వర్షాకాలంలోనూ వదలకుండా.. జంపింగ్ జాక్స్‌! | Sakshi City Plus Story On Seasonal Gym Fitness Workouts | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలోనూ వదలకుండా.. జంపింగ్ జాక్స్‌!

Published Wed, Jul 31 2024 12:44 PM | Last Updated on Wed, Jul 31 2024 12:44 PM

Sakshi City Plus Story On Seasonal Gym Fitness Workouts

సీజనల్‌ వర్కవుట్స్‌పై దృష్టి అవసరం

కురిసే సీజన్‌.. కసరత్తులకు రీ డిజైన్‌..

ఫ్లూ, వైరల్‌ ఫీవర్లు దరిచేరకుండా..

ఇమ్యూనిటీని పెంచేందుకు వ్యాయామం తప్పనిసరి

మాన్‌సూన్‌ వర్కవుట్స్‌ సూచిస్తున్న సిటీ ట్రైనర్స్‌

చెమట పడుతోందని వేసవిలో, ముసురు పట్టిందని వానా కాలంలో, మంచుకురుస్తోందని చలికాలంలోనూ వ్యాయామాన్ని మానకూడదు. ఏ సీజన్‌కు తగ్గట్టు ఆ తరహా వర్కవుట్స్‌ ప్లాన్‌ చేసుకోవచ్చని ఫిట్‌నెస్‌ ట్రైనర్స్, నిపుణులు అంటున్నారు. వ్యాయామాన్ని స్కిప్‌ చేయడం మంచి అలవాటు కాదని, దీని వల్ల సీజనల్‌ వ్యాధుల ప్రభావం తట్టుకునే ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందుకే సీజన్‌కు తగ్గట్టుగా వర్కవుట్‌ని డిజైన్‌ చేసుకోవాలని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో సీజన్‌కు అనుగుణంగా వర్కవుట్‌ డిజైన్‌ అనేది ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతోంది. దీంతో ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌లకు వెసులుబాటుగా ఉండే ట్రెయినర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. – సాక్షి, సిటీబ్యూరో

వర్షాకాలంలో వ్యాయామ ఆసక్తి తగ్గడానికి అధిక తేమ స్థాయిలు, సూర్యకాంతి లేకపోవడం, వాతావరణ పీడనంలో మార్పులు వంటి కారణాలు ఉన్నాయి. వాతావరణ పీడనం పడిపోవడం అనేది మన శరీర ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేసి, అలసట, శక్తి లేకపోవడం వంటి అనుభూతులకు గురిచేస్తాయి. కానీ వర్షాకాలంలో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం మానసిక స్థితిని మెరుగుపరచడంలో మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని అంటున్నారు. దీంతో పలువురు నిపుణులు సింపుల్‌ వర్కవుట్స్‌పై సలహాలు, సూచనలు అందిస్తున్నారు...

సమయానికి తగినట్లు..
స్పాట్‌ జాగింగ్‌ చాలా తక్కువ స్పేస్‌లో కదలకుండా చేసే జాగింగ్‌ ఇది. అవుట్‌డోర్‌లో జాగింగ్‌కి సమానమైన ప్రతిఫలాన్ని అందిస్తోంది. చేతులను స్వింగ్‌ చేయడం వంటి తదితర మార్పు చేర్పుల ద్వారా ఫుల్‌బాడీకి వర్కవుట్‌ ఇవ్వొచ్చు. 
– జంపింగ్‌ జాక్స్, క్లైంబర్స్, హై నీస్, సిజర్‌ చాప్స్‌ వంటివి ఒకే ప్రదేశంలో కదలకుండా చేయవచ్చు. వీటిని మూడు సెట్స్‌గా విభజించుకుని చేయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.
– స్కిప్పింగ్‌ రోజంతా చురుకుగా ఉంచే అద్భుతమైన మాన్‌ సూన్‌ వర్కౌట్‌. రోప్‌ స్కిప్పింగ్‌ లేదా జంపింగ్‌ అధిక సంఖ్యలో కేలరీలను బర్న్‌ చేస్తుంది. ఇది అన్ని సీజన్‌లలోనూ చేయవచ్చు. 
– వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఇండోర్‌ యోగా ఒక గొప్ప మార్గం. వృక్షాసనం వంటి ఆసనాలతో చల్లని వాతావరణంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
– వ్యాయామాల్లో వైవిధ్యం కోసం డంబెల్స్‌ లేదా రెసిస్టెన్స్‌ బ్యాండ్‌ల వంటి కొన్ని ప్రాథమిక వ్యాయామ పరికరాలను ఉపయోగించవచ్చు. 
– సాధారణ నీటికి ప్రత్యామ్నాయంగా హెర్బల్‌ టీలు, కొబ్బరి నీళ్లను ఉపయోగించడం ద్వారా చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని పొందవచ్చు.
– ఆన్‌లైన్‌లో లేదా ఫిట్‌నెస్‌ యాప్‌ల ద్వారా అందుబాటులో ఉన్న ఫిట్‌నెస్‌ ఇచ్చే డ్యాన్స్‌ వీడియోలను అనుసరించాలి. 
– ఇండోర్‌ స్విమ్మింగ్‌ పూల్‌ అందుబాటులో ఉంటే స్విమ్మింగ్‌ ల్యాప్‌లు లేదా ఆక్వా ఏరోబిక్స్‌ క్లాస్‌లలో పాల్గొనాలి.
– వర్షాకాలంలో బద్ధకాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ శారీరక శ్రమతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వీలైనంత వరకూ సూర్యరశ్మి శరీరానికి సోకేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

మార్పు చేర్పులు అవసరం..
ఎండలు ఉన్నాయని 
కొందరు వానలు ఉన్నాయని కొందరు వర్కవుట్‌కి బద్ధకిస్తుంటారు. కొందరు మాత్రం సీజన్‌లతో సంబంధం లేకుండా జిమ్స్‌కు వస్తుంటారు. కనీసం వారానికి 3 నుంచి 4 సార్లు చేసేవారిని సిన్సియర్‌ అని చెప్పొచ్చు. అదే కరెక్ట్‌ విధానం కూడా. ఈ సీజన్‌లో తెల్లవారుఝామున బాగా ముసురుపట్టి ఉన్నప్పుడు ఉదయం లేచిన వెంటనే ఎక్సర్‌సైజ్‌ చేయాలనే మూడ్‌ రాదు. కాబట్టి లేవగానే ఇంట్లోనే కొన్ని స్ట్రెచి్చంగ్‌ వర్కవుట్స్‌ చేశాక జిమ్‌కి రావచ్చు. వాకింగ్, జాగింగ్, యోగా వంటివి అవుట్‌డోర్‌లో చేసే అలవాటు వల్ల వానాకాలంలో రెగ్యులారిటీ మిస్‌ అవుతుంది. కాబట్టి ఇన్‌డోర్‌ వర్కవుట్స్‌ ఎంచుకోవడం మంచిది.  

వర్షాకాలం వర్కవుట్స్‌..
ఈ వాతావరణం హెవీ వెయిట్‌/ రిపిటీషన్స్‌ చేయడానికి సపోర్ట్‌ చేస్తుంది. సో, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌కి ఎక్కువ టైమ్‌ కేటాయించాలి. వైరల్‌ ఫీవర్స్‌ ఫ్లూ వచ్చేది ఈ సీజన్‌లోనే కాబట్టి, ఇమ్యూనిటీని బూస్ట్‌ చేసే ప్రత్యేకమైన వర్కవుట్స్‌ చేయించాలి. ఈ వాతావరణంలో మజిల్స్‌ బద్ధకిస్తాయి. కాబట్టి వర్కవుట్‌కి ముందు వార్మ్‌ అప్‌కి కేటాయించే సమయాన్ని కొంత పెంచి చేయిస్తాం. వారానికి 3 నుంచి 4 గంటల పాటు రోజూ 45 నిమిషాలు వ్యాయామం ఈ సీజన్‌లో చాలా ఉపయుక్తం.


– ఎం.వెంకట్, సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లైఫ్‌స్టైల్‌ కోచ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement