Mahesh Babu Sarkaru Vaari Paata Teaser Records Creates History - Sakshi
Sakshi News home page

Sarkar Vari Pata: మోత మొదలైంది, అప్పుడే ఆ రి​కార్డు గల్లంతు

Published Tue, Aug 10 2021 5:10 PM | Last Updated on Tue, Aug 10 2021 7:31 PM

Mahesh Babu Fans Breaks Records With Svp Teaser On His Birthday - Sakshi

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబుకి రికార్డులు క్రియేట్‌ చేయడం, వాటినే మళ్లీ తానే బ్రేక్‌ చేయడం కొత్తేమి కాదు. సినిమా ఫస్ట్ లుక్‌ మొదలు, టీజర్‌, ట్రైలర్‌ అంటూ ధియేటర్లో బాక్సాఫీస్‌ మోత మోగించే వరకు  ప్రిన్స్‌ హవా కొనసాగడం గురించి  ప్రత్యేకంగా చెప్పక్కర్లలేదు. తాజాగా మ‌హేశ్‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన ‘సర్కారు వారి పాట’ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది యూట్యూబ్‌ రికార్డులను తిరగరాస్తోంది.

‘సర్కారు వారి పాట’ టీజర్‌ విడుద‌లైన 24 గంట‌ల్లో ఈ బ్లాస్ట‌ర్ ప్రోమోకు 25.7 మిలియ‌న్ వ్యూస్‌, 7ల‌క్ష‌ల 54వేల లైక్స్ వ‌చ్చాయి. దీంతో టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్‌గా రికార్డ్ క్రియేట్‌ చేసి మహేశ్‌ దూకుడు ఏ మాత్రం తగ్గలేదని ఈ టీజర్‌ మరో సారి నిరూపించింది. కాగా ఆగస్టు 9న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సినిమా టీజర్‌ రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్..  అందుకు కొద్ది గంటలకు ముందే సర్‌ప్రైజ్ చేశారు. ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ అంటూ అర్థరాత్రి 12 గంటలకే ఈ వీడియో విడుదల చేసి ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు.

ఒక నిమిషం 16 సెకనుల నిడివితో కూడిన ఈ వీడియో ఆయన అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఇందులో మహేశ్‌ మరింత యంగ్‌గా, స్టైలిష్‌ లుక్‌తో కనిపించి ఫ్యాన్స్‌కి కనువిందు చేశాడు. టీజర్‌లో డైలాగ్‌ డెలివరీ కేక పెట్టించాయ్‌.  ఇక కీర్తి, మహేశ్‌ల జోడి అయితే చూడముచ్చటగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement