IPL 2024- MI: ఇది ఎలా తింటాననుకున్నావు? పాండ్యా ఫైర్‌ | Yeh Khaake Stamina Bigad Jaega: Furious Pandya On Sets Of IPL Ad Shoot Leaked | Sakshi
Sakshi News home page

IPL 2024- MI: అడ్జస్ట్‌ అవ్వాలా?.. ఇది ఎలా తింటాననుకున్నావు? పాండ్యా ఫైర్‌

Published Sat, Feb 24 2024 2:37 PM | Last Updated on Sat, Feb 24 2024 3:52 PM

Yeh Khaake Stamina Bigad Jaega: Furious Pandya On Sets Of IPL Ad Shoot Leaked - Sakshi

పాండ్యాకు కోపమొచ్చింది (PC: Mufaddal Vohra X)

 Hardik Pandya Frustrated Over Unhealthy Food: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ హర్దిక్‌ పాండ్యాకు కోపమొచ్చింది. ఫిట్‌నెస్‌ సాధించడం కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే ఇలాంటి భోజనం పెట్టడం ఏమిటని అతడు ఫైర్‌ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సమయంలో పాండ్యా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో చీలమండ నొప్పి కారణంగా అప్పటి నుంచి అతడు దూరమయ్యాడు. ఫిట్‌గా మారడం కోసం జిమ్‌లో కఠిన వర్కౌట్లు చేస్తూ చెమటోడుస్తున్నాడు.

ఐపీఎల్‌-2024కు సన్నద్ధమయ్యే క్రమంలో ముంబై ఇండియన్స్‌ శిక్షణా శిబిరంలో టీమిండియా యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌తో కలిసి కసరత్తులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు సంబంధించిన ఓ యాడ్‌ షూట్‌లో పాండ్యా పాల్గొన్నాడు.

ఇందులో మధ్యాహ్న భోజన సమయంలో పాండ్యాకు ఢోక్లా, జిలేబీ వంటి గుజరాతీ సంప్రదాయ వంటకాలు వడ్డించారు. దీంతో చిర్రెత్తిపోయిన ఈ ఆల్‌రౌండర్‌ సిబ్బందిపై మండిపడ్డాడు. ‘‘అసలు ఏంటిది? నేను ఢోక్లా, జిలేబి ఎలా తినగలను?

భయ్యా.. నేను ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం ముఖ్యం! ఇలాంటివి ఎలా తింటాననుకున్నావు? ఈ ఆహార పదార్థాలను ఎవరు పంపించారు?’’ అని హార్దిక్‌ పాండ్యా భోజనం వడ్డించిన వ్యక్తిని ప్రశ్నించాడు.

ఇందుకు అతడు.. ‘‘ఈ ఒక్కరోజుకు సర్దుకోండి సర్‌’’ అని  బదులిచ్చాడు.దీంతో పాండ్యా కోపం నషాళానికి అంటింది. ‘‘భయ్యా.. అడ్జస్ట్‌ చేసుకోవడం అస్సలు కుదరదు. నా చెఫ్‌, న్యూట్రిషనిస్ట్‌ ఎక్కడ? ఇలాంటివి నేను తినలేను. ఇదంతా వర్కౌట్‌ కాదని డైరెక్టర్‌కు చెప్పండి’’ అని పాండ్యా అతడితో అన్నాడు.

ఇందుకు స్పందిస్తూ.. ‘‘సర్‌.. ప్లీజ్‌ ఏదో ఒకటి తినండి. లేదంటే మీ స్టామినా తగ్గిపోతుంది’’ అని పాండ్యాతో పేర్కొన్నాడు. ప్రతిస్పందనగా.. ‘‘భయ్యా.. నేను ఈ ఫుడ్‌ తిన్నానంటే నాకు శక్తి రావడం కాదు.. ఉన్నది కూడా పోతుంది’’ అని పాండ్యా బదులిచ్చాడు.

ఇక వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇదంతా యాడ్‌ షూట్‌లో భాగమేనని.. బహుశా ఫిట్‌నెస్‌ ప్రాధాన్యాన్ని వివరించే క్రమంలో ఇలా చిత్రించి ఉంటారని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరేమో.. ఇదంతా ప్రచారం కోసమేనని.. అందుకే ఇలాంటి వీడియోలు లీక్‌ చేస్తారని పాండ్యా తీరును విమర్శిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement