What is the Latest Best Treatment For Hair Fall? - Sakshi
Sakshi News home page

హెయిర్‌ ఫాల్‌ నివారణ కోసం కొత్త చికిత్సలు

Published Thu, Mar 25 2021 2:19 PM | Last Updated on Thu, Mar 25 2021 3:11 PM

What is the latest treatment for hair loss - Sakshi

జుట్టు రాలడం నెమ్మదిగా దిండు మీద ఒకటి రెండు వెంట్రుకలతో మొదలవుతుంది. తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇల్లూ ఒళ్లూ ఎక్కడచూసినా జుట్టే(హెయిర్ లాస్) కనిపించే స్థాయికి పెరుగుతుంది. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? అసౌకర్యంగా ఉంటూ, చెమట కంపు కొట్టే విగ్గులు, లేదా టోపీ, స్కార్ఫ్‌తో తలను దాచుకోవడం తప్పదా? నొప్పి పుట్టించే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ వాడాలా? లేక హెయిర్ లాస్ చికిత్సలే మేలా? అందుబాటులో ఉన్న పరిష్కారాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు.

ట్రాన్స్‌ప్లాంట్‌...
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం అనేది ఒక సర్జికల్ ప్రక్రియ. దానిలో ముఖ్యంగా నెత్తిమీద ఆరోగ్యంగా ఉన్న ప్రాంతం నుంచి తీసిన వెంట్రుకలను హెయిర్‌లాస్‌ అయిన చోట నాటుతారు. దీనిలో కొన్ని నెలలపాటు, కొంత ఇబ్బంది కరమైన, బాధాకరమైన సెషన్లను భరించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన చోట రక్తస్రావంతో పాటూ పొక్కుకట్టడం, ముఖం ఉబ్బడం, ఇన్పెక్షన్, వాపు, తలనొప్పి, నాటిన చోట మచ్చలు లాంటి సైడ్ ఎపెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. 

పిఆర్సీ.. 
ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ(పీఆర్పీ) అనేది ఒక కాలం చెల్లిన చికిత్సా ప్రక్రియ. దీనిలో నెత్తి మీది చర్మం ఫోలికల్స్‌ను పెంచడానికి, స్వయంగా రోగి రక్తంలో ఉన్న సహజ పెరుగుదల కారకాలను ఉపయోగిస్తారు. రోగి రక్తాన్ని తీసి రిచ్ ప్లాస్మాను వేరు చేయడానికి దాన్ని ఒక సెంట్రిఫ్యూజ్‌లో తిప్పుతారు. దీనిలో ఒక చికిత్స సెషన్‌కు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే 8 నుంచి 12 ఎంఎల్ పీఆర్పీ అవసరం అవుతుంది. పీఆర్పీని సూదుల సాయంతో నెత్తిమీదున్న చర్మం లోలోపలి పొరల్లో ఇంజెక్ట్ చేస్తారు. ఒక్కో పీఆర్పీ సెషన్‌కు రూ.10 వేల నుంచి, రూ.12 వేలకు పైగా ఖర్చు అవుతుంది. పీఆర్పీ ఫలితాల్లో వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉంటుంది. 

ఎందుకంటే ఇంజెక్షన్, చికిత్స పద్ధతిలో ప్రామాణీకరణ అనేది ఉండదు. ఆరు నెలల చికిత్స తర్వాత జుట్టు చిక్కదనంలో కేవలం 19.29 శాతం పెరుగుదలను చూపించే పీఆర్పీ ఫలితాలకు మూడు నెలల సమయం పడుతుంది. ఈ ఫలితాలు కొనసాగేలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి బూస్టర్ డోస్ కూడా అవసరమవుతుంది. దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు)లో..పీఆర్పీ చికిత్సలో సున్నితత్వం, ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి, నెత్తిమీద చర్మం బిగుతుగా కావడం, తలనొప్పి, మచ్చ కణజాలం ఏర్పడడం, ఇంజెక్షన్ వేసిన చోట కాల్షియం పేరుకుని గట్టిపడడం లాంటి సాధారణ సైడ్ ఎఫెక్టులు ఉంటాయి.

నాన్‌సర్జికల్‌ గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్‌మెంట్స్..
సంప్రదాయ చికిత్సలకు ఇవి కొత్త ఒరవడి అని చెప్పాలి. ఇవి సురక్షితమైన, సులభమైన, అత్యంత ప్రభావవంతమైన, సర్జరీ అవసరం లేని చికిత్సలుగా ఇప్పుడు బాలీవుడ్, హీరోలు సైతం హెయిర్ ఫాల్ సమస్యను అదుపు చేయడానికి దీనిని ఎంచుకుంటున్నారు. ఇది అమెరికా పేటెంట్ పొందిన, మొక్కల నుంచి ఉత్పన్నమైన సహజమైన  కాయకల్ప చికిత్స. ఒక తరహా జుట్టు రాలడానికి పీసీఓఎస్ కారణం అయితే, కీమోథెరపీ, సెబొర్రిక్ డెర్మటైటిస్, అలోపీసియా అరీయాటా వల్ల అలోపీషియా వస్తుంది. పురుషులు, మహిళల్లో ఆండ్రోజెనెటిక్ అలోపీషియా చికిత్సకు ఇది చాలా సమర్థవంతమైనదని నిరూపితమైనది. 

ఒక దశాబ్దం పాటు విస్తృత పరిశోధనలు, అధ్యయనం తర్వాత  డాక్టర్ దేబరాజ్ షోమే, డాక్టర్ రింకీ కపూర్ QR 678@హెయిర్ రీగ్రోత్ ట్రీట్‌మెంట్ ను కమర్షియల్ మార్కెట్‌కు పరిచయం చేశారు. విటమిన్లు, మినరల్స్, గ్రోత్ పెప్‌టైడ్స్ కలిసున్న ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ నెత్తిమీది చర్మం ఫోలికల్స్‌ను తిరిగి నింపుతాయి, ఆరోగ్యకరమైన, దట్టమైన జుట్టు పెరగడానికి కారణమయ్యే జుట్టు ఫోలికల్స్‌కు రక్త సరఫరాను పెంచుతాయి. నెత్తిమీద బట్టతల ఉన్న ప్రాంతాలను ఇది గుర్తించాక మొత్తం ప్రక్రియకు దాదాపు 30 సెకన్లు పడుతుంది. నొప్పిలేకుండా ఉండే ఈ సెషన్స్ 8 నుంచి 12 నెలల పాటు ప్రతి నెలా రిపీట్ అవుతాయి. ప్రముఖ అమెరికా జర్నళ్లలో ఈ ట్రీట్‌ మెంట్‌ గురించి ప్రచురించిన ప్రకారం...

  • ఈ హెయిర్ లాస్ ట్రీట్‌మెంట్‌ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. జుట్టు సాంద్రత, మందం పెరగడం వల్ల ఆండ్రోజెనెటిక్ అలోపీసియా కారణంగా, జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్య వంతులైన పురుషులు, మహిళళపై జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో 83 శాతం పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. అలాగే హెయిర్ షాఫ్ట్ డయామీటర్ లాంటి వాటితో బాధపడే రోగుల్లో ఆరు నెలల చికిత్స ముగిసిన తర్వాత 100 శాతం పెరుగుదల కనిపించింది. 
  • హెయిర్ లాస్ ఎదుర్కుంటున్న పీసీఓఎస్ రోగుల్లో 80 శాతం జుట్టు నిరంతరం మళ్లీ పెరుగుతూ ఉండేలా అత్యంత ప్రభావవంతమైన ఫలితాలు ఇచ్చింది. ఒక ఏడాది పాటు నిర్వహించిన గ్లోబల్ అసెస్ ‌మెంటులో సగటు హెయిర్ కౌంట్‌లో 12.71 శాతం పెరుగుదల గమనించారు.ఈ చికిత్సకు రోజుకు రూ.200 ఖర్చవుతుంది. కేవలం 8 సెషన్ల చికిత్సలోనే జుట్టు పెరుగుదల ఉంటుందని, లేదంటే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా,నే రూ.12,000 విలువైన రెండు అదనపు సెషన్లు సేవలు అందుకోవచ్చునని డాక్టర్ దేబ్‌రాజ్ షోమ్, డాక్టర్ రింకీకపూర్ భరోసా ఇస్తున్నారు.

చదవండి:

పేను కొరుకుడు అంటే ఏంటో తెలుసా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement