అన్నం సయించడం లేదా? | Story About Food | Sakshi
Sakshi News home page

అన్నం సయించడం లేదా?

Published Fri, Jan 15 2021 8:00 AM | Last Updated on Fri, Jan 15 2021 8:00 AM

Story About Food - Sakshi

అన్నం సయించడం లేదనీ, ఏమీ తినాలనిపించడం లేదనీ చాలామంది సరిగా భోజనం చేయరు. తినాలి కాబట్టి ఏదో తక్కువగా తినేసి ఊరుకుంటారు. మధ్యవయసు దాటాక వయసు పెరుగుతున్న కొద్దీ ఇలా అనిపించడం చాలామందిలో కనిపిస్తుంటుంది. ఇలాంటివారు తినేదేదో చాలా తక్కువగా తిన్నా అది మంచిపౌష్టికాహారం (అని పోషకాలు ఉండే బ్యాలెన్స్‌డ్‌ డైట్‌) అయి ఉంటే చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం అంటే అందులో ధాన్యాలు, పళ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు, వూంసం, పప్పుధాన్యాలు... ఇవన్నీ ఉండాలి. ఇవి దేహానికి ఎంతెంత అవసరమో అందేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఓ వ్యక్తికి  ఎన్ని క్యాలరీల ఆహారం అవసరం అన్నది... వారి వయస్సు, వారు పురుషుడా/వుహిళా, వాళ్ల బరువు, వాళ్లు రోజువారీ నిర్వహించే కార్యకలాపాలు అంటే పనులు... మెుదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.  అన్నం సయించడం లేదంటూ పెద్దగా తినలేని వారు... తాము తినే కొద్దిపాటి ఆహారంలోనే వీలైనన్ని రకరకాల పదార్థాలు తినేందుకు ప్రయత్నించాలి. ఇలా  అనేక రకాలు తీసుకునే సమయంలో ఇవి కొద్దిగా, అవి కొద్దిగా అంటూ చాలా రకాలు తినే అవకాశం ఉంటుంది, దాంతో వారికి అవసరమైన మోతాదులో ఆహారం అందేందుకు అవకాశముంటుంది. 

అన్నం సయించనివారు ఈ కింది డైట్‌ ప్లాన్‌ అవలంబిస్తే మంచిది. వారు రోజూ తమ ఆహారంలో చపాతి లేదా అన్నంతో పాటు పప్పులు, శెనగలు, రాజ్మా వంటివి తీసుకోవడం మంచిది. దాంతో వారికి అందాల్సిన కార్బోహైడ్రేల్లు, ప్రోటీన్లు సమకూరుతాయి. భోజనం చివర్లో ఓ కప్పు పెరుగుతో పెరుగన్నం తీసుకోండి. భోజనానికి ముందు కూరగాయలను సలాడ్స్‌గా తీసుకోవాలి. ప్రతిరోజూ పడుకోబోయే వుుందు ఓ కప్పు పాలు తాగితే ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాల్షియమ్‌ సమకూరుతాయి. తినే పరివూణం తక్కువైనా, అందులోనే ఆ సీజన్‌లో దొరికేవీ సాధ్యమైనన్ని వెరైటీలు తీసుకోవాలి. అప్పుడప్పుడూ తృణధాన్యాలతో తయారైన చిరుతిండ్లు తినాలి. ఇవి చిరుతిండిలా తీసుకునేవి కాబట్టి అన్నంలా అవి తినబుద్ధికాకపోవడం ఉండదు. ఇలా ఇన్నిరకాల వెరైటీలు తీసుకోవడం వల్ల దేహానికి అవసరమైన పిండిపదార్థాలూ (కార్బోహైడ్రేట్లు), ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాలూ, మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లు... అన్నీ అందేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకుంటూ ఉన్నప్పుడు మనం రోజూ అన్నం సయించడం లేదంటూ ఎక్కువ పరివూణంలో భోజనం తీసుకోకపోవడం / తీసుకోలేకపోవడం గురించి పెద్దగా బెంగ పడాల్సిన అవసరమే ఉండదు. అన్నం సయించనందువల్ల తక్కువగానే తింటున్నా దేహానికి అవసరమైన పోషకాలన్నీ అందుతున్నందున ఆరోగ్యం గురించి ఆందోళనపడాల్సిన అవసరమూ ఉండదు. 
-అబ్బు అనూష, న్యూట్రిషనిస్ట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement