'ఆ పాట నేను విడుదల చేయలేదు' | Simbu claims that he is not responsible for the release of Beep song | Sakshi
Sakshi News home page

'ఆ పాట నేను విడుదల చేయలేదు'

Published Sun, Dec 13 2015 6:50 PM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

'ఆ పాట నేను విడుదల చేయలేదు'

'ఆ పాట నేను విడుదల చేయలేదు'

చెన్నై: బీప్ పాటను తాను విడుదల చేయలేదని తమిళ హీరో శింబు తెలిపాడు. అనిరుధ్‌ రవిచందర్ స్వరపరిచిన 'ఎన్న పీ***** లవ్ పన్ రోమ్' పాటలో అసభ్యకర పదాలు ఉండడంతో బీప్ సాంగ్ గా పేర్కొంటున్నారు. ఈ పదాలు స్పష్టంగా విన్పిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

ఈ పాట బయటకు రావడంపై గీత రచయిత చారు నివేదిత విస్మయం వ్యక్తం చేశాడు. భారీ వర్షాలతో చెన్నై, తమిళనాడులోని కొన్ని జిల్లాలు అతలాకుతలమైన తరుణంలో బీప్ సాంగ్ ను విడుదల చేయడాన్ని అతడు ఖండించాడు. అయితే తాను రాసిన ఈ పాటలో ప్రయోగించిన పదాలపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నాడు.

ఈ పాటను తాను విడుదల చేయలేదని శింబు వివరణయిచ్చాడు. అకారణంగా తనను నిందించడం తగదని అన్నాడు. ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ పాట అసభ్యకరంగా ఉందని శ్రోతలు మండిపడుతున్నారు. శింబు, అనిరుధ్ లపై మహిళా హక్కుల సంఘం 'ఆల్ ఇండియా డెమొక్రటిక్ వుమన్స్ అసోసియేషన్' కోయంబత్తూర్ లో ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం అతడు టొరంటోలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement