
నో రెస్ట్
షూటింగ్ స్పాట్... మేకప్ కిట్... సై్టల్ కట్... చివరకు, డైరెక్టర్ కట్ చెప్పగానే ఆయన వాయిస్ వచ్చే మైక్ సెట్... ఈ వీకెండ్‌లో ఆల్మోస్ట్ అన్నీ ఛేంజ్ అవుతాయి. సినిమాలపై మహేశ్‌బాబు డెడికేషన్, ప్యాషన్ తప్ప! రెస్ట్ తీసుకోకుండా ఓ సినిమా సెట్ నుంచి మరో సినిమా సెట్‌కు ఆయన షిఫ్ట్ అవ్వనున్నారు. మొన్న మంగళవారం ఉదయమే మహేశ్‌బాబు లండన్ నుంచి వచ్చారు. ఫ్యామిలీతో కలసి హాలిడేకి వెళ్లిన ఆయన తిరిగొచ్చిన వెంటనే చెన్నైలోని ‘స్పైడర్’ సెట్‌కి వెళ్లారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
ఈ నెల 17 వరకు ‘స్పైడర్’ చెన్నై షెడ్యూల్ జరుగుతుంది. ఆదివారం ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని వచ్చే సోమవారం నుంచి కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రీకరణ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో మొదలైంది. మహేశ్ లేకుండా ఇతర నటీనటులపై సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు సోమవారం మహేశ్ ఈ చిత్రబృందంతో కలుస్తున్నారన్న మాట!!