► ఐసీడీఎస్‌లో సూపర్‌వైజర్ల కొరత
► అంగన్‌వాడీ కేంద్రాల ప్రగతిపై ప్రభావం
► జిల్లాలో 61 పోస్టులు ఖాళీ
మందమర్రి రూరల్ : గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ.. పిల్లలకు ఆటపాటలు నేర్పిస్తూ వారిలో ృసజనాత్మక శక్తిని పెంపొందించి క్రమశిక్షణ కలిగిన వారిగా తీర్చిదిద్దేందుకు పునాది వేసే అంగన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా ఆయూ కేంద్రాల ప్రగతి కుంటుపడుతోంది. జిల్లాలోని 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,558 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,558 మంది కార్యకర్తలు, ఆయాలు పని చేస్తున్నారు. కేంద్రాల పర్యవేక్షణకు సరిపడా సూపర్‌వైజర్లు లేరు. జిల్లాకు గ్రేడ్-1 సూపర్‌వైజర్ పోస్టులు 84 మంజూరు ఉండగా.. 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్-2 పోస్టులు 81 మంజూరు ఉండగా.. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 61 పోస్టులు ఖాళీలున్నాయి.
నిబంధనల ప్రకారం ఒక్కో సూపర్‌వైజర్‌కు పర్యవేక్షణ కోసం 20 అంగన్‌వాడీ కేంద్రాలు కేటాయించాల్సి ఉండగా.. కొన్ని మండలాల్లో ఒక్కొక్కరికి 20 నుంచి 70 కేంద్రాలను కేటాయించారు. వీరు రోజుకో అంగన్‌వాడీ కేంద్రం చొప్పున తనిఖీ చేసి వాటి ప్రగతిని పరిశీలించాల్సి ఉంటుంది. జిల్లాలో తగినంత మంది సూపర్‌వైజర్లు లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. తనిఖీలు సక్రమంగా జరగకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల లక్ష్యం నెరవేరడం లేదు. 30 కేంద్రాలను ఒకే సూపర్‌వైజరు తనిఖీ చేయడం వారికి తలకు మించిన భారంగా మారింది. 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల, అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణుల నమోదు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికలు తయూరు చేయూలి. అంతే కాకుండా ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి వివరాలను కూడా సేకరించాలి.
ఎంతమంది గర్భిణులకు సంపూర్ణ భోజనం అందుతుంది, అందుకు సంబంధించిన సరుకుల వివరాలు, ఖర్చులు, మిగులు వంటి అంశాలను క్రోడికరించి ప్రగతి నివేదికలు ప్రతినెలా జిల్లా ఉన్నతాధికారులకు పంపించాలి. 30 కేంద్రాల నివేదికలు తయూరు చేయడం సూపర్‌వైజర్లకు భారంగా మారుతోంది. దీంతో కొన్ని మండలాల్లో సీనియర్ అంగన్‌వాడీ కార్యకర్తల సహకారం తీసుకుని నివేదికలు తయారు చేయూల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
స్థానికంగా ఉండని సూపర్‌వైజర్లు
చాలామంది సూపర్‌వైజర్లు వారికి కేటాయించిన మండలంలో ఉండడం లేదు. దీంతో పర్యవేక్షణ కష్టసాధ్యమవుతోంది. సూపర్‌వైజర్ల పోస్టులు జోనల్‌కు సంబంధించినవి కావడంతో ఒక్క జిల్లా వారికి మరో జిల్లాలో పోస్టింగులు ఇచ్చారు. దీంతో వారు ఇక్కడికి రాలేక దూర ప్రాంతాల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. వారి రాకపోకలకే సమయం సరిపోతోంది. అంగన్‌వాడీలను ప్రటిష్టం చేసేందుకు ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అనేక మార్పులు తీసుకువస్తోంది.
దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేసి పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ బడులకు వెళ్లకుండా నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంస్కరణలో భాగంగా సూపర్‌వైజర్ల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కేవలం 10 నుంచి 15 సెంటర్లు మాత్రమే కే టాయిస్తే పర్యవేక్షణ సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్‌వైజర్ల నియామకం జిల్లా పరిధిలోనే జరగాలని, ఇక్కడి అర్హులైన అంగన్‌వాడీ కార్యకర్తలకే పరీక్షలు లేకుండా పదోన్నతి కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వమే నియమించాలి
జిల్లాలో సూపర్‌వైజర్ల సంఖ్య తక్కువగా ఉన్న మాట నిజమే. ఈ పోస్టులను ప్రభుత్వమే భర్తీ చేయాలి. ప్రస్తుతం జిల్లాలో 61 గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ అంగన్‌వాడీలపై పర్యవేక్షణ లోపం లేకుండా ప్రయత్నం చేస్తున్నాం - ఎ.వెంకటేశ్వరమ్మ, పీడీ, ఐసీడీఏస్, ఆదిలాబాద్
పర్యవేక్షణ ఖాళీ
Published Thu, Mar 24 2016 2:56 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement