►‘అంగన్‌వాడీ’లకు దుర్వాసనతో కూడిన పాల సరఫరా
►విజయ డెయిరీ అధికారుల నిర్లక్ష్యం
►యంత్రాలు పాడయ్యూయంటూ సమాధానం
►లబ్ధిదారులకు సర్దిచెప్పలేక కార్యకర్తల సతమతం
హన్మకొండ చౌరస్తా : విజయ డెరుురీ అధికారుల నిర్లక్ష్యం... అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ‘ఆరోగ్యలక్ష్మి’పథకం కింద పౌష్టికాహారం పొం దే లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ని ర్వహిస్తున్న ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం డెయిరీ అధికారుల తీరుతో అబాసుపాలవుతుంది. పథకం ప్రారంభం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఇటు అంగన్‌వాడీ కార్యకర్తలు, అటు లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
పౌష్టికాహారం కోసం ‘ఆరోగ్యలక్ష్మి’
శిశు సంక్షేమం, మహిళాభివృద్ద్ధి శాఖ ఆధ్వర్యాన జిల్లాలో 18 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 4,196 మెయిన్, 327 మినీ అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలు, ఐదేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గత ఏడాది జనవరి 1న ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా సెంటర్లలోనే 200 ఎంఎల్ పాలు, ఒక గుడ్డు, పప్పు, కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందజేయూలి. ఈ మేరకు గుడ్ల సరఫరాను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం.. పాల సరఫరా మాత్రం ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి అప్పగించింది. పథకం ప్రారంభంలో కొద్దిరోజులు అంగన్‌వాడీ సెంటర్లను గుర్తించడంలో జాప్యం కారణంగా పాల సరఫరా ఆలస్యం కాగా, సెంటర్ల గుర్తింపు తర్వాత పాల నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆది నుంచి డెయిరీ అధికారుల తీరు పట్ల ఐసీడీఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నా రు. అయినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో నాణ్యమైన పాల సరఫరా కలగానే మిగిలిందని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు 10వేల లీటర్ల పైనే..
హన్మకొండ అలంకార్ సమీపంలోని విజయ డెయిరీ ద్వారా ప్రతిరోజు సుమారు 30 వేల లీ టర్ల పైచిలుకు పాలు జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తారు. ఇందులో పది నుంచి 12వేల లీటర్ల వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిస్తారు. అయితే ఇటీవల పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో డెయిరీ మిషనరీ సామర్థ్యం సరిపోక పాల శీతలీకరణ, శుద్ధి ఆలస్యమవుతోందని డెయిరీ సిబ్బంది వాపోతున్నారు. అ రుుతే, పాలు ఎక్కువగా వస్తే మిగిలినవి హైదరాబాద్‌కు పంపించాల్సి ఉంటుంది. కానీ.. ఇక్కడి యంత్రాల సామర్థం సరిపోక డెరుురీ అధికారుల నిర్లక్ష్యంతో పాల శీతలీకరణ జరగపోగా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మిగిలిన పాలు హైదరాబాద్ వెళ్లడం లేదు. దీంతో ఈ రోజు మిగిలిన పాలను.. ఆ తర్వాత రోజు ప్యాకింగ్ చేసి సరఫరా చేస్తుండడంతో దుర్వాసన వస్తోందని సమాచారం.
తాజాగా..
రాయపర్తి : జిల్లావ్యాప్తంగా అత్యధికంగా అంగన్‌వాడీ సెంటర్లకు సోమవారం సరఫరా చేసిన పాలు దుర్వాసన వచ్చాయని బాధ్యులు వెల్లడించారు. స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి ప్రాజెక్టుల పరిధిలో ఈ మేరకు పలు ఫిర్యాదులు వచ్చారుు. రాయపర్తిలో నాలుగు అంగన్‌వాడీ కేం ద్రాలు ఉండగా.. నాలుగింటికి సరఫరా చేసిన పాలు వేడి చేయగానే పగిలి పోవడమే కాకుండా దుర్వాసన వచ్చిందని కార్యకర్తలు.. సూపర్‌వైజర్లు, సీడీపీవోలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విజయ డెయిరీ అధికారులను ప్రశ్నిస్తే సమాధా నం కరువైందని పేర్కొన్నారు. అంతే కాకుండా రాయపర్తిలోని కేంద్రాలకు గడి చిన జనవరిలో పదిహేను రోజుల పాటు పాలు సరఫరా చేయలేదని చెప్పారు. ఇక వారం నుంచి సరఫరా చేస్తున్న పాలలో నాణ్యత లేకపోవడంతో కాగబెట్టగానే పగిలిపోతున్నాయని తెలిపారు. ఇలా జరుగుతుండడంతో లబ్ధిదారులు తమను తప్పు పడుతున్నారని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు.
పీడీ దృష్టికి తీసుకెళ్లాం
ఘన్‌పూర్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ సెంటర్లకు పాడైన పాలు పోసింది వాస్తవమే. నేనే స్వయంగా చూశాను. ఈ విషయాన్ని పీడీకి తెలియజేస్తే ఈరోజు జిల్లావ్యాప్తంగా అన్ని సెంటర్ల పరిస్థితి ఇలానే ఉందన్నారు. అందుకే పాలు తీసుకున్నట్లు ఇండెంట్‌లో రాయకండని సూచించారు. విజయ డెరుురీలో మిషన్ పాడైందని గత నెలలో ఆరు రోజులు పాలు సరఫరానే చేయలేదు.
- జయంతి, సీడీపీఓ, స్టేషన్ ఘన్‌పూర్
రేపు పాలు పంపించొద్దని చెప్పా..
జిల్లాలోని అంగన్‌వాడీ సెంటర్లకు పాడైన పాలు సరఫరా అయినట్లు నాకు ఫిర్యాదులు అందాయి. మిషనరీ సమస్యతో ఐస్ తయారుకాక ఈ సమస్య తలెత్తుతుంది. అందుకే పాలు పాడవుతున్నాయి. అరుుతే, కొత్త యంత్రాలు వచ్చినా కనెక్షన్ ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి నిపుణులు రావాల్సి ఉంది. ఆ యంత్రాల బిగింపు పూర్తరుుతే సమస్యలు తలెత్తవు. ఈమేరకు అంగన్‌వాడీ సెంటర్లకు మంగళవారం పాలు సరఫరా చేయొద్దని సిబ్బందికి చెప్పా. - వెంకట్‌రెడ్డి, ఇన్‌చార్జి డీడీ, విజయ డెయిరీ, వరంగల్
నురుగు కాదు.. మురుగు
Published Tue, Feb 2 2016 3:37 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM
Advertisement
Advertisement