
దసరాకు వచ్చేస్తున్నా
‘స్పైడర్’గా మహేశ్‌బాబు ఫస్ట్ లుక్ సూపర్! అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి మహేశ్‌కు మాంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సేమ్ లుక్‌లో రెండున్నర గంటలు సిల్వర్ స్క్రీన్‌పై సూపర్‌స్టార్ సందడి ఎలా ఉంటుందో అనే ఊహ సినిమాపై రోజు రోజుకీ ఆసక్తిని పెంచేస్తోంది. దాంతో థియేటర్లలోకి ‘స్పైడర్’ ఎప్పుడొస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ద వెయిట్ ఈజ్ ఓవర్! ‘‘ఈ దసరాకు ‘స్పైడర్’ థియేటర్లలోకి వస్తుంది. బుధవారం ఐదు గంటలకు విడుదలయ్యే టీజర్‌తో పార్టీ మొదలవుతుంది’’ అని మహేశ్ స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. బుధవారం మహేశ్ తండ్రి కృష్ణ పుట్టినరోజు. సో.. డాడీ బర్త్‌డే గిఫ్ట్‌గా మహేశ్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.