మలేషియాలో అనిరుధ్ షో వాయిదా | The concert in Malaysia on the 29th is postponed, says Anirudh Ravichander | Sakshi
Sakshi News home page

మలేషియాలో అనిరుధ్ షో వాయిదా

Published Sat, Mar 22 2014 1:10 PM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

మలేషియాలో అనిరుధ్ షో వాయిదా

మలేషియాలో అనిరుధ్ షో వాయిదా

వై దిస్ కోలవెర్రి పాటకు సంగీతం అందించి సంగీత అభిమానులను మైమరిపించిన అనిరుధ్ మలేషియాలో నిర్వహించాల్సిన షో వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఆ షో మరల ఎప్పుడు నిర్వహించేది వెల్లడిస్తామన్నారు. విమానం గల్లంతు పట్ల సంతాప సూచికంగా షోను వాయిదావేసినట్లు శనివారం అనిరుధ్ ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నారు.


మలేషియా విమానం అదృశ్యమై రెండు వారాలు గడిచిన ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో దేశ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఆ విమానంలోని ప్రయాణిస్తున్న తమ వారు సురక్షితంగా తిరిగి రావాలని వారి బంధువులు ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో షో వాయిదా వేసినట్లు చెప్పారు. అసలు అయితే ఈ నెల 29న అనిరుధ్ సంగీత విభావరి నిర్వహించవలసి ఉంది.


మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 విమానం కాలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తు అదృశ్యమైంది. ఆ విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయారు. దాంతో మలేషియాతోపాటు దాదాపు 26 దేశాలు విమానం ఆచూకీ కోసం గాలింపులు చర్యలు చేపట్టాయి. అయిన ఫలితం కనిపించకపోవడంతో ఆ విమాన ప్రయాణికులు బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మలేషియా అంతట విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement