చెరువులో పడేసి.. కాలితో తొక్కేసి.. | mother killed her two children on nutrition froblom | Sakshi
Sakshi News home page

చెరువులో పడేసి.. కాలితో తొక్కేసి..

Aug 25 2016 3:10 AM | Updated on Sep 17 2018 8:02 PM

చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు - Sakshi

చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

ఇద్దరుపిల్లల పోషణను భారంగా భావించిన ఓ తల్లి వారిని చెరువులో విసిరేసి ప్రాణం తీసింది. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

దౌల్తాబాద్: ఇద్దరుపిల్లల పోషణను భారంగా భావించిన ఓ తల్లి వారిని చెరువులో విసిరేసి  ప్రాణం తీసింది. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దౌల్తాబాద్ మండలం బాలంపేటకు చెందిన హన్మమ్మ, కర్ణాటకలోని కదలాపురం గ్రామవాసి భీంషప్ప భార్యాభర్తలు. వీరికి  కూతురు శిరీష(11), కుమారుడు భీంషప్ప(9) ఉన్నారు. నాలుగేళ్లుగా భర్త మతిస్థిమితం కోల్పోయి భార్యాపిల్లలను పట్టించుకోవడం లేదు. హన్మమ్మ బాలంపేటలో కూలీనాలి  చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇద్దరు పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. బతుకు భారం కావడంతో బుధవారం సాయంత్రం పిల్లల ను చెరువు వద్దకు తీసుకెళ్లి వారి నడుముకు కొంగుచుట్టి చెరువులో పడేసింది. పిల్లల అరుపులకు చుట్టుపక్కలవారు వచ్చేసరికి వారిని కాలితో తొక్కి చంపింది. తాను కూడా చెరువులో దూకడానికి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement