మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్’. మురుగదాస్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. ఎన్.వి.ప్రసాద్ నిర్మాత. బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు ఈ సందర్భంగా చిత్ర బృందం ‘స్పైడర్’ టీజర్‌ని విడుదల చేసింది. ఎస్‌జే సూర్య ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నారు. 'భయపెట్టడం మాకు తెలుసు' అనే మహేష్, 'పెరుగుతున్న జనాభాను కంట్రోల్ గవర్న్‌మెంట్, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే' అని ఎస్‌జే సూర్య చెబుతున్న డైలాగ్‌లు టీజర్‌కు హైలెట్‌గా నిలిచాయి.
స్పైడర్ టీజర్‌ను యూట్యూబ్‌లో పోస్టు చేసిన గంటలో 33 వేలకు పైచిలుకు హిట్స్ వచ్చాయి. విజయ దశమి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.