లండన్‌లో కచేరికి రెడీ | Anirudh Grand Musical Concert In London And Paris | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 6 2018 10:16 AM | Last Updated on Fri, Apr 6 2018 10:46 AM

Anirudh Grand Musical Concert In London And Paris - Sakshi

యువ సంగీత దర్శకుడు అనిరుద్‌

తమిళ సినిమా : యువ సంగీత దర్శకుడు అనిరుద్‌ లండన్‌లో భారీ సంగీత కచేరీకి రెడీ అవుతున్నారు. సంగీతం, గానం, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ అంటూ బిజీ బీజీగా ఉన్న ఈ యువ సంగీత దర్శకుడు ప్రస్తుతం కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించనున్న భారీ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా లేడీ సూపర్‌స్టార్‌ నయనతాన నటిస్తున్న కోలమావు కోకిల చిత్రానికి ఈయనే సంగీతదర్శకుడు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ తొలిసారిగా లండన్‌లో సంగీత కచేరీకి సిద్ధం అవుతున్నారు. 

జూన్‌ 16,17 తేదీల్లో అక్కడ బ్రహ్మాండ సంగీత విభావరికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను హంసిని ఎంటర్‌టైన్మెంట్, హ్యూ బాక్స్‌ స్డూడియోస్‌ సంస్థలు చేస్తున్నాయి. ఆ వివరాలను ఈ సంస్థ నిర్వాహకులు గురువారం మీడియాకు విడుదల చేశారు. జూన్‌ 16న లండన్‌లోని ఎస్‌ఎస్‌ఈ వెంబీ ఎరేనా అనే ప్రాతంలో అనిరుద్‌ సంగీత కచేరి జరగనుందని, అదే విధంగా జూన్‌ 17న ప్యారిస్‌ నగరంలోని జెనిత్‌ అనే ప్రాంతంలో జరగనుందని వెల్లడించారు. 

వై దిస్‌ కొలై వెరిడీ పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన అనిరుద్‌ లండన్‌లో నిర్వహిస్తున్న సంగీత కచేరి ఇదే అవుతుందన్నారు. ఈ కచేరీలో తమిళ సంగీత ప్రియులను అలరించే విధంగా  పూర్తిగా తమిళ పాటలనే పాడతారని తెలిపారు. అదే విధంగా ఇంతకు ముందెన్నడూ అనిరుద్‌ సంగీత విభావరి జరగనంత గ్రాండ్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంగీత విభావరిలో జెనితాగాంధీ లాంటి పలువురు ప్రముఖ గాయనీగాయకులు, సంగీతదర్శకులు పాల్గొననున్నారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement