
ప్రముఖ బ్రెజిల్ సింగర్ డార్లిన్ మోరైస్ (Singer Darlyn Morais) అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. సాలీడు కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన తీవ్రంగా పోరాడిన మోరైస్ చివరికి మృత్యువాత పడ్డాడు. ముఖంపై సాలీడు కుట్టడంతో చనిపోయాడని అతని భార్య అతని భార్య జులెన్నీ లిసోబ (Jhullenny Lisboa) స్థానిక మీడియాతో వెల్లడించింది.
మోరైస్ భార్య జులినీ లిసోబ అందించిన వివరాల ప్రకారం సాలీడు కుట్టిన వెంటనే మోరైస్ శరీరంలో నిస్సత్తువ ఆవహించింది. ఆ తరువాత ముఖం ఉబ్బిపోయింది. గాయం కూడా నల్లగా మారిపోయి అలర్జీలా వచ్చింది. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఈనెల 3న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ మోరైస్ పరిస్థితి మెరుగు కాకపోవడంతో తిరిగి ఆదివారం పల్మాస్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మోరైస్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మోరైస్ సోమవారం తుదిశ్వాస విడిచాడని లిసోబ తెలిపింది. అంతేకాదు మోరైస్ సవతి కూతురు (18)ని కూడా సాలీడు కుట్టిందని, అయితే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపింది. దీనిపై మోరైస్ కుటుంబం ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ కష్టసమయంలో తమకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది.
ఖలీజ్ టైమ్స్ ప్రకారం, మోరైస్ 15 సంవత్సరాల వయస్సులో తన సంగీత వృత్తిని ప్రారంభించాడు. తనదైన స్టయిల్‌తో ఒక బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో సోదరుడు ,స్నేహితుడితో కూడిన ముగ్గురు సభ్యుల బ్యాండ్ టోకాంటిన్స్, గోయాస్, మారన్‌హావో, పారా రాష్ట్రాల్లో విస్తృతమైన ప్రదర్శనలతో ఆకట్టుకునేది. ఎపుడూ సంతోషంగా, నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాడని , నలుగురికీ సాయం చేసే వాడంటూ మోరైస్‌ను తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు సమీప బంధువు వెస్లేయా సిల్వా. మోరైస్ ప్రతిభను గుర్తు చేసుకుంటూ తన సహచర గాయకుడికి స్నేహితులు నివాళులర్పించారు.
ఇది ఇలా ఉంటే బ్రెజిల్‌లో, కొన్ని రాష్ట్రాల్లో యాంటీ-వెనమ్ సీరమ్‌లు ఉత్పత్తి అవుతాని ఆరోగ్య సేవల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా బాధితులకు ఉచితంగా అందిస్తామని తెలిపింది. డార్లిన్ మోరైస్ మరణానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ (SES-TO) తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment