రోజంతా చురుగ్గా ఉండాలా..అయితే ఇది మీకోసమే!    | Tips On Creating Healthy Nutrition Habits at Home | Sakshi
Sakshi News home page

రోజంతా చురుగ్గా ఉండాలా..అయితే ఇది మీకోసమే!   

Published Mon, Mar 22 2021 11:00 PM | Last Updated on Mon, Mar 22 2021 11:22 PM

Tips On Creating Healthy Nutrition Habits at Home - Sakshi

చాలామంది రోజంతా మందకొడిగా ఉన్నట్లు ఫీలవుతుంటారు. అలా కాకుండా రోజంతా చురుగ్గా ... హెల్దీగా ఉండాలంటే ఈ సూచనలు పాటిస్తే చాలు... ∙ఆహారంలో ఎక్కువగా ఉడికించిన పదార్థాలు ఉండేలా చూసుకోండి. కూరగాయలతో ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి. నట్స్‌ ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. మాంసాహారం ఇష్టమైతే, దానితోపాటు ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోండి. ∙వెన్న, నెయ్యి వాడకం పూర్తిగా తగ్గించండి.

ఇక మీ ఆహారంలో వాడే నూనెలకు బదులు ఆలివ్‌ ఆయిల్‌ ఉండేలా చూసుకోండి. ∙రోజులో ఎక్కువసార్లు నీళ్లు తాగండి. ∙కాఫీ, టీ లను పరిమితంగా తీసుకోండి. ఒకవేళ తాగాల్సి వస్తే దానికి బదులు గ్రీన్‌ టీ, లెమన్‌ టీ వంటివి తీసుకోండి. ∙ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకోడానికి బదులు తాజా పళ్లను తినండి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement