
పాలకొండ రూరల్: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసీడీఎస్ పీఓ గీత సూచించారు. స్థానిక కస్పా, కోమటి, కొత్త వీధుల్లోని అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు మండల పరిధిలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం సందర్శించిన ఆమె అక్కడి లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ప్రీ–స్కూల్ విద్యార్థులకు చేస్తున్న విద్యాబోధనపై ఆరాతీశారు. కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం ఇవ్వాలని, చిన్నారుల బరువు, ఎత్తు సరిచూడాలన్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మేరి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment