National Nutrition Institute
-
పోషకాహార విలువలపై యాప్
హైదరాబాద్: జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్త ఆధ్వర్యంలో పోషకాహార విలువలపై ‘న్యూట్రిఫై ఇండియా నౌ’ పేరుతో మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కార్యదర్శి డాక్టర్ బలరామ్ భార్గవ శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ యాప్ ప్రతి ఒక్కరికి ఒక న్యూట్రి షన్ గైడ్‌లా పనిచేయనుంది. ఒక వ్యక్తి ఏ ఆహారాన్ని ఎంత తీసుకోవాలి. తీసుకున్న ఆహారంలో ఏయే మోతా దుల్లో పోషకాలు ఉంటాయనే విషయాలను దీని ద్వారా తెలుసుకుని, ఆయా పదార్థాలను తీసుకునే వీలుంటుం ది. పోషకాహార పదార్థాల పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే భారతీయులు సాధారణంగా తీసుకునే ఆహార పదార్థాలు, వాటిలో కేలరీల శక్తి, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఏయే మోతాదుల్లో ఉంటాయి, అవి మన శరీరానికి ఏయే మోతాదుల్లో అవసరమనే విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్ ఇప్పటి వరకు ప్రపంచంలోని ఆయా దేశాలు వారి ఆహా రపు అలవాట్లకు అనుగుణంగా ఇలాంటి న్యూట్రిషనల్ యాప్‌లను రూపొందించుకుని వినియోగిస్తున్నారు. అయితే భారతీయుల ఆహారపు అలవాట్లు, వారు తీసుకునే ఆహారంలో ఉండాల్సిన పోషకాల గురించి ఇప్పటి వరకు ఇలాంటి యాప్‌లు అందుబాటులో లేవు. దేశంలోనే తొలిసారిగా ఈ యాప్‌ను ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 14 భాషల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చని ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ యాప్‌లో.... ఈ యాప్‌లో నాకు కావాల్సిన పోషకాహా రాలు (మై న్యూట్రియెంట్స్ రిక్వైర్మెంట్స్) నా భోజనంలో పోషకాలు (న్యూట్రియెంట్స్ ఇన్ మై ఫుడ్), నా డైట్.. నా యాక్టివిటీ (మై డైట్ అండ్ యాక్టివిటీ), సెర్చ్ ఫుడ్ బై న్యూట్రిషన్, సెర్చ్ ఫుడ్ బై లాంగ్వేజ్ తదితర అంశాలు ఉన్నాయి. అవస రమైన దానిపై క్లిక్ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. యాప్ ఉపయోగాలు... ఈ యాప్ వల్ల మనిషి తాను తీసుకునే ఆహారంలో ఉండే పోషకాల గురించి సులువుగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఏ వయసు వారికి ఎన్ని కిలో కేలరీల ఆహారం అవసరం, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే ఏ మేరకు పోషకాలు లభిస్తాయి అనే విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
నలుగురిలో ఒకరికి మధుమేహం..
సాక్షి, హైదరాబాద్: దాదాపు ప్రతి నలుగురిలో ఒకరికి మధుమేహం.. ముగ్గురిలో ఒకరికి అధిక రక్తపోటు.. ఇదీ దేశంలో నగరవాసుల పరిస్థితి. రోజువారీ అవసరాల కంటే తక్కువ మోతాదులో పోషకాలు, విటమిన్లు తీసుకుంటుం డటం ఈ పరిస్థితికి కారణం కావచ్చని జాతీయ పోషకాహార సంస్థ చెబుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ వందో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశంలోని నగరాల్లో నివసిస్తున్న వారి పౌష్టికత, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అంశాలపై విస్తృత అధ్యయనం నిర్వహించింది. 2015–16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 1.72 లక్షల మందిపై చేసిన ఈ అధ్యయనం.. ఆహారం విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ ఏమిటన్నది స్పష్టం చేస్తోంది. మొత్తం 16 రాష్ట్రాల్లోని ప్రజలు ఒక రోజులో తీసుకుంటున్న ఆహారం ఆధారంగా ఆ సంస్థ ఓ నివేదిక రూపొందించింది. భారత వైద్య పరిశోధన సమాఖ్య నిర్దేశించిన మోతాదు లోనే నగర ప్రజలు తృణధాన్యాలు (రోజుకు 320 గ్రాములు), చిరుధాన్యాలు (42 గ్రా) తీసుకుంటున్నారు. ► పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు, చక్కెర, బెల్లం వంటి వాటిని మాత్రం నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా తీసుకుంటున్నారు. ► మూడేళ్ల లోపు పిల్లల్లో సగం మందికి, 4–6 ఏళ్ల మధ్య వయసు వారిలో మూడింట రెండొంతుల మందికి, గర్భి ణుల్లో 56 శాతం మందికి మాత్రమే రోజూ అవసరానికి తగ్గ మోతాదుల్లో ప్రొటీన్లు, కేలరీలు అందుతున్నాయి. ► ఐదేళ్ల లోపు పిల్లల్లో 25 శాతం మంది వయసుకు తగ్గ బరువు ఉండటం లేదు. అలాగే 29 శాతం పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి తక్కువగా ఉంటోంది. ► పోషకాహార లేమి అనేది బాలికలతో పోలిస్తే బాలురలోనే (6–17 మధ్య వయసు) ఎక్కువగా ఉండటం గమనార్హం. ► బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లి స్తన్యం పట్టాలన్న సూత్రాన్ని నగర ప్రాంతాల్లో పాటిస్తున్న వారు 42 శాతం మంది మాత్రమే. నలుగురిలో ఒకరు తల్లి పాల కంటే ముందుగా తేనె, గ్లూకోజ్, చక్కెర నీరు, మేకపాలు వంటివి పడుతున్నారు. ► నగరాల్లో నివసిస్తున్న పురుషుల్లో 31 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉంటే, మహిళల్లో ఈ సంఖ్య 26 శాతంగా ఉంది. అధిక రక్తపోటు సమస్య కేరళలో అత్యధికంగా ఉంటే.. అత్యల్పం బిహార్ రాష్ట్రంలో నమోదైంది. ► నగరాల్లోని పురుషుల్లో 22 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, మహిళల్లో 19 శాతం మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
రాగితో ఊబకాయానికి చెక్
సాక్షి, హైదరాబాద్: బరువు తగ్గేందుకు చాలా మంది ఊబకాయులు తిండి తినడం బాగా తగ్గించేస్తుంటారు. దీంతో బరువు తగ్గడం మాటెలా ఉన్నా... ముందు నీరసం, ఆ తరువాత రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే తినడం పెద్దగా తగ్గించకుండానే.. రాగి (కాపర్) శరీరానికి అందించడం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారం ద్వారా తీసుకునే రాగి శరీరంలోని కొవ్వును కరిగించే విషయంలో బాగా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. శరీరంలో రక్తకణాలు తయారయ్యేందుకు, శరీరం ఇనుమును శోషించుకునేందుకు, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు, అనుసంధాన కణజాలం (కనెక్టివ్ టిష్యూ) అభివృద్ధికి రాగి తోడ్పడుతుందని ఇప్పటికే వెల్లడైందని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ చాంగ్ వెల్లడించారు. ఈ పరిశోధన కోసం ఊబకాయంతో ఉండి, ‘విల్సన్స్ డిసీజ్’ పరిస్థితి ఉన్న ఎలుకలను శాస్త్రవేత్తల బృందం ఎంచుకుంది. అవసరానికి మించి అందిన రాగి (కాపర్) ని శరీరం బయటకు విసర్జించలేకపోవడం, తద్వారా కాలేయం సహా పలు అవయవాల్లో రాగి ఎక్కువగా చేరుకోవడమే విల్సన్స్ డిసీజ్. రాగి ఎక్కువగా ఉన్న ఈ ఎలుకలు ఊబకాయంతో ఉన్నా.. వాటిల్లో కొవ్వు మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు సాధారణ ఎలుకలతో పోలిస్తే వీటి కొవ్వు కణాల్లో రాగి తక్కువగా ఉంది. కొవ్వును కరిగించే మందుల ప్రభావం విల్సన్ డిసీజ్ ఉన్న ఎలుకల్లో తక్కువగా ఉందని గుర్తించారు. అప్పటికే కొవ్వు కణాలను రాగి నియంత్రిస్తుండడమే దీనికి కారణమని తేల్చారు. దీనిని బట్టి కొవ్వు కణాలను కరిగించడంలో రాగి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు అంచనాకు వచ్చామని క్రిస్ చాంగ్ తెలిపారు. అయితే అధిక మోతాదులో రాగిని తీసుకోవడం శరీరంలోని లోహాల సమతౌల్యాన్ని దెబ్బతీయవచ్చని స్పష్టం చేశారు. ►జాతీయ పౌష్టికాహార సంస్థ అంచనాల ప్రకారం సాధారణ వ్యక్తులకు ప్రతిరోజు రెండు మిల్లీగ్రాముల రాగి అవసరం. అంతకు మించకూడదు. ►రాగి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు నువ్వులు, జీడిపప్పు, కాబూలీ శనగలు, పీతలు, ఎండ్రకాయలు. -
రేపటి నుంచి కోళ్ల ప్రదర్శన
{పారంభించనున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో భారత కోళ్ల ప్రదర్శన జరుగనుంది. ఈ ప్రదర్శనను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బాల్య న్ ఇందులో పాల్గొంటారు. ఈ నెల 24న సాంకేతిక విజ్ఞాన సదస్సు జరగనుంది. కోళ్ల ప్రదర్శన వివరాలను భారతీయ కోళ్ల పెంపకం పరికరాల తయారీదార్ల సంఘం అధ్యక్షుడు హరీశ్‌గార్వారే, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, చక్రధర్‌రావు, సుబ్బరాజు, బాలస్వామి తదితరులు సోమవారం వివరించారు. ఈ ప్రదర్శనలో 180 దేశీయ, 40 విదేశీ సంస్థలు రకరకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని తెలిపారు. ప్రదర్శనను తిలకించేందుకు దాదాపు 25 వేల మంది హాజరవుతారని తెలిపారు. భారత్ దాదాపు 6,500 కోట్ల గుడ్లు, 3.80 కోట్ల టన్నుల కోడి మాంసం ఉత్పత్తి చేస్తోందని, దీంతో రూ.90 వేల కోట్ల జాతీయాదాయం సమకూరుతోందని పేర్కొన్నారు. కోళ్ల పెంపకానికి దేశంలో విస్తారమైన అవకాశాలున్నాయన్నారు. దేశంలో తలసరి 4 కేజీల కోడిమాంసం, 57 గుడ్లు వినియోగిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా మాత్రం సగటున 11.2 కేజీల కోడి మాంసం, 155 గుడ్లు వినియోగిస్తున్నారని చెప్పారు. పోషకాహారలోపం, మాంసకృత్తుల ప్రయోజనాలపై ఉద్యమం చేపట్టామని, సెప్టెంబర్‌లో తొలి దశ ఉద్యమం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పోషకాహార వారోత్సవాలు నిర్వహించాలని జాతీయ పోషకాహార సంస్థను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు ప్రధానికి నివేదించినట్లు పేర్కొన్నారు. లేయర్ పరిశ్రమ అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, కేంద్రం నుంచి ఎటువంటి లబ్ధి చేకూరడం లేదని వాపోయారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. -
ఒత్తిడితో చిత్తు..
టెన్షన్లో గ్రేటర్ యువత 40 శాతం మందిలో హైబీపీ నేడు ప్రపంచ హైపర్ టెన్షన్ డే సిటీబ్యూరో: ఉరుకుల పరుగుల జీవితం..మారిన ఆహారపు అలవాట్లు.. అధిక బరువు..పని ఒత్తిడి.. కాలుష్యం..వెరసి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్రేటర్లో 40 శాతం మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ ఇటీవల వెల్లడించింది. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో కన్పించే హైపర్ టెన్షన్ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్లకే బయపడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోకపోతే గుండె, మూత్రపిండాలు, మెదడు వ ంటి కీలక అవయవాల పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నేడు(ఆదివారం)వరల్డ్ హైపర్‌టెన్షన్ డే! మారిన జీవన శైలితోనే.. ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషిని కాలు కూడా కదుపనీయడం లేదు. కూర్చున్న చోట నుంచి అన్ని పనులు చకచక పూర్తి చేసే అవకాశం వచ్చింది. సెల్‌ఫోన్ సంభాషణలు, ఇంటర్నెట్ చాటింగ్‌లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. హోటళ్లలో రెడీమేడ్‌గా దొరికే బిర్యానీలు, పిజ్జాలు, బర్గలు, మద్యం కూడా అధిక బరువుకు కారణం అవుతున్నాయి. గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న స్థూలకాయానికి ఇదే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మధ్య వయస్కులతో పోలిస్తే...యువకుల్లోనే ఈ సమస్య ఎక్కువ ఉంది. ఒత్తిడికి గురయ్యే వారు రెండు రకాలు. టైప్ ‘ఏ’ కోపంగా ఉండేవారు. టైప్ ‘బి’ తమలోని భావాలను చెప్పకుండా తక్కువ మాట్లాడే వారు. వీరిలో టైప్ ‘ఏ’ వారికే ఎక్కువ రిస్క్ ఉంటుంది. అధిక రక్తపోటుతో హృద్రోగ సమస్యలు.. 95 శాతం హైపర్ టెన్షన్‌కు మారిన జీవనశైలే కారణం. కేవలం ఐదు శాత ం మందిలో జన్యుపరంగా సంక్రమిస్తుంది. తరచు తల నొప్పి , కళ్లు బైర్లు కమ్మడం..ఛాతీ గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. చీటికిమాటికి చికాకు, పట్టలేని కోపం ప్రదర్శిస్తారు. ప్రతి ఒక్కరూ విధిగా బీపీ చెకప్ చేయించుకోవాలి.ఆహారంలో ఉప్పు, పచ్చళ్ల వాడకాన్ని తగ్గించాలి. పప్పు, కాయకూరలు తీసుకోవాలి. - డాక్టర్ సి.వెంకట ఎస్. రామ్, అపోలో ఆస్పత్రి ఇలా అధిగమించవచ్చు.. ఒత్తిడికి లోనైనప్పుడు నిశబ్దంగా ఉన్న గదిలో కూర్చుని కళ్లుమూసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదులుతుండాలి. పగటి కలలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపే వారిలో మానసిక ఒత్తిడి చాలా తక్కువ. 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఆటలకు కొంత సమయం కేటాయించాలి. - డాక్టర్ ప్రవీణ్ కొప్పుల, జనరల్ ఫిజిషియన్, గ్లోబల్ ఆస్పత్రి -
చంద్రగిరిలో ‘ఎన్ఐఎన్’
రూ.3 కోట్లతో ఏర్పాటుకు ఐసీఎంఆర్ అంగీకారం సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జాతీయ పోషకాహార సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్-ఎన్ఐఎన్)ను ఏర్పాటు చేసేందుకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ముందుకొచ్చింది. చంద్రగిరిలో ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) భవనాన్ని తాత్కాలికంగా ఎన్ఐఎన్కు కేటాయిస్తున్నారు. ఎన్ఐఎన్ సహకారంతో ఏర్పాటయ్యే ఈ సంస్థను ఎంఆర్హెచ్ఆర్యూ (మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్)గా పిలుస్తారు. దీనికోసం ఐసీఎంఆర్ రూ.3 కోట్లు ఖర్చు చేయనుంది. ఎంఆర్హెచ్ఆర్యూ విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రమిస్తున్న వ్యాధులు వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, కొత్తగా వచ్చే వైరస్లు తదితర అన్నింటిపైనా ఇక్కడ పరిశోధనలు చేస్తారు. ఇది తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండి ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. దీంతో పాటు రూ.200 కోట్లతో జాతీయ స్థాయి ఎన్ఐఎన్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇది కాకినాడలో ఏర్పాటు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.