
వన్ డే ఫుల్ మీల్స్
మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారం అందుతోంది.
అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
హన్మకొండ చౌరస్తా :మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారం అందుతోంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఇందిరమ్మ అమృతహస్తం పథకం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో పాలు, గుడ్లతోపాటు భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ పథకాన్ని విస్తరింప జేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో లబ్ధిదారులకు మందిని ఎన్నుకునే ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒక్క పూట భోజనం (వన్‌డే ఫుల్ మీల్స్) అందేలా ఏర్పాట్లు చేస్తోంది. మేరకు నవంబర్ 26న జీఓ నంబర్ 12ను జారీ చేసింది. అంతేకాదు... పథకం అమలుకు కావాల్సిన బడ్జెట్ ను ఈ నెల ఒకటో తేదీనే విడుదల చేయడంతోపాటు కావాల్సిన ఏర్పాట్లు చేయూలని తాజాగా మరోసారి ఆదేశించింది. ఈ మేరకు నూతన సంవత్సరంలో ఈ పథకం అమలు చేసేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 18 ప్రాజెక్టుల పరిధిలోని 2,40,340 మందికి లబ్ధి చేకూరనుంది.
ఇప్పటివరకు లబ్ధిదారులకు క్కొక్కరికి ప్రతి నెల 16 నుంచి 25 కోడిగుడ్లు అందుతుండగా... కొత్త పథకం ద్వారా నెలకు 30 గుడ్లు, 200 మిల్లీలీటర్ల పాలు, ఒక పూట కూరగాయల భోజనం అందజేయనున్నారు. అరుుతే.. ఈ పథకం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఒక్కో అంగన్‌వాడీ సెంటర్‌లో 20కి తక్కువ కాకుండా లబ్ధిదారులు ఉంటారు. జీఓ 12 ప్రకారం ప్రతి రోజు లబ్ధిదారులకు అన్నం, కూరలు వండడంతోపాటు పాలు వేడి చేసి అందించాలి. గుడ్లను ఉడక బెట్టి అంగన్‌వాడీ కేంద్రాల వద్దే వారికి వడ్డించాలి. ఈ నేపథ్యంలో ఇందుకు కావాల్సిన వంట సామగ్రి తప్పనిసరి. జిల్లాలో అమృతహస్తం అమలవుతున్న ప్రాజెక్టులను మినహాయిస్తే మిగతా అన్ని ప్రాజెక్టులకు వంట సామగ్రి, బియ్యం సరుకులను అందజేయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక శాతం కేంద్రాలకు గ్యాస్ సిలిండర్ నుంచి తినే కంచాల వరకు సమకూర్చాలి. ఇవన్నీ జరగలాంటే ముందుగా ఏ సెంటర్లో పాత్రలు ఉన్నాయి... గ్యాస్ ఎక్కడ లేదు... ఏ సెంటర్లో ఏ సామగ్రి అవసరమో గుర్తించాలి. ఆ దిశగా నమోదుకు తీసుకోవాల్సిన చర్యలు శూన్యం. అదేవిధంగా జిల్లాలో కొన్ని సెంటర్లలో వర్కర్లు, హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ సెంటర్ల పరిధిలోప్రస్తుతం పక్క సెంటర్ల అంగన్‌వాడీ వర్కర్లను ఇన్‌చార్ట్‌లుగా నియమించి నడిపిస్తున్నారు.
ఇప్పుడు అందరికీ వంట వండడం వీలు కాదని వర్కర్లే స్వయంగా చెబుతున్నారు. సామర్థ్యానికి మించిన పనులతో ఇప్పటికే సతమతమవుతున్న తమకు ‘వన్‌డే మీల్స్’ మరింత భారంగా మారనుందని వాపోతున్నారు. ఈ పథకం సక్రమంగా అమలు కావాలంటే వసతులు కల్పిండమే కాకుడా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను తప్పనిసరిగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అద్దె భవనాల్లో ఉంటున్న సెంటర్లలో ఇప్పటికీ నీటి వసతి, కూర్చునే వసతులు లేవు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారో వేచి చూడాల్సిందే.
అంగన్‌వాడీ కేంద్రాల్లో గణాంకాలు
1-3సం. పిల్లలు 87,682
3-6 సం. పిల్లలు 88,299
గర్భిణులు 30,914
బాలింతలు 33,445