
సాధారణంగా ఆహారాన్ని సంపాదించుకునేందుకు సాలీడు పురుగులు గూళ్లను అల్లుకుంటాయి. ఇందులో చిక్కిన కీటకాలు లేదా ఇతర సూక్ష్మజీవులు ఏవైనా సరే తప్పించుకోవడం మాత్రం అసాధ్యం. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తరంతుల అనే జాతికి చెందిన పెద్ద సాలీడు ఆహారాన్ని నోట కరచుకున్న ఈ పాత వీడియోను ‘వైల్డ్‌అట్రాక్షన్స్’ ఇన్‌స్టా పేజీలో షేర్ చేయడంతో మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు ‘‘వామ్మో.. ఇది చాలా భయంకరంగా ఉంది’’ అంటూ హ్యారీపోటర్ అండ్ చాంబర్ ఆఫ్ సీక్రెట్స్‌లోని సన్నివేశాలు గుర్తు చేసుకుంటుండగా.. మరికొందరు.. ‘‘స్పైడర్ ఫ్యాన్స్ ఈ వీడియోను ఎంజాయ్ చేస్తారు’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.
Comments
Please login to add a commentAdd a comment