Jim Work outs
-
వర్షాకాలంలోనూ వదలకుండా.. జంపింగ్ జాక్స్!
చెమట పడుతోందని వేసవిలో, ముసురు పట్టిందని వానా కాలంలో, మంచుకురుస్తోందని చలికాలంలోనూ వ్యాయామాన్ని మానకూడదు. ఏ సీజన్‌కు తగ్గట్టు ఆ తరహా వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవచ్చని ఫిట్నెస్ ట్రైనర్స్, నిపుణులు అంటున్నారు. వ్యాయామాన్ని స్కిప్ చేయడం మంచి అలవాటు కాదని, దీని వల్ల సీజనల్ వ్యాధుల ప్రభావం తట్టుకునే ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందుకే సీజన్‌కు తగ్గట్టుగా వర్కవుట్‌ని డిజైన్ చేసుకోవాలని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో సీజన్‌కు అనుగుణంగా వర్కవుట్ డిజైన్ అనేది ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతోంది. దీంతో ఫిట్నెస్ ఫ్రీక్లకు వెసులుబాటుగా ఉండే ట్రెయినర్లకు డిమాండ్ పెరుగుతోంది. – సాక్షి, సిటీబ్యూరోవర్షాకాలంలో వ్యాయామ ఆసక్తి తగ్గడానికి అధిక తేమ స్థాయిలు, సూర్యకాంతి లేకపోవడం, వాతావరణ పీడనంలో మార్పులు వంటి కారణాలు ఉన్నాయి. వాతావరణ పీడనం పడిపోవడం అనేది మన శరీర ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేసి, అలసట, శక్తి లేకపోవడం వంటి అనుభూతులకు గురిచేస్తాయి. కానీ వర్షాకాలంలో ఫిట్నెస్ను కాపాడుకోవడం మానసిక స్థితిని మెరుగుపరచడంలో మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని అంటున్నారు. దీంతో పలువురు నిపుణులు సింపుల్ వర్కవుట్స్‌పై సలహాలు, సూచనలు అందిస్తున్నారు...సమయానికి తగినట్లు..– స్పాట్ జాగింగ్ చాలా తక్కువ స్పేస్‌లో కదలకుండా చేసే జాగింగ్ ఇది. అవుట్‌డోర్‌లో జాగింగ్‌కి సమానమైన ప్రతిఫలాన్ని అందిస్తోంది. చేతులను స్వింగ్ చేయడం వంటి తదితర మార్పు చేర్పుల ద్వారా ఫుల్బాడీకి వర్కవుట్ ఇవ్వొచ్చు. – జంపింగ్ జాక్స్, క్లైంబర్స్, హై నీస్, సిజర్ చాప్స్ వంటివి ఒకే ప్రదేశంలో కదలకుండా చేయవచ్చు. వీటిని మూడు సెట్స్‌గా విభజించుకుని చేయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.– స్కిప్పింగ్ రోజంతా చురుకుగా ఉంచే అద్భుతమైన మాన్ సూన్ వర్కౌట్. రోప్ స్కిప్పింగ్ లేదా జంపింగ్ అధిక సంఖ్యలో కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది అన్ని సీజన్లలోనూ చేయవచ్చు. – వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఇండోర్ యోగా ఒక గొప్ప మార్గం. వృక్షాసనం వంటి ఆసనాలతో చల్లని వాతావరణంలో ప్రయోజనకరంగా ఉంటుంది.– వ్యాయామాల్లో వైవిధ్యం కోసం డంబెల్స్ లేదా రెసిస్టెన్స్ బ్యాండ్ల వంటి కొన్ని ప్రాథమిక వ్యాయామ పరికరాలను ఉపయోగించవచ్చు. – సాధారణ నీటికి ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీలు, కొబ్బరి నీళ్లను ఉపయోగించడం ద్వారా చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని పొందవచ్చు.– ఆన్లైన్లో లేదా ఫిట్నెస్ యాప్‌ల ద్వారా అందుబాటులో ఉన్న ఫిట్నెస్ ఇచ్చే డ్యాన్స్ వీడియోలను అనుసరించాలి. – ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంటే స్విమ్మింగ్ ల్యాప్‌లు లేదా ఆక్వా ఏరోబిక్స్ క్లాస్‌లలో పాల్గొనాలి.– వర్షాకాలంలో బద్ధకాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ శారీరక శ్రమతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వీలైనంత వరకూ సూర్యరశ్మి శరీరానికి సోకేలా చూసుకోవడం చాలా ముఖ్యం.మార్పు చేర్పులు అవసరం..ఎండలు ఉన్నాయని కొందరు వానలు ఉన్నాయని కొందరు వర్కవుట్‌కి బద్ధకిస్తుంటారు. కొందరు మాత్రం సీజన్లతో సంబంధం లేకుండా జిమ్స్‌కు వస్తుంటారు. కనీసం వారానికి 3 నుంచి 4 సార్లు చేసేవారిని సిన్సియర్ అని చెప్పొచ్చు. అదే కరెక్ట్ విధానం కూడా. ఈ సీజన్లో తెల్లవారుఝామున బాగా ముసురుపట్టి ఉన్నప్పుడు ఉదయం లేచిన వెంటనే ఎక్సర్సైజ్ చేయాలనే మూడ్ రాదు. కాబట్టి లేవగానే ఇంట్లోనే కొన్ని స్ట్రెచి్చంగ్ వర్కవుట్స్ చేశాక జిమ్‌కి రావచ్చు. వాకింగ్, జాగింగ్, యోగా వంటివి అవుట్‌డోర్‌లో చేసే అలవాటు వల్ల వానాకాలంలో రెగ్యులారిటీ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్డోర్ వర్కవుట్స్ ఎంచుకోవడం మంచిది. వర్షాకాలం వర్కవుట్స్..ఈ వాతావరణం హెవీ వెయిట్/ రిపిటీషన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌కి ఎక్కువ టైమ్ కేటాయించాలి. వైరల్ ఫీవర్స్ ఫ్లూ వచ్చేది ఈ సీజన్లోనే కాబట్టి, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ప్రత్యేకమైన వర్కవుట్స్ చేయించాలి. ఈ వాతావరణంలో మజిల్స్ బద్ధకిస్తాయి. కాబట్టి వర్కవుట్‌కి ముందు వార్మ్ అప్‌కి కేటాయించే సమయాన్ని కొంత పెంచి చేయిస్తాం. వారానికి 3 నుంచి 4 గంటల పాటు రోజూ 45 నిమిషాలు వ్యాయామం ఈ సీజన్లో చాలా ఉపయుక్తం.– ఎం.వెంకట్, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ లైఫ్‌స్టైల్ కోచ్ -
అలియా 'ఫి'భట్
‘జిమ్’దగీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుర్రకారు కలల రాణి అలియా భట్. అందమైన చిరునవ్వుతో కట్టి పడేస్తూ అటు కుర్ర హీరోలతో మాత్రమే కాకుండా ఇటు సీనియర్ హీరోలకూ జంటగా మెప్పించేస్తోంది. చూడ చక్కని నాజూకు రూపంతో మెరిసిపోయే అలియా భట్ ఒకప్పుడు చాలా బొద్దుగా ఉండేది. అంతేకాదు ఫ్యాటీ లుక్ కారణంగా తొలి సినిమా ఛాన్స్ చేజారేంత పరిస్థితి కూడా వచ్చింది. మరి అలాంటి అలియా... తన ఫిట్నెస్ను సినిమా స్క్రీన్ మీద కాంతులీనేలా చేసుకుంది ఎలా అంటే... 3నెలల్లో 18కిలోలు లాస్... అలియా తొలి మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ రూపొందించిన ఆ సినిమా అవకాశం ఆమెకు వచ్చే సమయానికి ఆమె వయసు 17ఏళ్లు. ఎత్తు 5.2 అడుగులు. బరువు దాదాపు 70కిలోలు. ఒకనాటి విఖ్యాత డైరెక్టర్ మహేష్‌భట్ కూతురైనా, పూజాభట్ లాంటి నటికి చెల్లెలైనా... సినిమా హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోవాలంటే బరువు తగ్గాల్సిందేనని నిక్కచ్చిగా చెప్పేశాడు కరణ్. దాంతో పంతం పట్టింది అలియా. కేవలం 3 నెలల్లోనే 18కిలోల వరకూ తగ్గింది. సినిమా చాన్స్ దక్కించుకోవడంతో పాటు ఇప్పడు స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇదీ రొటీన్... వెయిట్‌లాస్ అనేది వర్కవుట్ కన్నా డైట్ మీదే అధికంగా ఆధారపడి ఉంటుంది అంటుంది అలియా. అందుకే ఆమె తనకెంతో ఇష్టమైన జంక్ఫుడ్ని టీనేజ్లోనే త్యాగం చేసేసింది. వీలైనన్ని లీటర్ల నీళ్లు, కూరగాయలు, ఫ్రూట్స్ వినియోగిస్తుంది. తక్కువ నూనె ఉపయోగించి రుచికరంగా వంటలు చేయడం అప్పట్లోనే అలవాటు చేసుకున్న అలియా తన తల్లితో కలిసి వంటల్లో ప్రయోగాలు చేస్తుంటుంది. నిద్రపోవడానికి కనీసం 2గంటల ముందే డిన్నర్ పూర్తి చేసేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో పంచదార లేని టీ, చిన్న కప్పుతో పోహా (మరాఠీ వంటకం) లేదా వెజ్ సలాడ్ లేదా ఎగ్ వైట్–శాండ్విచ్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఉదయం 11గంటలకు ఒక గ్లాసుడు వెజిటబుల్ జ్యూస్, ఒక పండు, ఇక లంచ్‌లో నూనె తగలని రోటీ, ఏదైనా ఒక పండు, ఒక్క ఇడ్లీ, సాంబార్‌తో తీసుకుంటుంది. సాయంత్రం పంచదార లేని టీ, లేదా కాఫీ, మిడ్ ఈవెనింగ్‌లో ఫ్రూట్స్, డిన్నర్‌లోకి నూనె లేని రోటీ, గిన్నెడు వెజిటబుల్స్, దాల్, ఒక చికెన్ పీస్. ఇదీ ఆమె రెగ్యులర్ డైట్. వర్కవుట్ ఇలా... వారంలో 3 లేదా 4రోజులు జిమ్ వర్కవుట్స్‌కి కేటాయిస్తుంది అలియా. ఎక్కువగా కార్డియో, వెయిట్ ట్రైనింగ్ చేస్తుంది. వార్మప్ ట్రెడ్ మిల్ మీదే చేయడానికి ఇష్టపడుతుంది. పుషప్స్, డంబెల్ రైజర్స్, లాట్ పుల్ డౌన్స్, ట్రైసప్స్ పుష్ డౌన్ ఇవి ఒక సెట్‌గా ఒకరోజు, క్రంచెస్, బ్యాక్ ఎక్స్టెన్షన్స్, బైస్కిల్ క్రంచెస్, రివర్స్ క్రంచెస్ మరొక రోజు, స్క్వాట్స్, ఫార్వర్డ్ లంజెస్, బ్యాక్వర్డ్ లంజెస్, డంబెల్ లంజెస్ ఇంకో రోజు చేస్తుంది. ఇలా రోజుకో బాడీ పార్ట్‌కి వర్కవుట్ ఇస్తూనే ఒక్కో రోజు రెస్ట్ ఇస్తుంటుంది. - సమన్వయం: సత్యబాబు