Horned Orb Spider: ఈ కొమ్ముల సాలీడు చాలా సాధుజీవి తెలుసా? | Horned Orb Spider Do You Know These Interesting Facts | Sakshi
Sakshi News home page

Horned Orb Spider: ఈ కొమ్ముల సాలీడు చాలా సాధుజీవి తెలుసా?

Published Tue, Oct 11 2022 6:15 PM | Last Updated on Tue, Oct 11 2022 6:28 PM

Horned Orb Spider Do You Know These Interesting Facts - Sakshi

ఈ సాలీడు అంతలేసి కొమ్ములతో భయపెట్టేలా కనిపిస్తుంది గాని, ఇది నిజానికి చాలా సాధుజీవి. కొమ్ములు ఉండటం వల్ల దీనిని ‘హార్న్‌డ్‌ ఆర్బ్‌ స్పైడర్‌’ అని పిలుచుకుంటారు. దీనినే ‘విష్‌బోన్‌ స్పైడర్‌’ అని కూడా అంటారు. వేలెడంత ఉండే ఈ సాలీడు కొమ్ములు, దాని శరీరానికి మూడురెట్లు పొడవు ఉంటాయి. దీనికి మరో విశేషమూ ఉంది.

దీనికి మూడు వెన్నెముకలు ఉంటాయి. అవి కూడా మామూలుగా వీపు మీద కాకుండా, కడుపు భాగంలో ఉంటాయి. ఈ జాతి సాలీళ్లు పసుపు, ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా చైనా, ఆగ్నేయాసియా అడవుల్లో కనిపిస్తాయి. భారత్‌లోనూ కొన్ని చోట్ల ఇవి అరుదుగా కనిపిస్తాయి.

పక్షులు, బల్లుల దాడుల నుంచి తప్పించుకోవడానికే వీటికి ఆ కొమ్ములు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇవి మనుషులకు ఏమాత్రం హాని చెయ్యవు. మనుషులకు హాని కలిగించే విషపదార్థాలేవీ వీటిలో ఉండవు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement