ఎన్‌ఐఎన్ రూపొందించిన న్యూట్రిఫై ఇండియా నౌ యాప్
హైదరాబాద్: జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్త ఆధ్వర్యంలో పోషకాహార విలువలపై ‘న్యూట్రిఫై ఇండియా నౌ’ పేరుతో మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కార్యదర్శి డాక్టర్ బలరామ్ భార్గవ శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ యాప్ ప్రతి ఒక్కరికి ఒక న్యూట్రి షన్ గైడ్‌లా పనిచేయనుంది. ఒక వ్యక్తి ఏ ఆహారాన్ని ఎంత తీసుకోవాలి. తీసుకున్న ఆహారంలో ఏయే మోతా దుల్లో పోషకాలు ఉంటాయనే విషయాలను దీని ద్వారా తెలుసుకుని, ఆయా పదార్థాలను తీసుకునే వీలుంటుం ది. పోషకాహార పదార్థాల పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే భారతీయులు సాధారణంగా తీసుకునే ఆహార పదార్థాలు, వాటిలో కేలరీల శక్తి, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఏయే మోతాదుల్లో ఉంటాయి, అవి మన శరీరానికి ఏయే మోతాదుల్లో అవసరమనే విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
దేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్
ఇప్పటి వరకు ప్రపంచంలోని ఆయా దేశాలు వారి ఆహా రపు అలవాట్లకు అనుగుణంగా ఇలాంటి న్యూట్రిషనల్ యాప్‌లను రూపొందించుకుని వినియోగిస్తున్నారు. అయితే భారతీయుల ఆహారపు అలవాట్లు, వారు తీసుకునే ఆహారంలో ఉండాల్సిన పోషకాల గురించి ఇప్పటి వరకు ఇలాంటి యాప్‌లు అందుబాటులో లేవు. దేశంలోనే తొలిసారిగా ఈ యాప్‌ను ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 14 భాషల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ యాప్‌లో....
ఈ యాప్‌లో నాకు కావాల్సిన పోషకాహా రాలు (మై న్యూట్రియెంట్స్ రిక్వైర్‌మెంట్స్) నా భోజనంలో పోషకాలు (న్యూట్రియెంట్స్ ఇన్ మై ఫుడ్), నా డైట్.. నా యాక్టివిటీ (మై డైట్ అండ్ యాక్టివిటీ), సెర్చ్ ఫుడ్ బై న్యూట్రిషన్, సెర్చ్ ఫుడ్ బై లాంగ్వేజ్ తదితర అంశాలు ఉన్నాయి. అవస రమైన దానిపై క్లిక్ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు.
యాప్ ఉపయోగాలు...
ఈ యాప్ వల్ల మనిషి తాను తీసుకునే ఆహారంలో ఉండే పోషకాల గురించి సులువుగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఏ వయసు వారికి ఎన్ని కిలో కేలరీల ఆహారం అవసరం, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే ఏ మేరకు పోషకాలు లభిస్తాయి అనే విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment