
జస్ట్ పది రోజులు చాలు!
జస్ట్... టెన్ డేస్! పదంటే పది రోజులు షూటింగ్ చేస్తే మహేశ్‌బాబు ‘స్పైడర్’ సిన్మా కంప్లీట్ అవుతుందట! దర్శకుడు ఏఆర్ మురుగదాస్ స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రీకరణ చాన్నాళ్లుగా జరుగుతోంది. ఈ సిన్మా టాకీ పార్ట్ ఆల్మోస్ట్ పూర్తయింది.
రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నెలలోనే వాటిని ఫారిన్‌లో పిక్చరైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు పాటల చిత్రీకరణకు పది రోజులు పడుతుందట. మహేశ్‌తో మొదటిసారి పని చేస్తోన్న మురుగదాస్... ‘‘హి (మహేశ్) ఈజ్ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఫ్రెండ్లీ అండ్ డౌన్ టు ఎర్త్’’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ స్వరకర్త. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌ను నెట్టింట్లో కోటీ యాభై లక్షల మందికి (15 మిలియన్ వ్యూస్) పైగా చూశారు.