ఆ భోజనం మాకొద్దు
చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన క్షీరభాగ్యతో పాటు మధ్యాహ్న భోజన పధకాన్ని లక్షలాది మంది చిన్నారులు వద్దంటున్నారు. రాష్ట్రంలోని దాదాపు 2.67లక్షల మంది భోజనాన్ని వద్దనుకుంటే, మరో 2.46లక్షల మంది క్షీరభాగ్య పథకానికి దూరంగా ఉంటున్నారు. ఇవి ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడవుతున్న అంశాలు.
బెంగళూరు: రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతస్థాయి పాఠశాలలతోపాటు మదరసాల్లో సైతం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాలు అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 5,582 పాఠశాలలుండగా, వీటిలో మొత్తం 64.74లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో గత ఏడాది 62.07లక్షల మంది మధ్యాహ్న భోజనం తీసుకుంటే, 61.28 లక్షల మంది చిన్నారులు క్షీరభాగ్యలో భాగంగా అందజేసే పాలను తీసుకున్నారు. అంటే పాఠశాలల్లోని మొత్తం విద్యార్థుల్లో 2.67లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి, 2.46లక్షల మంది చిన్నారులు క్షీరభాగ్యకు దూరంగా ఉండిపోయారు. వీరంతా కావాలనే మధ్యాహ్నభోజనాన్ని, క్షీరభాగ్యలో ఇచ్చే పాలను వద్దనుకుంటున్నారని అధికారులే చెబుతున్నారు.
కారణాలివే: విద్యార్థులు తమంతట తామే మ ధ్యాహ్న భోజ నాన్ని, క్షీరభాగ్య పథకాన్ని వద్దనుకోవడానికి కొన్ని కారణాలను అధికారులు అన్వేషించారు. ప్రస్తుతం క్షీరభాగ్య పథకంలో పాలను పాల పొడిని కలపడం ద్వారా వి ద్యార్థులకు అందజేస్తున్నారు. 18 గ్రాముల పాలపొడిని నీటిలో కలపడం ద్వారా 150 మిల్లీలీటర్ల పాలను తయారు చేసి ఒక్కో విద్యార్థికి వారంలో మూడు రోజుల పాటు అందజేస్తున్నారు. అయితే పాలపొడి ద్వారా తయారుచేసిన పాలను తాగడం ద్వారా ఆడపిల్లలు లావుగా తయారవుతారనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. తమ ఆడపిల్లలు ఊబకాయం బారిన పడతారనే ఉద్దేశంతోనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్షీరభాగ్యకు దూరంగా ఉంచుతున్నారు. ఇదే సందర్భంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట మధ్యాహ్న భోజనాన్ని తీసుకున్న చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మ ధ్యా హ్న భోజనానికి దూరంగా ఉంచుతున్నారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో అందజేసే భోజనంలో నాణ్యత లేదని, ఆ భోజనం తయారీలో ఉపయోగించే సరుకులు నాసిరకమైనవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. అందువల్ల లక్షల సంఖ్యలో చిన్నారులు మ ధ్యాహ్న భోజనానికి దూరంగా ఉంటున్నారని అక్షర దాసోహ అధికారులు చెబుతున్నారు.
ప్రయత్నాలు ఫలించలేదు
పాఠశాలల్లోని విద్యార్థులందరినీ మధ్యాహ్న భోజనం, క్షీరభాగ్య పథకాల్లో భాగస్వాములను చేసేందుకు అక్షర దాసోహ అధికారులు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించడం లేదని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం, క్షీరభాగ్య ఆవశ్యకతను తల్లిదండ్రులకు తెలియజేసేందుకు అక్షర దా సోహ అధికారులు ఇంటింటికీ వెళ్లి జాగృతి కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. అం దువల్ల వచ్చే విద్యా ఏడాది మధ్యాహ్న భోజ నం, క్షీరభాగ్యలో భాగస్వాములయ్యే విద్యార్థుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.