దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ చూడటానికి బాలీవుడ్ హీరోల మాదిరిగా స్లైలిష్‌గా ఉంటాడు. బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వెళ్లితే సిక్సర్‌లతో చెలరేగిపోతాడు. చూసేందుకు గాంభీర్యంగా, కూల్‌గా కనిపిస్తున్నా..క్రికెట్‌కి సంబంధించి ఎలాంటి ఒత్తిడిని భావోద్వేగ రూపంలో వ్యక్తం చేయకుండా జాగ్రత్త పడతాడు. ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కి లుకింగ్ స్టైల్‌ని మార్చేస్తుంటాడు. అలాంటి ఈ యంగ్ క్రికెటర్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి? ఎలాంటి డైట్ ఫాలో అవుతాడు వంటి వాటి గురించి తెలసుకోవాలని ఆరాట పడుతుంటారు అభిమానులు. ఇంతకీ అతడి ఫిట్‌నెస్, ఆహార నియమాలు ఎలా ఉంటాయంటే..
35 ఏళ్ల క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రమశిక్షణతో కూడిన డైట్‌ని, ఫిట్‌నెస్‌ని అనుసరిస్తాడు. అంతేగాదు ఐపీఎల్ వంటి సీజన్లలో కేవలం బేక్ చేసిన చికెన్, ఆవిరి మీద ఉడికించిన కూరగాయ ముక్కలతో ఫిట్‌నెస్ కాపాడుకున్నాడు. ఆహారం వద్ద చాలా స్ట్రిక్ట్ డైట్‌ని ఫాలో అవుతాడని అతడని జిమ్ కోచ్ తెలిపారు. కోహ్లీ ఆహారంలో రుచి కన్నా పోషకాలకే ప్రాధాన్యత ఇస్తాడు. అంతేగాదు అతడు తన శరీరానికి అవసరమయ్యే పోషకాల అవసరాన్ని అనుసరించే తీసుకుంటాడు.
ప్రయాణ సమయంలో ఉండేవి ఇవే..
విమాన ప్రయాణలో కోహ్లీ వెంట బ్యాగులో కాఫీసెట్, ప్రోటీన్ బార్, కొన్ని నెట్స్, తదితరాలు ఉంటాయి. వాటిని సమయాన్ని కేటాయించుకుని మరీ తింటాడు. చెప్పాలంటే..అరగంటకోసారి తింటాడట.
కోహ్లీ డైట్ సీక్రెట్..
కోహ్లీ అనుసరించే డైట్, ఫిట్‌స్ సూత్రాలు మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని హెల్తీగా, ఫిట్‌గా ఉండొచ్చు. అవేంటంటే..
స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు, బలం, ఫ్లెక్సిబిలిటీని పెంచే హై ఇంటెన్సీటీ వ్యాయామాలువిరాట్ కోహ్లీ చేస్తాడు.
సంవత్సరం మొత్తం క్రమం తప్పకుండా ట్రైనింగ్ షెడ్యూల్ను కోహ్లీ పాటిస్తాడు. స్కిప్ చేయకుండా స్ట్రిట్‌గా డైట్ ఫాలో అవ్వడమే అతడి ఫిట్‌నస్ సీక్రెట్.
క్రమశిక్షణే అతని ఫిట్‌నెస్‌కు మూల కారణం. విరామం సమయంలో కూడా వర్కవుట్ చేయడం వదిలిపెట్టడు.
అతని వర్కౌట్ ట్రైనింగ్, క్రికెట్ మ్యాచ్‌లకు తగ్గట్లుగా ప్లాన్ ఉంటుంది. కావాల్సిన శక్తి అందేలా, దానికి తగ్గట్లుగా ఆహార నియమావళి పకడ్బంది వ్యూహంతో వ్యక్తిగత నిపుణలు సెట్ చేస్తారు.
ఎక్కువ ఆహారం తీసుకోవడం కాకుండా పోషకాలపై దృష్టిపెడతాడు కోహ్లీ. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ ఉన్న ఆహారాలను తీసుకుంటాడు.
ఎప్పుడూ శరీరం హైడ్రెటెడ్‌గా ఉండేలా చూసుకుంటాడు. అలాగే తన ఆటకు కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాడు.
(చదవండి: గ్రీన్ టమాటాల గురించి విన్నారా? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..!)
Comments
Please login to add a commentAdd a comment