
చూడటానికి అచ్చు సాలిపురుగు మాదిరిగా ఉన్న ఈ స్పైడర్ రోబోను జర్మనీకి చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీనికి బయోనిక్ వీల్ బోట్ అని నామకరణం చేశారు. దీనికి ఇరువైపులా ఉన్న 8 కాళ్లతో నడవడమే కాకుండా పరిగెత్తడం, గుండ్రంగా మారిపోయి వేగంగా వెంటాడుతుందట. దీన్ని మొరాకోలో ఉండే ఫ్లిక్–ఫ్లాక్ అనే సాలిపురుగును స్ఫూర్తిగా తీసుకుని తయారు చేశారు.
ఈ సాలిపురుగు కూడా తన శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఒక్కసారిగా ఉండలా మారి గాల్లోకి తనను తానే విసిరేసుకోవడం దీని ప్రత్యేకత. అంతేకాదు ఏదైనా ఆహారం ఉన్నా కూడా ఇలాగే చేస్తుందట. మన రోబో ఇలా ఉండలా మారి వెళ్లేందుకు వీలుగా ఇరువైపులా మూడు చొప్పున కాళ్లు అమర్చారు. మిగతా రెండు కాళ్లు రోబో ఉండలా మారినప్పుడు కూడా నడిచేందుకు వీలుగా తయారు చేశారు. కొండలు, రాళ్లు, మనుషులు వెళ్లేందుకు వీలులేని ప్రాంతాల్లో ఈ రోబో చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment