వైరల్‌: పాము కాదు, స్పైడర్‌ కాదు మరేంటి? | Viral Video Is Freaking Out Netizens | Sakshi
Sakshi News home page

వైరల్‌: పాము కాదు, స్పైడర్‌ కాదు మరేంటి?

Published Tue, Jun 23 2020 9:04 PM | Last Updated on Tue, Jun 23 2020 9:10 PM

Viral Video Is Freaking Out Netizens - Sakshi

ప్రకృతి గురించి చెప్పాలంటే ఎవ‌రూ పూర్తిగా చెప్పలేరు. ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో తెలియ‌దు. అవి జ‌రిగిన‌ప్పుడు చూడాల్సిందే. అసలు ప్రకృతిలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో ఎవరికి తెలియకపోవచ్చు. కొన్ని రకాల జీవులను ఎప్పుడు చూసి ఉండం. అలాంటి జీవులు ఉన్నాయనేది కూడా మనకు తెలిసి ఉండదు. అలా ఉంటాయి ఆ వింత జీవులు. సోషల్‌ మీడియా పుణ్యమా అని కొన్ని వింత జీవులను మనం చూడగల్గుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో మరో వింత జీవికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అయింది. ఈ అసాధరమైన జీవి పేరు ఎంటో నెటిజన్లు కనుక్కోలేకపోతున్నారు.

పాము, సాలీడును పోలి ఉన్న ఈ జీవి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. వీడియో చూసి మొదట్లో ఇది పాము అని భావిస్తాం. కానీ కాసేపటి తర్వాత పాము కాదని తెలుస్తోంది. సాలీడు అనుకుంటే అదీ కాదు. ఐదు కాళ్లతో పాకుతూ ఆ జీవి కొలనులోకి వెళ్లిపోతుంది. 32 సెకండ్ల నిడివిగల ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 2.9 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఈ వింత జీవి వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఇది 2020 కాలం, అందుకే ఈ అద్భుతం’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా, ‘ ఐదు పాములు కలిసి ఒక తాబేలు తినడానికి ప్రయత్నించగా, అది తప్పించుకోని కొలనులోకి వెళ్లింది’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. దీని పేరు ‘ స్నేక్‌ స్పైడర్‌’ అని ఇంకో నెటిజన్‌ నామకరణం చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement