మైక్రోబయాలజీ (వ్యోమ సూక్ష్మ జీవశాస్త్రం) అంటే?
ఇటీవల కాలంలో సూక్ష్మజీవులను ఉపయోగించి రోదసీలో జీవాన్వేషణ జరుపుతున్నారు. దీన్నే వ్యోమ సూక్ష్మజీవ శాస్త్రం అంటారు.
7. సూక్ష్మజీవ నాశిని పెన్సిలిన్‌ను ఆవిష్కరిం చినవారు ఎవరు?
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (బ్రిటన్) పెన్సీలియం నోటెటమ్ అనే శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ అనే సూక్ష్మజీవ నాశక ఔషధాన్ని 1929లో కనుగొన్నాడు.
1945లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హోవర్‌డ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బోరిస్ చైన్ (పెన్సిలిన్ ఔషధ గుణాన్ని వివరించారు)లు సంయుక్తంగా నోబెల్ బహుమతి పొందారు.
8. యాంటీబయాటిక్స్ (సూక్ష్మజీవ నాశకాలు) అంటే ఏమిటి?
రోగకారక సూక్ష్మజీవులను (బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు) నిర్మూలించే మందులను యాంటీబయాటిక్స్ అంటారు.
9. మొట్టమొదటి యాంటీబయాటిక్ పేరు?
పెన్సిలిన్. దీన్ని వండర్ డ్రగ్, సర్వరోగ నివారిణి అని కూడా అంటారు.
10. యాంటీబయాటిక్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
అలెగ్జాండర్ ఫ్లెమింగ్
11. ఆరియో మైసిన్ సృష్టికర్త ఎవరు?
డా.ఎల్లాప్రగడ సుబ్బారావు (పశ్చిమ గోదావరి జిల్లా)
ఆరియోమైసిన్‌ను టెట్రాసైక్లిన్ అని కూడా పిలుస్తారు.
టైఫాయిడ్, ప్లేగు, క్షయ వంటి అనేక బ్యాక్టీరియా వ్యాధులను టెట్రాసైక్లిన్ నయం చేస్తుంది.
యల్లాప్రగడను విజర్‌డ ఆఫ్ వండర్ డ్రగ్‌స అని పిలుస్తారు.
12. టీకాలు (వ్యాక్సిన్లు) అంటే ఏమిటి?
చంపివేసిన (లేదా) బలహీనపర్చిన సూక్ష్మజీవులుగల మందులనే టీకాలు/వ్యాక్సిన్లు అంటారు.
చంపివేసిన (లేదా) నిర్వీర్యం చేసిన సూక్ష్మజీవులను శరీరంలోకి ప్రవేశపెట్టిన ప్పుడు శరీరం ప్రతిరక్షకాలను తయారుచేసి, నిల్వ ఉంచుకొని రక్షణ కల్పిస్తుంది.
13. {పపంచంలో తొలిసారి కనుగొన్న వ్యాక్సిన్?
స్మాల్‌పాక్స్ (మశూచి వ్యాధికి- 1796)
ఎడ్వర్‌డ జెన్నర్ దీన్ని కనుగొన్నాడు.
ఇతణ్ని వ్యాక్సిన్ పితామహుడు, అసంక్రామ్యతా (ఇమ్యూనిటీ) పితామహుడు అని పిలుస్తారు.
14. వ్యాక్సినేషన్ అంటే ఏమిటి?
చంపిన (లేదా) బలహీనపర్చిన వ్యాధి కారక సూక్ష్మజీవులను మానవ శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటారు.
15. వ్యాక్సిన్ పదానికి మూలం?
వ్యాక్సిన్ పదం ‘వాకా’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. వాకా అంటే ఆవు అని అర్థం.
16. పోలియో (శిశు పక్షవాతం) వ్యాధికి అందుబాటులో ఉన్న టీకాలు?
పోలియో టీకా: జోనాస్‌సాక్ (1952)
పోలియో చుక్కల మందు (ైట్చ ౌ్కజీౌ గ్చఛిఛిజ్ఛీ ై్కగ) అల్బర్‌ట సాబిన్ (1957)
17. {పపంచ వ్యాప్తంగా నిర్మూలించిన వైరస్ కారక వ్యాధి?
మశూచి (స్మాల్‌పాక్స్)
గతంలో అడిగిన ప్రశ్నలు
1. పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్నది ఎవరు?
1) బాంటింగ్ 2) కేథరిన్ ఫ్రాంక్
3) జోనాస్ సాక్ 4) ఫ్లెమింగ్
2. సూక్ష్మజీవ నాశిని పెన్సిలిన్‌ను కింది వాటిలో దేన్నుంచి ఉత్పత్తి చేస్తారు?
1) బ్యాక్టీరియా
2) ఫంగస్/బూజు
3) వైరస్ 4) శైవలం
3. {పపంచంలో మొదటి యాంటీబయాటిక్?
1) స్ట్రెప్టోమైసిన్ 2) క్రోసిన్
3) పెన్సిలిన్ 4) క్వినైన్
4. భారతదేశంలో తొలిసారిగా, జన్యుపరంగా తయారు చేసిన వ్యాక్సిన్?
1) ఆ.ఇ.ఎ 2) ై.్క.గ
3) ఏ.ఆ.గ 4) ఊ.క.ఈ
5. ఇమ్యునైజేషన్ ప్రక్రియలో సజీవ (లేదా) నిర్జీవ సూక్ష్మజీవులను ఉపయోగించి వ్యాధులు రాకుండా నివారించే పద్ధతులను ఏమంటారు? 1) యాంటీటాక్సిన్ 2) వ్యాక్సిన్
3) టాక్సాయిడ్ 4) ఎనీమియా
6. శాస్త్రీయ పద్ధతిలో పాలల్లోని సూక్ష్మజీవులను నశింపజేసే పద్ధతి?
1) స్టెరిలైజేషన్ 2) పాశ్చరైజేషన్
3) కిణ్వనం 4) ప్యూరిఫికేషన్
సమాధానాలు
1) 3; 2) 2; 3) 3; 4) 3;
5) 2; 6) 2.
డా॥డి. సమ్మయ్య
అసిస్టెంట్ ప్రొఫెసర్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
హుజూరాబాద్