మనుషులు ఎంత ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా వయసును దాచడం సాద్యం కాదు. వయసు రీత్యా వచ్చే మార్పులను కూడా ఆపలేం. కానీ ఇక్కడొక వ్యక్తి తాతా వయసులో ముప్పై ఏళ్ల కుర్రాడిలా అదిరిపోయే ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అతడి ఆరోగ్య రహస్యం వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో ఇలా ఫాలో అయ్యేవాళ్లు ఉన్నారా..? అనుకుంటారు.
వివరాల్లోకివెళ్తే..యూఎస్‌లోని మిచిగాన్‌కు చెందిన 61 ఏళ్ల డేవ్ పాస్కో 38 ఏళ్ల కుర్రాడి మాదిరిగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆరోగ్య, దీర్ఘాయువు కోసం కఠిన జీవన శైలిని అనుసరించేవాడు దేవ్ . తనని తాను బయోహ్యాకర్‌గా అభివర్ణించుకుంటాడు. ఆహారం, వ్యాయామం పట్ల కనబర్చిన శ్రద్దే జీవసంబందమైన వయస్సును 38 ఏళ్లకు మార్చిందని దేవ్ చెబుతున్నారు. అంతేగాదు తన రోజువారి దినచర్య గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
తాను సూర్యోదయానికి ముందే లేచి ఆరుబయట గడపటం, వ్యాయమాలు చేయడం వంటివి చేస్తానని తెలిపారు. అలాగే నిర్థిష్ట ఆహార నియమాలను పాటిస్తానని, ప్రతిరోజూ దాదాపు 158 సప్లిమెంట్లను తీసుకుంటానని అన్నారు. తన లక్ష్యం కేవలం తన వయసు తక్కువగా చూపించేలా ఉండటం, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటమేనని తెలిపారు. అంతేగాదు తనకు 90 లేదా 110 ఏళ్లు వచ్చినా.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా జీవించాలన్నదే తన లక్ష్యం అని చెబుతున్నారు దేవ్. ఎన్నీ అర్జెంట్ పనులు, అవాంతరాలు వచ్చినా.. తన రోజువారి దినచర్య పూర్తి అయ్యిన తర్వాతే ఏదైనా చేస్తానని తేల్చి చెప్పారు.
తన విలువై సమయాన్ని ఇతరులతో గడిపేందుకు ఇవ్వనని, ఒంటిరిగానే ఉంటానని అంటున్నారు. అయితే ఇలా ఒంటరిగా ఉన్నప్పుడూ తనతో తాను కనెక్ట్ అయ్యేలా చేసుకుంటాడట దేవ్. మిగతా సమయం అంతా వ్యాయామాలు, ఆవిరి సెషన్‌లతో గడిచిపోతుందట. అలాగే అతడు చాలా అరుదుగా భోజనం చేస్తాడట. అంతేగాదు సేంద్రియ గడ్డి తినే గొడ్డు మాంసం, ఫ్రీ రేంజ్ చికెన్ లేదా చేపలు డిన్నర్‌లో తీసుకుంటాడట. ముఖ్యంగా ఎక్కువ కూరగాయలు, వెల్లుల్లి, తప్పకుండా ఉండేలా చూసుకుంటాడట.
అయితే ఇక్కడ దేవ్ బరువు పెరగకపోవడానికి కారణం.. కార్బోహైడ్రేట్లను పరిమితం చేయడమేనని చెబుతున్నాడు. ఇక్కడ దేవ్ బయోహ్యాకింగ్ పద్ధతుల్లో సక్రమైన జీవనశైలితో వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసి కుర్రాడిలా ఫిట్‌నెస్‌గా మారాడు. ఇటీవలకాలంలో ఈ బయోహ్యాకింగ్ ఉద్యమం ఒక ట్రెండ్‌గా మారింది. అంటే ఆరోగ్యంగా ఉండేలా వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు వివిద పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తున్నారు. నిపుణులు మాత్రం దీనికి శాస్త్రీయ ధృవీకరణ లేదని, పైగా ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పలేమని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment