చలితిండి | Winter Nutrition | Sakshi
Sakshi News home page

చలితిండి

Oct 26 2016 10:32 PM | Updated on Sep 4 2017 6:23 PM

చలితిండి

చలితిండి

మనం తీసుకునే ఆహారం ఆ సీజన్‌కు సరైనదేనా అని ఆలోచించి....

 వింటర్ న్యూట్రిషన్


మనం తీసుకునే ఆహారం ఆ సీజన్‌కు సరైనదేనా అని ఆలోచించి, తగిన న్యూట్రిషన్ తీసుకుంటే ఎంతో ప్రయోజనం. చలికాలంలో మన ఆహారాన్ని ఈ కిందివిధంగా ఉండేలా చూసుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది.  ఉదయం టిఫిన్ ఇలా: మీరు రోజూ తీసుకునే రెగ్యులర్ టిఫిన్ స్థానంలో వేడిగా ఉండే ఓట్‌మీల్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోండి. బాగా కూరగాయలు ఎక్కువగా ఉండేలా ఉడికించిన కూరలతో బ్రెడ్ టోస్ట్ కూడా తీసుకోవచ్చు.

 
టిఫిన్ తర్వాత : ఆ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మీకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే దానికి బదులు ఈ వింటర్‌లో జింజర్ టీ తాగడం అన్ని విధాలా మేలు. వీలైతే అందులో ఒకటి రెండు తులసి ఆకులు వేసుకోండి. దీనికి ఒక కారణం ఉంది. ఈ సీజన్‌లో చల్లగా ఉన్నందున మనం నీళ్లు తాగడం తగ్గిస్తాం. దానికి తోడు కాఫీ తాగితే మన శరీరంలో నీటి పాళ్లు మరింతగా తగ్గుతాయి. దానికి బదులు టీ తాగడం బెటర్.

 
మధ్యాన భోజనం: పొట్టుతీయని పిండితో చేసిన చపాతీలతో లేదా ముడిబియ్యంతో వండిన అన్నంతో చాలారకాల కూరగాయలతో చేసిన కూరలతో మధ్యాహ్న భోజనం మంచిది. ఆకుకూరలతో పాటు అనేక రంగుల్లో ఉండే కాయగూరలూ ఎంతో మేలు చేస్తుంది. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే కూరల్లో అల్లం, ఉల్లి, కొత్తిమీర, వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. 

 
చలికాలంలోనూ మేలు నిమ్మకాయ...

చలికాలం కదా అని కొందరు ఈ సీజన్‌లో నిమ్మకాయ వాడరు. మీకు అలర్జీ కలిగించకపోతే మీ లంచ్‌లోని కూరలపై కాస్తంత నిమ్మకాయ పిండండి. ఇది రుచిని పెంచడంతో పాటు మీకు ఈ సీజన్‌లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి అనేక జబ్బులనుంచి కాపాడేలా రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఈ సీజన్‌లో నీళ్లు తాగడం తగ్గిస్తాం. అది డీ-హేడ్రేట్ చేయవచ్చు. కాబట్టి దాహంగా లేకపోయినా నీళ్లు పుష్కలంగా తాగండి.

 
సాయంత్రపు శ్నాక్స్: సాయంత్రం వేళల్లో వేయించిన పల్లీలు, బాదంపప్పు మంచిది. ఇక కొవ్వు లేని పెరుగులో కొన్ని పండ్ల ముక్కలు వేసుకుని తినడం కూడా మేలే. దాంతోపాటు మొలకెత్తిన ధాన్యాలు. ఉడికించిన బఠాణీలు కూడా ఆరోగ్యానికి మేలు.

 
రాత్రి భోజనం : ఈ సీజన్‌లో రాత్రివేళల్లో తినే భోజనం ఎంత వీలైతే అంత సింపులగా ఉండాలి. నూనె వీలైనంత తక్కువగా ఉండాలి. భోజనానికి ముందర గ్రీన్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవడం ఎంతో మేలు. రాత్రి తినే భోజనంలో ఆకుకూరల్లో పాలకూర ఉంటే బెటర్. రాత్రి పూట చపాతీలు తీసుకునేవారు నూనెలేకుండా పుల్కాలు తినాలి. అందులో పుష్కలంగా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలాంటి కూరలు తినడం మేలు. ఈ సీజన్‌లో వండే వంటలు ఆలివ్ నూనెతో గాని, అవిశెనూనెతో గాని వండితే... ఆరోగ్యానికి మరీ మంచిది.

 
పాలతో గుడ్‌నైట్ బెటర్...

డిన్నర్ ముగించాక చివరన నిద్రకు ఉపక్రమించే ముందు వెన్న తీసిన పాలను వేడి చేసి గోరువెచ్చగా తాగడం మంచిది. ఇది క్యాల్షియమ్‌ను ఇస్తుంది. పాలలోని ట్రిప్టొఫాన్ అనే పోషకం రాత్రి బాగా నిద్రపట్టేలా చేస్తుంది. ఈ సీజన్ కాస్త మందకొడిగా ఉంటుంది. మనకు బద్దకంగా అనిపించినా ఈ సీజన్ అంతా వ్యాయామానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ చలికాలాన్ని వృథాపోనివ్వకుండా వెంటనే వ్యాయామం మొదలుపెట్టండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement